నాణ్యమైన ఉన్నత విద్యకి సమగ్ర పద్ధతులు అవసరం : ప్రొఫెసర్ వి. ఎస్. ప్రసాద్, న్యాక్ మాజీ డైరెక్టర్

హైదరాబాద్ : నాణ్యమైన ఉన్నత విద్యకి సమగ్ర పద్ధతులు అవసరమని న్యాక్ మాజీ డైరెక్టర్ ప్రొ. వి.ఎస్. ప్రసాద్ పేర్కొన్నారు. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సహకారంతో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC – బెంగళూరు) రెండు రోజుల కార్యశాలను బుధవారం ఆ యూనివర్సిటీ క్యాంపస్లో ప్రారంభించింది.

వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ సమాన, అందరికి అందుబాటులో విద్య అనే డా. బి. ఆర్. అంబేద్కర్ దార్శనికతకు విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. సొంతంగా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (LMS) అభివృద్ధి, వెబ్ ఆధారిత టెలివిజన్ స్టేషన్ ఏర్పాటు, వెబ్ రేడియో సేవల (Hi BRO) ప్రారంభం, ఓపెన్ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా డిజిటల్ – పుస్తకాల అధ్యయనానికి ప్రోత్సాహం, గ్రంథాలయ సేవల డిజిటలీకరణ, మైక్రో-క్రెడెన్షియల్ కోర్సుల అభివృద్ధి వంటి డిజిటల్ కార్యక్రమాలను వర్శిటీ ప్రారంభించిందని వివరించారు. ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) సంస్థలకు డిజిటల్ హబ్ గా ఎదగాలనేది విశ్వవిద్యాలయ లక్ష్యం గా ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాక్ మాజీ డైరెక్టర్, బి.ఆర్.ఏ.ఓ.యూ. మాజీ వీసీ ప్రొ. వి. ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ ఉన్నత విద్యలో నాణ్యత పరీక్ష అనేది ప్రాథమిక అంశం అని దాన్ని పరిశీలించాల్సిన భాద్యత ఆయా విద్యా సంస్థలపైనే ఉందని పేర్కొన్నారు. నియంత్రణ, అక్రిడిటేషన్ అందించే సంస్థలు కేవలం నిబంధనలను పాటించడానికే పరిమితం కాకుండా, సరికొత్త ఆవిష్కరణలను, సంస్థాగత అభివృద్ధిని ప్రోత్సహించే విధానాన్ని అవలంబించాలని సూచించారు. నిరంతర స్వీయ అభివృద్ధి, అనుకూలత, విశ్లేషణాత్మక పద్ధతులు, సంస్థాగత స్వయం ప్రతిపత్తిని ప్రోత్సహించే నాణ్యతా హామీ (QA) వ్యవస్థలను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పారదర్శక, నైతిక, భాగస్వామ్య పద్ధతులను సంస్థాగతం చేయడం ద్వారా అక్రిడిటేషన్, మూల్యాంకన ప్రక్రియలలో సమగ్రత, విశ్వసనీయత, నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యతను ప్రొ. వి.ఎస్. ప్రసాద్ గుర్తు చేశారు.

కార్యక్రమంలో విశిష్ట అతిథిగా న్యాక్ డైరెక్టర్ ప్రొ. గణేసన్ కన్నభిరాన్ పాల్గొని ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యలో నాణ్యత, అధ్యయన పద్దతులను బలోపేతం చేయడానికి, సంప్రదాయ అక్రిడిటేషన్ ప్రక్రియలకు అతీతంగా పరిశోధన, సరి కొత్త ఆవిష్కరణ, సంస్థాగత సామర్థ్య నిర్మాణాలకు న్యాక్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆన్లైన్ విద్య కోసం పటిష్టమైన నాణ్యత హామీ ఫ్రేమ్ వర్క్ లను రూపొందించడం, అమలు చేయడంలో పాల్గొనే సంస్థల సామర్థ్యాన్ని మరింతగా పెంపొందించడమే ఈ రెండు రోజుల కార్యశాల లక్ష్యమని పేర్కొన్నారు. ఇందులో పలు విద్యా సంస్థల నుంచి హాజరైన అధ్యాపకుల చర్చలు, నిపుణుల సంభాషణలు, ఇందులో పాల్గొనే విశ్వవిద్యాలయాలు భాగమయ్యే ఎనిమిది నెలల ప్రాజెక్ట్లో భాగంగా ఒక సమగ్ర హ్యాండ్బుక్, ఆన్లైన్ కార్యక్రమాల అభివృద్ధికి కూడా దోహదపడతాయని వెల్లడించారు.

కామన్వెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా (CEMCA – న్యూ ఢిల్లీ ) డైరెక్టర్ డాక్టర్ బి. షెడ్రాక్ అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విధానపరమైన ప్రచారం, సంస్థాగత సామర్థ్య బలోపేతం, అభ్యాసకుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, సాంకేతికత ఆధారిత విద్యా వ్యవస్థల అభివృద్ధిని కామన్వెల్త్ అఫ్ లెర్నింగ్ (COL), కామన్వెల్త్ అఫ్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా (CEMCA) విస్తృతంగా చేపడుతున్నామని వెల్లడించారు. డిజిటల్ పరివర్తన, ఏఐ-ఆధారిత విద్యా వ్యవస్థల అభివృద్ధి, నాణ్యత మధ్య సమర్థవంతమైన సమతుల్యతను కాపాడుకోవడానికి విద్యాసంస్థలు కృషి చేయాలని సూచించారు. ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్, ఆన్లైన్ విద్యలో నాణ్యత హామీ, డిజిటల్ ఆవిష్కరణలను బలోపేతం చేయడంలో సహకారం, సంస్థాగత నెట్వర్కింగ్ ప్రాముఖ్యతను న్యాక్ ప్రతినిధి డా. బి.ఎస్. పొన్ముదిరాజ్ రాజ్ (బెంగళూరు) ప్రస్తావించారు.

ఇది కూడ చదవండి-

కార్యక్రమంలో ఇందిరాగాంధీ జాతీయ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) వైస్ ఛాన్సలర్ ప్రొ. ఉమా కంజిలాల్, దక్షిణాఫ్రికాకు చెందిన శ్రీమతి బ్రిటా, శ్రీమతి మరియా, బీఆర్ఏఓయూ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్పా చక్రపాణి పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యశాలలో దేశవ్యాప్తంగా మొత్తం ఆన్లైన్ విద్యను అందిస్తున్న పలు విద్య సంస్థలకు చెందిన 56 మంది విద్యా రంగ నిపుణులు పాల్గొన్నారు. బీఆర్ఏఓయూ, సికా డైరెక్టర్ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్ ప్రారంభ సమావేశానికి వందన సమర్పణ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X