हैदराबाद : तेलंगाना के बीजेपी अध्यक्ष और सांसद बंडी संजय ने आरटीसी क्रॉस रोड स्थित देवी थिएटर 70 MM में ‘बलगम’ फिल्म देखी। सोमवार, 10 अप्रैल की दोपहर संजय ने भाजपा के अन्य नेताऔर कार्यकर्ताओं के साथ बड़ी संख्या में सिनेमाघरों में यह फिल्म देखी।
बंडी संजय, चिंतल रामचंद्र रेड्डी और नगरसेवकों के साथ 200 से अधिक लोगों ने बलगम फिल्म देखी। यह फिल्म तेलंगाना के हर गांव में सार्वजनिक रूप से दिखाई जा रही है। इस फिल्म को देखने के बाद कई बिछड़े हुए परिवार फिर से एक/मिल हो रहे हैं।
इस फिल्म में तेलंगाना की संस्कृति, परंपराओं और गांव के संबंधों को बखूबी दिखाया गया है। उल्लेखनीय है कि इस फिल्म को देखने के लिए बंडी संजय समेत भाजपा के तमाम नेता थियेटर पहुंचे। क्योंकि बलगम फिल्म पहले ही ओटीटी पर आ चुकी है। हालांकि, थिएटर में जाकर इसे देखना फिल्म के प्रति बंडी संजय के जुनून को दर्शाता है।
फिल्म ‘बलगम’ में प्रियदर्शी और काव्या कल्याणराम मुख्य भूमिकाओं में हैं और वेणु द्वारा निर्देशित है। यह फिल्म हंसिता रेड्डी और हर्षित रेड्डी द्वारा दिल राजू प्रोडक्शंस बैनर के तहत संयुक्त रूप से निर्मित है। भीम्स ने फिल्म के लिए संगीत तैयार किया। सुधाकर रेड्डी, मुरलीधर गौड़ और कई अन्य कलाकारों ने उत्कृष्ट प्रदर्शन से मनोरंजन किया। पारिवारिक संबंधों, ग्रामीण परिवेश, तेलंगाना संस्कृति को दर्शाने वाली फिल्म बलगम सिनेमाघरों और ओटीटी प्लेटफार्मों पर सुनामी पैदा कर दी है।
బలగం సినిమా చూసిన బండి సంజయ్
హైదరాబాద్ : ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి ధియేటర్ లో బలగం సినిమా చూశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్. ఏప్రిల్ 10వ తేదీ సోమవారం మధ్యాహ్నం బండి సంజయ్ తోపాటు ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధియేటర్ లో సినిమా చూశారు.
బండి సంజయ్ తోపాటు చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్లు 200 మంది వరకు బలగం సినిమా చూశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో ఈ సినిమాను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత విడిపోయిన ఎన్నో కుటుంబాలు కలుస్తున్నాయి.
తెలంగాణ సంస్క్రుతి, సంప్రదాయాలు, గ్రామాల్లోని అనుబంధాలను ఎంతో చక్కగా చూపించింది ఈ సినిమా. ఘన విజయం సాధించిన ఈ సినిమాను బండి సంజయ్ తోపాటు బీజేపీ నేతలు అందరూ ధియేటర్ కు వెళ్లి చూడటం విశేషం. ఎందుకంటే ఇప్పటికే ఓటీటీల్లోకి వచ్చేసింది మూవీ. అయినా ధియేటర్ కు వెళ్లి చూడటం సినిమాపై ఆయనకు ఉన్న మక్కువను చెబుతోంది.
‘బలగం’ మూవీలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలను పోషించగా వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ సహా ఎంతో మంది అద్భుతమైన నటనతో అలరించారు. కుటుంబ అనుబంధాలు, పల్లె వాతావరణం, తెలంగాణ కల్చర్ ప్రతిబింబిస్తూ అటు థియేటర్స్, ఇటు ఓటీటీ వేదికపై సునామీ సృష్టిస్తోంది ఈ బలగం. (ఏజెన్సీలు)
