“తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ వివాదం దురదృష్టకరం”

చంద్రబాబు నాయుడు గారు విజనరి లీడర్… అలాంటి వ్యక్తి ఇంత మంది భక్తులును ఆందోళన కి గురి చేసే స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో అర్ధం కావట్లేదు. లడ్డూ కల్తీ జరిగిందని చంద్రబాబు… ఏదయినా జరిగితే విచారణ చేయండని మాజీ సీఎం జగన్ అంటున్నారు. దేశ విదేశాల్లో వున్న భక్తులు ఇపుడు లడ్డూ తినాలా వద్దా అనే ఆందోళన లో వున్నారు.

తిరుపతిలో స్వామి దర్శనం తర్వాత లడ్డూ ప్రసాదం తింటేనే భక్తులుకి తృప్తి. ఇపుడా తృప్తి లేకుండా చేస్తున్నారు. తిరుపతి వెంకన్న స్వామి అందరివాడు. వైసీపీ – టీడీపీ రాజకీయ గొడవల్లో శ్రీవారిని ఆలయాన్ని ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేయకండి.

మీ రాజకీయాలు కొట్లాటలు వేరే సబ్జెక్టుల మీద. వేరే అంశాలు మీద పెట్టుకోండి. అంతే కానీ దేవుడి విషియంలో కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏం జరిగిందో తక్షణమే విచారణ చేసి దోషులను శిక్షించాలని కోరారు. హిందువుల మనోభావాలను కాపాడాలని సూచించారు.

Also Read-

తక్షణం దీని మీద విచారణ చేసి దోషులని శిక్షంచాలి. ఈ విషయంలో రాజకీయాలు మానేయండి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ లడ్డు విశిష్టతను కాపాడటంపై అధికార టిడిపి ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు దృష్టి పెట్టాలని కోరుతున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఏపీలోని రాజకీయ పార్టీలకు ఇది నా విజ్ఞప్తి

తూర్పు జగ్గారెడ్డి
Ex ఎమ్మెల్యే
సంగారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X