BRAOU: ఉద్యమం ఉదృతం, ప్రభుత్వ లేఖను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ…

61వ రోజుకు చేరిన అంబేద్కర్ వర్శీటీ ఉద్యోగుల నిరసనలు

హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలం జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 ను వ్యతిరేకిస్తు ఉద్యోగులు మంగళవారం కూడా నిరసనను కొనసాగించారు. ప్రభుత్వం తన ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబడే, కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ డా. పి. వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20న ప్రభుత్వ లేఖకు వ్యతిరేకంగా ఉద్యోగుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు బైఠాయించి, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనను కొనసాగించారు.

Also Read-

నిరసన కార్యక్రమంలో జేఎసీ నేతలు డా. ఎల్వీకే రెడ్డి, డా. బానోత్ ధర్మ; కాంతం ప్రేమ్ కుమార్; డా. రాఘవేంద్ర, డా. రజిత; డా. అవినాష్; డా. కిషోర్; అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X