Dr B R Ambedkar Open University ఉద్యోగుల నిరసనలు ఉదృతం, 27న వంటా వార్పు

భూ కేటాయింపు ప్రభుత్వ లేఖ 1043/TE/A12/2024ను ఉపసంహరించుకోవాలని ఉద్యోగుల డిమాండ్

60వ రోజుకు చేరిన ఉద్యోగుల నిరసనలు

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలం జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబడే, కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ డా. పి. వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న విశ్వవిద్యాలయంలో వంటా వార్పూ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నేతలు డ. రజిని, డా. కె. కృష్ణా రెడ్డి, డా. యాకేష్ దైద ఉన్నారు.

Also Read-

మరోవైపు విశ్వవిద్యాలయంలో గత 60 రోజులుగా కొనసాగుతున్న మధ్యాహ్నా భోజన విరామ సమయంలో జరిగిన నిరసనలో జేఎసీ నేతలు ప్రొ. పుష్పా చక్రపాణి, ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. చంద్రకళ, డా. ప్రమీలా కేతావత్, ప్రొ. మేరీ సునందా, కాంతం ప్రేమ్ కుమార్; బ్రహ్మానంద నాయుడు; డా. అవినాష్; డా. కిషోర్; డా. రాఘవేంద్ర, అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X