ప్రజల్లో దైవభక్తి పెంచి, పాపాలను తొలగించాలి
ఇస్కాన్ శ్రీరామ్ విజయోత్సవ యాత్రకు పాలకుర్తిలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పాలకుర్తి: ప్రపంచ ప్రసిద్ధి చెందిన గొప్ప సేవా సంస్థ ప్రజల్లో దైవచింతన పెంపొందించే భక్తి సంస్థ ఇస్కాన్ ఆధ్వర్యంలో పాలకుర్తి పవిత్ర క్షేత్రంలో త్వరలో నిత్యాన్నదానం జరగనుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్పారు. కూకట్ పల్లి, ఇస్కాన్ ఆధ్వర్యంలో తలపెట్టిన శ్రీరామ్ విజయోత్సవ యాత్ర ఈరోజు పాలకుర్తికి నియోజకవర్గానికి చేరుకుంది. పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీ దగ్గర ఈ యాత్రకు కొబ్బరికాయ కొట్టి మంత్రి ప్రారంభించారు. అనంతరం దేవాలయం నుంచి పాలకుర్తి రాజీవ్ చౌరస్తా వరకు జరిగిన రథోత్సవంలో మంత్రి స్వయంగా పాల్గొని ప్రచారం చేశారు.
ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యాంశాలు…
ఈ యాత్ర పాలకుర్తిలో ప్రారంభం చేయడం అదృష్టంగా భావించాలి. సేవాభావంతో పని చేసే ఇస్కాన్ సంస్థ పాలకుర్తిలో పాఠశాలలు, ఇతర కేంద్రాలను ఎంచుకుని నిత్య అన్నదానం చేయాలని కోరాను. ఇందుకోసం వారికి ఏ వసతి కావాలని అడిగినా చేస్తాను అన్నాను. మీ సేవల కోసం సన్నూర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర 10 ఎకరాల భూమి ఇస్తాను. ఒకవేళ ఈ అన్నదాన కార్యక్రమానికి నామమాత్రపు ధర ఇవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నాము.
మొదట పాలకుర్తి, తరవాత తొర్రూరులో ఈ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని చేయమన్నాను. కోటి రూపాయలతో పాలకుర్తిలో సేవాలాల్ మహారాజ్ భవన్, విగ్రహం ఏర్పాటు చేస్తాము. ప్రజల్లో దైవ భక్తి పెరగాలి. పాపాలు పోవాలి. పాలకుర్తి అభివృద్ధిలో ఇక్కడ చాలా ఇండ్లు పోయినా సహకరించారు. ఇస్కాన్ రావడం మన అదృష్టం. ఈ సంస్థ వారు మంచి సేవ చేస్తారు. రేపు వావిలాలలో ఇస్కాన్ శ్రీరామ్ విజయోత్సవ యాత్రకు పెద్ద ఎత్తున స్వాగతం చెప్పి, ఇంటింటికీ కొబ్బరి కాయ కొట్టాలి. జై శ్రీ కృష్ణ భగవాన్ కి జై.
కూకట్ పల్లి ఇస్కాన్ సంస్థ ప్రెసిడెంట్ మహా శ్రింగ దాస..
మంత్రి దయాకర్ రావు గారు ఎపూడు ప్రజల మంచి కోసం ఆలోచిస్తాడు. మంత్రి కోరిక మేరకు ఇక్కడ నిత్య అన్నదానం చేస్తాం. మేము ఇది గౌరవంగా భావిస్తాం. ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని మా కోరిక…మాకు స్థలం ఇస్తే ఈ రెండు ప్రాజెక్టులు చేస్తాం.