తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ : వైద్య విద్యార్థికి శ్రద్ధాంజలి

హైదరాబాద్ : సమాజంలో పెరుగుతున్న హింసకు కారణాలను సమూలంగా తొలగిస్తే తప్ప ఈ అత్యాచారం పర్వం ఆగదని ఫలక్నామా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫలక్నామాలో బెంగాల్ ఆర్ జి కార్ ఆసుపత్రిలో అత్యాచారానికి బలై మరణించిన వైద్య విద్యార్థికి శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ ఘటనలో పాల్గొన్న నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సంఘటన సర్వ సమాజం తరలించుకునేదని ఎంతో ఆవేదనకు గురిచేసిందని అన్నారు.

కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎల్ శశికళ ప్రసంగిస్తూ ఈ ఘటనకు కారకులైన దోషులను ప్రత్యేక కోర్ట్ ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతోపాటు సామాజిక బాధ్యతలను నేర్పాలని, ఆడపిల్లలకు యుద్ధ విద్యలు శిక్షణ ఇప్పించాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ పాతబస్తీ అధ్యక్షులు శ్రీ ఎస్ రామకృష్ణ శాస్త్రి మాట్లాడుతూ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన ప్రతి ఒక్కరిని హృదయాలను కలచి వేసిందని, ఇలాంటి ఘటనలతో వైద్యుల్లో ఆ భద్రతాభావంతో పాటు ఆత్మశైర్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం విచ్చేశారు.

తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ ముత్యం యాదవ్ మాట్లాడుతూ రోజురోజుకు మహిళలపై, చిన్న పిల్లలపై లైంగిక దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వాలు నిందితులకు తొందరగా గుర్తించి కఠిన శిక్షలు అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా యువత మత్తు, మద్యం, డ్రగ్స్ అలవాటు పడి సైకోలుగా మారి ఇలాంటి ఘటనలు అధికంగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ డాక్టర్ డేవిడ్, డాక్టర్ గంగాధర్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు శ్రీ కాశమోని శ్యామ్ రావు ముదిరాజ్ తో పాటు కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కాండీల్స్ వెలిగించి, ప్లకార్డులు ద్వారా శ్రద్ధాంజలి ఘటించి ఆమె ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Also Read-

Telangana Citizen Council : Shradanjali to Abhaya

Hyderabad: Falaknama Degree College Principal Dr K Praveen Kumar said that unless the root causes of the growing violence in the society are eradicated, the rampant rape will not stop. On Wednesday, under the auspices of the Telangana Citizens Council, he participated in a tribute program to the medical student who died of rape at the Bengal RG Kar Hospital at the Government Degree College, Falaknama. The accused involved in this incident should be immediately arrested and punished according to law. He said that the whole community was moved by this incident.

NSS program officer of the college, Dr L Sasikala, while speaking, opined that a special court should be set up and the culprits responsible for this incident should be severely punished, parents should teach their children social responsibilities along with education, and girls should be trained in martial arts.

President of Telangana Citizen Council Patabasti Mr. S. Ramakrishna Shastri said that the incident of rape on the doctor has touched the hearts of everyone and expressed concern that with such incidents the sense of security and morale of the doctors will be damaged. Chief Coordinator of Telangana Citizen Council Mr. Mutyam Yadav said that sexual assaults and rapes on women and children are increasing day by day and the government should identify the culprits and implement strict punishments.

Similarly, he expressed his concern that youths become addicted to alcohol, drugs and become psychos and such incidents are happening more and more. In this tribute program, college lecturers Dr. David, Dr. Gangadhar Congress Party OBC Cell Greater Hyderabad Vice President Mr. Kashamoni Shyam Rao Mudiraj along with NSS students of the college lit candles and paid their respects through placards and observed two minutes silence for her soul to rest in peace.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X