చరిత్రను వక్రీకరిస్తూ ప్రచురించిన పుస్తకాలు చదువొద్దు: బండి సంజయ్

ఈ మధ్య కాలం లో జాతీయ భావ సాహిత్య పాఠకులు పెరిగారు

హైదరాబాద్: ఎన్ఠీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న 35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను బీజేపీ రాష్ట్ర అధ్యకుడు బండి సంజయ్ కుమార్ సందర్శించారు. ప్రదర్శనలోని పలు స్టాళ్లను సందర్శించిన సంజయ్ అక్కడ ఉన్న రచనల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

సాహిత్య నికేతన్, నవభారత్ ప్రచురణలు, నవయుగ భారతి స్టాళ్లలో పలు పుస్తకాలను సంజయ్ కొనుగోలు చేశారు. ప్రదర్శనలో ఉన్న సెంట్రల్ టూరిజం స్టాల్ ని సంజయ్ సందర్శించారు. పుస్తక ప్రదర్శనకు వచ్చిన బండి సంజయ్ ను గౌరీ శంకర్ తో సహా నిర్వాహకులు ఆహ్వానం పలికారు.

ఎప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉండే బండి సంజయ్ కుమార్ పుస్తక ప్రదర్శనలోని స్టాళ్లలో కలియ తిరగడమే కాకుండా, అక్కడే ఉన్న టీ స్టాళ్లలో చాయి తాగుతూ పుస్తక ప్రియులతో ముచ్చటించారు. ఈ సందర్శనలో సంజయ్ తో పాటు బిజెపి కార్యదర్శి ప్రకాష్ రెడ్డి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, కోశాధికారి శాంతి కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X