प्रधानमंत्री नरेंद्र मोदी की मां हीराबेन का निधन, किया दर्द भरा ट्वीट (T)

हैदराबाद: प्रधानमंत्री नरेंद्र मोदी की मां हीराबेन का निधन हो गया है। 100 वर्षीय हीराबेन अहमदाबाद के अस्पताल में भर्ती थी। अपनी मां के निधन के बारे में ट्वीट कर जानकारी देते हुए पीएम मोदी ने कहा, “शानदार शताब्दी का ईश्वर चरणों में विराम… मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।”

प्रधानमंत्री नरेंद्र मोदी ने अगले ट्वीट में कहा, “मैं जब उनसे 100वें जन्मदिन पर मिला तो उन्होंने एक बात कही थी, जो हमेशा याद रहती है कि કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી यानि काम करो बुद्धि से और जीवन जियो शुद्धि से।”

अहमदाबाद में यूएन मेहता इंस्टीट्यूट ऑफ कार्डियोलॉजी एंड रिसर्च सेंटर ने हीराबेन की मौत पर एक आधिकारिक बयान जारी किया। बयान में खुलासा किया कि बीमारी के कारण पिछले दो दिनों से उनके अस्पताल में इलाज के बाद शुक्रवार सुबह 3.30 बजे उनका निधन हो गया।

प्रधानमंत्री नरेंद्र मोदी की माता हीराबेन मोदी के निधन पर गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने दुख जताया। प्रधानमंत्री नरेंद्र मोदी की मां हीरा बा (हीराबेन) का शुक्रवार को निधन हो गया। उन्होंने इसी साल जून में अपने जीवन के 100वें वर्ष में प्रवेश किया था। उनका जन्म 18 जून 1923 को मेहसाणा में हुआ था। हीराबेन की शादी दामोदरदास मूलचंद मोदी से हुई थी। दामोदरदास तब चाय बेचा करते थे। हीराबेन और दामोदरदास की 6 संतानें हुईं। नरेंद्र मोदी तीसरे नंबर पर थे। हीराबेन और दामोदरदास की दूसरी संतानें हैं- अमृत मोदी, पंकज मोदी, प्रह्लाद मोदी, सोमा मोदी और बेटी वसंती बेन हंसमुखलाल मोदी।

हीराबेन ताउम्र संघर्षशील महिला रहीं। पीएम मोदी कई बार अपनी मां के संघर्षों का भावुक अंदाज में जिक्र कर चुके हैं। साल 2015 में फेसबुक के संस्थापक मार्क जुकरबर्ग के साथ बातचीत के दौरान पीएम मोदी ने अपने मां के संघर्षों को याद किया था। तब उन्होंने कहा था, “मेरे पिताजी के निधन के बाद मां हमारा गुजारा करने और पेट भरने के लिए दूसरों के घरों में जाकर बर्तन साफ करती थीं और पानी भरती थीं।” तब मां की तकलीफों को याद करते हुए पीएम मोदी भावुक हो रो पड़े थे।

इसी क्रम में पीएम मोदी के भाई प्रह्लाद मोदी ने हीराबेन के 100वें वर्ष में प्रवेश करने पर आजतक के साथ बातचीत में अपनी मां की जीवन की कहानी साझा की थी। प्रह्लाद मोदी ने बताया था कि उनकी मां जब मात्र 6 महीने की थी तब उनकी नानी उन्हें छोड़कर चल बसीं थीं। उनका जीवन संघर्ष ही संघर्ष रहा है। प्रह्लाद मोदी ने आगे कहा कि मेरी नानी के गुजर जाने के बाद उनके नाना ने दूसरी शादी की। उनसे जो बच्चे हुए उनके पालन पोषण की जिम्मेदारी भी हीराबेन आ पड़ी थी। उन्होंने बताया कि उनकी मां छोटी उम्र में ही मां बन चुकी थीं। नाना जी की दूसरी पत्नी गुजर गईं। फिर उन्होंने तीसरी शादी कर ली। उनसे बच्चे हुए। उनका जिम्मा भी हीराबेन पर ही आया। फिर उन्होंने अपने बच्चों को भी पालापोसा। इसके बावजूद उन्हें अपनी जिंदगी से शिकायत न रही।

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు

Hyderabad: ప్రధాని నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో అహ్మదాబాద్‌లోని UN మెహతా హాస్పిటల్‌లో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఇటీవలే హీరాబెన్ వందో పుట్టినరోజు జరుపుకున్నారు. తన తల్లి మరణంపై నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. తన తల్లి ఫొటోను షేర్ చేస్తూ.. నిండునూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరిందని మోదీ భావోద్వేగానికి గురయ్యారు.

‘దేవుడి పాదాల వద్ద అద్భుతమైన శతాబ్ధం ఉంది. సన్యాసి జీవితం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుడి ఉండే జీవితం వంటి త్రిమూర్తి లక్షణాలు అమ్మలో ఉన్నాయి. 100వ పుట్టిన రోజు సందర్భంగా నేను అమ్మను కలిసినప్పుడు ఆమె ఓ విషయం చెప్పింది. తెలివితో పని చేయండి, స్వచ్చతతో జీవించండి అని చెప్పారు. ఆ విషయాన్ని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను’ అంటూ మోదీ ట్విట్టర్‌లో ఎమోషనల్ అయ్యారు. హీరాబెన్ మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆమె మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చివరిసారిగా ఇటీవల హీరాబెన్ 100వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ తన తల్లి ఇంటికి వెళ్లారు.

హీరాబెన్ మృతిపై అహ్మదాబాద్‌లోని UN మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. హీరాబెన్ మోదీ అనారోగ్యంతో తమ ఆస్పత్రిలో గత రెండు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 3.30 గంటలకు మరణించినట్లు వెల్లడించింది. ఎప్పుడూ ప్రభుత్వ, రాజకీయ, విదేశీ పర్యటనలతో బిజీగా ఉండే మోదీ.. సమయం దొరికినప్పుడల్లా గుజరాత్‌లోని గాంధీ నగర్‌లోని తన తల్లి ఇంటికి వెళ్లి ఆమెను కలుస్తూ ఉంటారు. తల్లి ఆరోగ్య క్షేమాలు తెలుసుకుని ఆశీర్వాదం తీసుకుంటారు. తన తల్లిని కలిసిన ప్రతి సమయంలోనే మోదీ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు.

వృద్ధాప్యంతో పాటు పలు అనారోగ్య సమస్యలతో హీరాబెన్ మోదీ గత కొన్నేళ్లుగా బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం శ్వాసకోస సంబంధిత సమస్యతో ఆమె ఆస్పత్రిలో చేరారు. తల్లి అనారోగ్యానికి గురైన సమాచారం తెలుసుకున్న మోదీ.. హుటాహుటిన ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌లోని ఆస్పత్రికి చేరుకున్నారు. తల్లి ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హీరాబెన్‌కు ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తుండగా.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.

ప్రధాని భావోద్వేగ ట్వీట్

తన మాతృమూర్తి హీరాబెన్‌ కన్నుమూతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. ‘‘నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తి చేసుకుని దేవుడి చెంతకు చేరారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిది. సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారు. ఆమెలో త్రిమూర్తులు ఉన్నట్లు భావిస్తున్నా’’ అని ప్రధాని మోడీ ట్విటర్‌లో తెలిపారు. 

రేవంత్ రెడ్డి సంతాపం

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి. 100 ఏళ్ళు పూర్తి చేసుకొని సంపూర్ణ జీవితం గడిపిన హీరబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. ప్రధాని మోడీ గారికి తన సానుభూతిని వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.

బండి సంజయ్

బండి సంజయ్ కుమార్, పార్లమెంట్ సభ్యులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు విడుదల చేసిన ప్రకటన

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోది గారి తల్లి హీరాబెన్ మోది గారు మరణించారన్న వార్త తీవ్రంగా బాధించింది. శ్రీమతి హీరాబెన్ గారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, శ్రీ నరేంద్ర మోడీ గారికి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.

డాక్టర్ కే లక్ష్మణ్

డాక్టర్ కే లక్ష్మణ్ పార్లమెంట్ సభ్యులు బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు విడుదల చేసిన ప్రకటన

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోది గారి తల్లి హీరాబెన్ మోది గారు మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

శ్రీ నరేంద్ర మోడీ గారు ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలి అని కోరుకుంటున్నాం. శ్రీమతి హీరాబెన్ గారి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X