YFC : అమరుల త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన KCR ప్రజలను మోసాగించారు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : “అమరుల త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసాగించారు.” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా బుధవారం నిజామాబాద్ నియోజకవర్గం పరిధిలోని దుబ్బ చౌరస్తా నుంచి నెహ్రూ పార్క్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం నెహ్రూ పార్క్ వద్ద నిర్వహించిన జన సభలో ఆయన ప్రసంగించారు.

నిజామాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ నిర్మించిన శ్రీరాం సాగర్ గుర్తొస్తుంది. నాటి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథిని బంధించిన జైలు గుర్తొస్తుంది. నిజామాబాద్ కు గొప్ప పేరు తెచ్చిన మహనీయుల గడ్డను ఇప్పుడు ఎవరు ఏలుతున్నారు. ఎలాంటి నాయకులను ఎన్నుకున్నారు? అమరుల త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసాగించారు. నిజామాబాద్ లో తెలంగాణ యూనివర్సిటీ,మెడికల్ కాలేజ్, 30 పడకల ఆసుపత్రి కాంగ్రెస్ హయాంలో వచ్చిందే. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్.

ఎవరు వ్యాపారం చేసినా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే పెట్టుబడి లేకుండా భాగస్వామి కాదా? అమరవీరుల స్థూపంలో అవినీతి జరిగింది. అంబెడ్కర్ విగ్రహం, సచివాలయ నిర్మాణంలో అవినీతి జరిగింది. అవినీతిపై మూడు రోజులుగా మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా స్పందించడం లేదు. తన చెంచాలతో నన్ను తిట్టిస్తున్నాడు. పెద్దమనిషి స్థానంలో ఉన్న పోచారం.. ఇసుక దందాలను తన కొడుకులకు పంచి ఇచ్చిండు.

మోదీ తన జేబులో ఉన్నాడన్న అరవింద్ పసుపు బోర్డు ఎందుకు తేలేదు? ధర్మపురి అరవింద్ పేరులోనే ధర్మం ఉంది. ఆయన పనిలో అధర్మం కనిపిస్తుంది. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం. కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూడొద్దు. తల్లిని చంపి పిల్లను బతికించారని మోదీ తెలంగాణను అవమానించారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఉచితంగా అందిస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలలను ఏడాదిలోగా భర్తీ చేస్తాం. పేదలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించే బాధ్యత కాంగ్రెస్ ది. ఎవరు మైనారిటీల సంక్షేమానికి పాటుపడ్డారో ముస్లిం సోదరులు ఆలోచించండి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి.

ఆదానీ, ప్రధాని వేర్వేరు కాదు..ఆదానీయే ప్రధాని… ప్రధానే ఆదానీ : రేవంత్ రెడ్డి

ఆదానీ, ప్రధాని వేర్వేరు కాదు..ఆదానీయే ప్రధాని… ప్రధానే ఆదానీ అని వ్యాఖ్యానించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అదానీ అంశంపై జేపీసీ వేయాలనే డిమాండ్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నేపథ్యంలో ఆయన బుధవారం నిజామాబాద్ పాదయాత్ర క్యాంపులో మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ పిలుపు మేరకు అదానీ వ్యవహారం పై జేపీసీ వేయాలన్న డిమాండ్ తో రాజ్ భవన్ కు ర్యాలీగా వెళుతున్న సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క బృందాన్ని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

కరోనా ప్రభావంతో ప్రపంచం అతలాకుతలం అయితే అదానీ సంపద మాత్రం 819 శాతం పెరిగిందన్నారు. 2014 తరువాత మోదీ దేశ సంపదను ఆదానీ అంబానీలకు దోచి పెడుతున్నారు. దీనిపై రాహుల్ గాంధీ ప్రతీ సందర్భంలో చెబుతూ వచ్చారు. బ్రిటీషర్ నమూనానే ఆదానీ రూపంలో దేశాన్ని మోదీ కట్టు బానిసను చేస్తున్నారని రైతు చట్టాలపై కాంగ్రెస్ పోరాడింది. ఆదానీ కుంభకోణంపై పార్లమెంటులో చర్చ జరగకుండా విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు.

ఒక ప్రయివేటు సంస్థ లక్షల కోట్ల ప్రజా ధనాన్ని లూఠీ చేస్తే.. ఈడీకి పిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ వెళితే ఎందుకు అడ్డుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే. దీని వెనక అసలు సంగతి ఏమిటో మోదీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ హయాంలో బొగ్గు కుంభకోణం, 2జీ, కామన్ వెల్త్ గేమ్స్ పై జేపీసీని నియమించింది. పారదర్శక విచారణ జరగడానికి సహకరించింది. ఆదానీ షేర్ల విలువ కృత్రిమంగా పెంచి మోదీ ఎల్ఐసీ, ఎస్బీఐ నుంచి లక్ష కోట్లు పెట్టుబడి పెంచారు.

10లక్షల కోట్లు పేదల సొమ్ము కొల్లగొట్టారు. ఒక వ్యక్తిని కాపాడేందుకు కేంద్రం ఎందుకు ప్రయత్నం చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే.. కేసీఆర్ ప్రభుత్వం అడ్డు తగిలి అరెస్టులు చేసింది. వినతిపత్రం ఇవ్వడానికి వెళితే మా సీఎల్పీ నేతను ఎందుకు పోలీసులు అడ్డుకున్నారు? ఈ దేశంలో పేదలతో పెట్టుబడులు పెట్టించి.. హవాలా రూపంలో ఇతర దేశాలకు తరలించిందని నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రంలో, ఢిల్లీలో కాంగ్రెస్ నేతల అరెస్టుతో ఆదానీ, ప్రధాని చీకటి ఒప్పందం బయటపడింది..మోదీ చెప్పిన డబుల్ ఇంజన్ సర్కారు ఇదే. ఆదానీ కుంభకోణం పై ఈడీ విచారణ చేపట్టాలి. జేపీసీని నియమించి బీజేపీ తమ నీతిని నిరూపించుకోవాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

కేటీఆర్ వ్యాఖ్యాలకు రేవంత్ రెడ్డి కౌంటర్

కామారెడ్డి జిల్లా పిట్ల సభలో బుధవారం 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏమీ చేసిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిజామాబాద్ లో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చలువే అన్నారు. రాష్ట్రంలో 30 వేల పాఠశాలలు, వెయ్యి జూనియర్ కాలేజీలు, 100 డిగ్రీకాలేజీలు, 11 యూనివర్సిటీలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనే. కేసీఆర్, కేటీఆర్ చదువుకున్న పాఠశాలలు నిర్మించింది కూడా కాంగ్రెస్ పార్టీనే. మేం తెలంగాణ ఇచ్చినందుకే కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రి అయ్యారు.

24 గంటల కరెంటు ఈ ప్రభుత్వం ఇస్తుందని నిరూపిస్తే..దేనికైనా సిద్ధం. మీరేం చేశారో.. మేమేం చేశామో మీడియా మిత్రుల సమక్షంలో చర్చకు సిద్ధమా? కేటీఆర్ కు సవాలు విసిరారు. మేం ఏమేం చేశామో నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టమీదైనా.. ఇంకెక్కడైనా మాట్లాడేందుకు సిద్ధం. బీఆరెస్ చేసింది.. 3 వేల వైన్ షాపులు..60 వేల బెల్ట్ షాపులు పెట్టడం మాత్రమే. అంతకు మించి రాష్ట్రానికి బీఆరెస్ చేసిందేమీ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X