“వాతావరణ మార్పు–భూమాత ఎదుర్కొంటున్న సవాళ్లపై దృష్టి” అనే ఇతివృతంపైపర్యావరణ ప్రతిజ్ఞను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

ప్రపంచ పర్యావరణ దినోత్సవం- 2026 సంధర్భంగా “వాతావరణ మార్పు–భూమాత ఎదుర్కొంటున్న సవాళ్లపై దృష్టి” అనే ఇతివృతంపై పర్యావరణ ప్రతిజ్ఞను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

సిగ్నేచర్ క్యాంపైన్ లో పాల్గొన్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
ప్రపంచ పర్యావరణ ప్రచార కార్యక్రమం 2026, మే 15 నుండి జూన్ 5, 2026 వరకు పాటించబడుతుంది

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే “వాతావరణ మార్పు – భూమాత ఎదుర్కొంటున్న సవాళ్లపై దృష్టి” అనే ఇతివృత్తంతో, ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2026 ప్రారంభోత్సవ కార్యక్రమాన్నిఈ రోజు,అనగా 2026 మే 15వ తేదీన సికింద్రాబాద్‌లోని ప్రధాన కార్యాలయమైన రైల్ నిలయంలో నిర్వహించింది. ఈ సంధర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులు మరియు సిబ్బంది చేత పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించి, సిగ్నేచర్ క్యాంపైన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రధాన అధిపతులు, సిబ్బంది మరియు ఆర్‌పిఎఫ్ పాల్గొని, పర్యావరణ పరిరక్షణ పట్ల తమ నిబద్ధతను వ్యక్తం చేశారు.

రైల్వే బోర్డు ఆదేశాల మేరకు, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని డివిజన్లు, స్టేషన్లు, కాలనీలు, వర్క్‌షాపులు, క్షేత్ర స్థాయి విభాగాలు మరియు పరిపాలనా కార్యాలయాలన్నింటిలోనూ, 2026, మే 15 నుండి జూన్ 5, 2026 వరకు మూడు వారాల పాటు ఈ కార్యక్రమం కోనసాగుతోంది. భారతీయ రైల్వేలు ఈ సంవత్సరం, పర్యావరణంలో కాలానుగుణంగా వస్తున్న వాతావరణ మార్పులు మరియు వాటి చెడు ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ‘మిషన్ లైఫ్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ అధిక సంఖ్యలోప్రజలను మమేకం చేసే అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది.

ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, ఈ పర్యావరణ ప్రతిజ్ఞ కేవలం ఒక లాంఛనప్రాయమైన ప్రతిజ్ఞ మాత్రమే కాదని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవాలనే ఒక స్ఫూర్తి అని పేర్కొన్నారు. సుస్థిర, పర్యావరణ అనుకూల పద్ధతుల ద్వారా భూమాతను రక్షించాల్సిన మన సామూహిక బాధ్యతను ప్రపంచ పర్యావరణ దినోత్సవం గుర్తు చేస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం, వాతావరణ మార్పులపై అవగాహన, “ఏక్ పెడ్ మా కే నామ్,” స్వచ్ఛమైన గాలి మరియు పచ్చని ప్రదేశాలు, ఇ-వ్యర్థాలతో సహా శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, మరియు రైల్వేలలో జీరో కార్బన్ ఉద్గారాలను సాధించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని తెలియజేశారు.

Also Read-

ఈ సందర్భంగా ముందుగా చీఫ్ ఇంజనీర్, ఇఎన్.ఎచ్.ఎమ్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, దక్షిణ మధ్య రైల్వే సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ల నిర్మూలన, వ్యర్థాల నిర్వహణ, నీరు, ఇంధన పొదుపు మరియు పునరుత్పాదక శక్తి ప్రోత్సాహకం వంటి పర్యావరణ సానుకూల ప్రభావం చూపే కార్యక్రమాలను నిరంతరం చేపడుతోందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X