డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం భూములను కాపాడుకుంటాం: సైన్స్ విభాగ విద్యార్థులు

జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూకి భూ కేటాయింపులను వ్యతిరేకిస్తూ అంబేద్కర్ వర్శీటీలో 55వ రోజుకు చేరిన నిరసనలు

హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ అంబేద్కర్ వర్షీటీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు నిరసనను కొనసాగించారు. ఈ నిరసనలో విశ్వవిద్యాలయ సైన్స్ విద్యార్థులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మల్టీఫంక్షనల్ ల్యాబ్ (ఎస్టిఎంయల్) భవనం నుంచి పరిపాలన భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనకు వివిధ గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చారు. ఇందులో పేద, దళిత, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు చాల మంది విద్యార్థులే అధికంగా ఉన్నారు.

జేఎసీ కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. యల్. విజయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఖాళీ స్థలమే లేదని. ప్రభుత్వం విశ్వవిద్యాలయ అధికారులను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు కొత్తగా కంప్యూటర్, సైన్స్ ల్యాబ్స్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. నూతన విద్య విధానం ప్రకారం (నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (NEP)-2020 ఎక్కువ మంది విద్యార్థులకు విద్యావకాశాలను అందించడానికి వివిధ కోర్సులు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామాని హెచ్చరించారు.

Also Read-

కార్యక్రమంలో జేఏసీ ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబ్డే; నేతలు ప్రొ.పుష్పా చక్రపాణి; డా. రవీంద్రనాథ్ సోలమన్; డా. ప్రమీల కేతావత్; కాంతం ప్రేమ్ కుమార్, డా. అవినాష్; డా. కిషోర్; డా. రాఘవేంద్ర, అధ్యాపక, అధ్యాపకేతర, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు విద్యార్థులు, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X