తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంపై సెమినార్, కీలక వ్యాఖ్యలు చేసిన కవిత

హైదరాబాద్ : MLC కవిత మాట్లాడుతూ… నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయము అని అన్నారు. ఇది రాష్ట్రాల హక్కులను హరించడం కాదా? ఫెడరల్ స్ఫూర్తిలో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని. కింద స్థాయిలో పథకాలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు కాదా?

బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి మీకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వము అనే మాట మాట్లాడుతున్నారు అంటే రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తి ఏమైనట్లు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల హక్కులను హరించే అధికారం వాటికి లేదు.

కవిత మాట్లాడుతూ… పాకెట్ డైరీలా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని కాపాడాలి అని అంటున్నారు. నేను ఆయనను తెలంగాణకు స్వాగతిస్తున్న. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీరు చెబుతున్న రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడండి. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మీరు చెబుతున్న రాజ్యాంగ విలువలు ముందు ఇక్కడ కాపాడండి.

కొన్ని నెలల క్రితం ఆసిఫాబాద్లో మతకల్లోహాలు జరిగి వందలాది మంది నిరాశ్రయులయ్యారు. వాళ్ల గురించి ఒక్క నాయకుడు కూడా మాట్లాడటం లేదు. ఆసిఫాబాద్ లో నెలల తరబడి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎలాంటి ఆర్థిక సహాయం గానీ నష్టపరిహారం కానీ అందలేదు. ప్రభుత్వ పెద్దలు కనీసం వాళ్లను పరామర్శించలేదు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కనీసం అటు వైపు చూడలేదు. రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కుతున్నారు. రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కే ప్రభుత్వాలు ఉన్న ఈ సందర్భంలో విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని చేయడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను.

కేంద్ర మంత్రి నిధులివ్వమనడం ఫెరడల్ స్పూర్తికి విఘాతం

రాజ్యాంగాన్ని కాపాడాలంటున్న రాహుల్ గాంధీ… ముందు తెలంగాణలో రాజ్యాంగాన్ని పరిరక్షించాలి

రాజ్యాంగంపై సెమినార్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ : స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణలో ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వబోమని ప్రకటించడం ఫెడరల్ స్పూర్తికి విఘాతమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇది ముమ్మాటికి రాష్ట్రాల హక్కులను హరించడమేనని స్పష్టం చేశారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణపై తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఏర్పాటు చేసిన సెమినార్ లో ఎమ్మెల్సీ కవిత కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ, హక్కలను కాపాడడం, పరిపాలనలో పారదర్శకతను పాటించడం, రాజ్యాంగం నిర్దేశించిన ఆదేశీక సూత్రాలు సమర్థవంతంగా అమలు చేయడం వంటి మొత్తం 19 తీర్మానాలను సెమినార్ లో ఆమోదించారు. ఈ తీర్మానాలతో పాటు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖను త్వరలో విద్యార్థులో రాష్ట్ర గవర్నర్ ను కలిసి అందించనున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి మీకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వము అనే మాట మాట్లాడుతున్నారంటే రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తి ఏమైనట్లని ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల హక్కులను హరించే అధికారం దానికి లేదని సూచించారు.

ఇక పాకెట్ డైరీలా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని కాపాడాలి అని అంటున్నారని, కానీ తెలంగాణలో హననమతువున్న రాజ్యాంగం స్పూర్తిపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. “రాహుల్ గాంధీని తెలంగాణకు స్వాగతిస్తున్న. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీరు చెబుతున్న రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడండి” అని రాహుల్ గాంధీకి సూచించారు.

కొన్ని నెలల క్రితం ఆసిఫాబాద్ లో మతకల్లోహాలు జరిగి వందలాది మంది నిరాశ్రయులయ్యారని, కానీ ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదని విమర్శించారు. ఆసిఫాబాద్ లో నెలల తరబడి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని గుర్తు చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎలాంటి ఆర్థిక సహాయం గానీ నష్టపరిహారం కానీ అందలేదని ఎండగట్టారు. “ ప్రభుత్వ పెద్దలు కనీసం వాళ్లను పరామర్శించలేదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు కనీసం అటు వైపు చూడలేదు.. రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కుతున్నారు” అని ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X