గృహిణులు, మహిళలకు డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మార్గదర్శి : గోల్డ్ మెడలిస్ట్

కొత్త విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇస్తూ ఉన్న విశ్వవిద్యాలయాలకు కాపాడండి

జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూకి భూ కేటాయింపులను వ్యతిరేకిస్తూ అంబేద్కర్ వర్శీటీలో 54 రోజులకు చేరిన నిరసనలు

హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ అంబేద్కర్ వర్షీటీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు నిరసనను కొనసాగించారు. అధ్యాపక, అధ్యాపకేతర, ఉద్యోగ సంఘాల నేతలు మంగళవరం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనం వద్ద నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థిని, గోల్డ్ మెడలిస్ట్ పరిశోధక విద్యార్థిని రుక్సానా కార్యక్రమంలో పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు. గృహిణులకు, మహిళాలకు, పేద మధ్యతరగతి విద్యార్థులకు అంబేద్కర్ వర్శిటీ దిక్సూచి లాంటిదని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల నుండి పేద, దళిత, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు చాల మంది విద్యార్థులున్నారన్నారు.

కార్యక్రమంలో జేఏసీ ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబ్డే; కన్వీనర్ ప్రొ.వడ్డాణం శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ భూములను ఎవరికీ కేటాయించరాదని లేఖను వెంటనే వెనక్కి తీయనుకోవాలని, పక్షంలో రానున్న రోజులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామాని హెచ్చరించారు.

Also Read-

కార్యక్రమంలో జేఎసే నేతలు ఎండి హబీబుద్దిన్; డా.ప్రమీల కేతావత్; కాంతం ప్రేమ్ కుమార్, డా. అవినాష్; డా. కిషోర్; డా. రాఘవేందర్, అధ్యాపక, అధ్యాపకేతర, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు పూర్వ విద్యార్థులు, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X