పేదలకు ఉన్నత విద్యను దూరం చేయాలని ప్రభుత్వం కుట్ర: BRAOU జేఏసీ నేతల

ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024ను వ్యతిరేకిస్తూ Dr B R Ambedkar Open Universityలో సంతకాల సేకరణ
62వ రోజుకు చేరిన అంబేద్కర్ వర్శీటీ ఉద్యోగుల నిరసనలు

హైదరాబాద్ : రాష్ట్రంలోని పేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ జేఏసీ నేతలు ఆరోపించారు. విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలం జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024ను వ్యతిరేకిస్తు ఉద్యోగులు బుధవారం కూడా నిరసనను కొనసాగించారు. ప్రభుత్వం తన ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని సంతకాలు చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబడే, కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ డా. పి. వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు, విద్యార్థుల నుంచి ఉద్యోగుల డిమాండ్ కు మద్దతుగా సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్ కి, ముఖ్యమంత్రికి పంపించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నెల 27న (బుధవారం) విశ్వవిద్యాలయంలో వంటా వార్పూ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Also Read-

కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు బైఠాయించి, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనను కొనసాగించారు. కార్యక్రమంలో ప్రొ. ఆనంద్ పవార్, డా. ఎల్వీకే రెడ్డి; ప్రొ. చంద్రకళ, డా. రజని, డా. యకేశ్ దైద; డా. ఉదయిని, డా. నరసింహులు; శివమ్ము; కాంతం ప్రేమ్ కుమార్; డా. కిషోర్; డా. రాఘవేంద్ర, పాండు, షబ్బీర్, రాములు అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X