రేణిగుంట – అగర్తలా మధ్య పార్శిల్ కార్గో ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వేలోని గుంతకల్లు డివిజన్, చదవండి దిని ప్రత్యేకతలు…

హైదరాబాద్ : క్షిణ మధ్య రైల్వేలోని గుంతకల్లు డివిజన్ సరుకు రవాణా లాజిస్టిక్స్‌ను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన మైలురాయిగా, రేణిగుంట–నిశ్చింతపూర్(అగర్తలా) మధ్య పార్సెల్ కార్గో ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించింది. తొలి సర్వీసును మే 7న రేణిగుంట రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైంది.

ఇటీవలి కాలంలో రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా రేణిగుంట మరియు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తుల సాగు విస్తృత స్థాయిలో జరుగుతోంది. మార్కెట్ అవకాశాలను మెరుగుపరచడానికి మరియు మంచి ధర పొందడానికి, వ్యవసాయ ఉత్పత్తులను సుదూర ప్రాంతాలకు రవాణా చేయడం అత్యవసరం. రోడ్డు మార్గం ద్వారా రవాణా చేయడం సమయం తీసుకునే విధంగా ఉండటంతో పాటు ఖర్చుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో వ్యాపారులు మరియు వ్యవసాయ ఉత్పత్తిదారులకు తోడ్పడేందుకు దక్షిణ మధ్య రైల్వేలోని గుంతకల్లు డివిజన్ ఆరు సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన పార్సిల్ కార్గో ఎక్స్‌ప్రెస్ సేవను ప్రారంభించేందుకు చొరవ తీసుకుంది. తొలి సర్వీసులో, పోకచెక్కలు, ఆల్ అవుట్ లిక్విడ్ రీఫిల్స్, అగరుబత్తీలు , చాక్లెట్లు మరియు ఇతర గృహ వినియోగ వస్తువులను రవాణా చేశారు.

ఈ రైలు ప్రధానంగా, సమర్థవంతమైన రైలు లాజిస్టిక్స్ నెట్‌వర్క్ ద్వారా పెరుగుతున్న మార్కెట్ డిమాండ్‌ను తీరుస్తూ, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్.ఎమ్.సి.జి) మరియు వ్యవసాయ ఉత్పత్తులను సుదూర ప్రాంతాలకు రవాణా చేయడానికి ఉద్దేశించబడింది. భవిష్యత్తులో, మిరపకాయలు,ఎమ్.ఆర్.ఎఫ్ టైర్లు, ఐ.టి.సి ఉత్పత్తులు, క్యాడ్‌బరీ ఉత్పత్తులు, కిమ్బెర్లీ క్లార్క్ ఉత్పత్తులు, ఎనర్లైఫ్ ఉత్పత్తులు మరియు పెర్ఫెట్టి వినియోగ వస్తువులు వంటి ప్రధాన వస్తువులు మరియు పారిశ్రామిక ఉత్పత్తులను రవాణా చేసే అవకాశం ఉంది.

Also Read-

ఇది ఈ కారిడార్‌లో సరుకు రవాణాకు బలమైన సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ విభాగం మొత్తం కాంట్రాక్ట్ కాలంలో సుమారు రూ. 54 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలదని అంచనా వేయబడింది. ఇది డివిజన్ సరుకు రవాణా ఆదాయ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ ప్రత్యేక కార్గో రైలు దక్షిణ భారతదేశాన్ని కోల్‌కతా, సిల్చర్, గువాహటి మరియు అగర్తల వంటి ప్రధాన వాణిజ్య కేంద్రాలతో అనుసంధానిస్తూ దేశవ్యాప్తంగా పార్సిల్ మరియు కార్గో రవాణాకు వేగవంతమైన, ఆర్థికపరమైన సౌకర్యాన్ని కల్పించనుంది.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పార్శిల్ కార్గో ఎక్స్‌ప్రెస్ సేవను విజయవంతంగా ప్రారంభించినందుకు గుంతకల్లు డివిజన్ బృందం చేసిన కృషిని అభినందించారు. ఈ పార్శిల్ కార్గో ఎక్స్‌ప్రెస్ ప్రారంభం సరుకు రవాణా వ్యాపారాన్ని మెరుగుపరచడానికి మరియు లాజిస్టిక్స్ అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. ఈ రైలు పారులకు, పరిశ్రమలకు నమ్మకమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన రవాణా పరిష్కారాన్ని అందిస్తుందని, అలాగే ఈ జోన్‌లో రైలు సరుకు రవాణా వృద్ధికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X