हैदराबाद: पीएम नरेंद्र मोदी ने सोमवार को 413 करोड़ रुपये की लागत से अत्याधुनिक तकनीक से निर्मित चर्लापल्ली रेलवे टर्मिनल का वर्चुअल माध्यम से उद्घाटन किया। तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी ने इस कार्यक्रम में वर्चुअल माध्यम से भाग लिया, जबकि केंद्रीय मंत्री किशन रेड्डी और बंडी संजय भी उपस्थित थे। वैसे तो इस टर्मिनल का उद्घाटन पहले 28 दिसंबर को होना था, लेकिन पूर्व प्रधानमंत्री मनमोहन सिंह के निधन के कारण इसे स्थगित कर दिया गया था।
मुख्यमंत्री रेवंत रेड्डी ने भी इस कार्यक्रम में वर्चुअल माध्यम से भाग लिया, जबकि केंद्रीय मंत्री किशन रेड्डी और बंडी संजय मौजूद रहे। वहीं पीएम मोदी ने वर्चुअल उद्घघाटन करते हुए कहा कि पूरे भारत में कनेक्टिविटी में सुधार के लिए सरकार की प्रतिबद्धता पर जोर दिया। उन्होंने मेट्रो नेटवर्क के 1,000 किलोमीटर से अधिक विस्तार तथा जम्मू-कश्मीर, ओडिशा और तेलंगाना जैसे क्षेत्रों में कनेक्टिविटी बढ़ाने के लिए चल रही पहलों पर प्रकाश डाला। मोदी ने पिछले दशक में रेलवे बुनियादी ढांचे में हुई महत्वपूर्ण प्रगति पर चर्चा की।
पीएम ने कहा कि नई रेल पटरियों और अंडरब्रिजों का निर्माण तेजी से चल रहा है। वंदे भारत एक्सप्रेस जैसी हाई-स्पीड ट्रेनें चल रही हैं और रेल लाइनों के विद्युतीकरण का विस्तार करने के प्रयास चल रहे हैं। देश का 35 फीसदी हिस्सा पहले ही विद्युतीकृत हो चुका है। चरलापल्ली टर्मिनल से सिकंदराबाद और काचीगुडा स्टेशनों पर दबाव कम होगा और परिचालन सुचारू हो जाएगा।
Also Read-
सीएम रेवंत रेड्डी ने टर्मिनल के उद्घाटन के लिए पीएम मोदी को बधाई दी और राज्य के लिए ड्राई पोर्ट बनाने, मेट्रो रेल का विस्तार करने और आरआरआर परियोजना को पूरा करने में सहयोग का आग्रह किया। रेड्डी ने इस बात पर जोर दिया कि केंद्र के सहयोग से तेलंगाना एक ट्रिलियन डॉलर की अर्थव्यवस्था हासिल कर सकता है।
यह टर्मिनल हैदराबाद-सिकंदराबाद क्षेत्र में चौथा यात्री टर्मिनल है। इससे सिकंदराबाद, हैदराबाद और काचीगुडा के अन्य रेल टर्मिनलों पर भीड़भाड़ कम होने की उम्मीद है। शहर की बढ़ती जरूरतों को पूरा करने के लिए महानगर के पश्चिमी हिस्से में लिंगमपल्ली को एक और टर्मिनल स्टेशन के रूप में विकसित किया गया है। चरलापल्ली नया टर्मिनल चार अतिरिक्त उच्च स्तरीय प्लेटफार्मों के साथ अतिरिक्त 15 जोड़ी ट्रेनों को संभाल सकता है। मौजूदा पांच प्लेटफार्मों को भी पूरी लंबाई वाली ट्रेनों को समायोजित करने के लिए बढ़ाया गया था। यहां पर अन्य 10 लाइनें उपलब्ध हैं, जिससे कुल क्षमता 19 लाइनों की हो जाती है।
नई सुविधा में दो विशाल फुट ओवरब्रिज तथा लिफ्ट और एस्केलेटर शामिल हैं। 12 मीटर चौड़ा फुट-ओवर-ब्रिज सभी प्लेटफॉर्म को सभा स्थल से सीधे जोड़ता है, जबकि छह मीटर चौड़ा फुट-ओवर-ब्रिज अंतर-प्लेटफॉर्म आवागमन के लिए है। स्टेशन की इमारत में छह बुकिंग काउंटर है। पुरुषों और महिलाओं के लिए अलग-अलग प्रतीक्षालय, साथ ही एक उच्च श्रेणी का प्रतीक्षालय और भूतल पर एक लाउंज शामिल है। इसके अतिरिक्त पहली मंजिल पर एक कैफेटेरिया, रेस्तरां और शौचालय की सुविधा है।
सभी 9 प्लेटफॉर्म पर एस्केलेटर और लिफ्ट होंगी। इसके अलावा कुल सात लिफ्ट और यात्रियों की आवाजाही को सुविधाजनक बनाने के लिए छह एस्केलेटर होंगे। स्टेशन पर ट्रेनों के आरंभ और समापन की सुविधा के लिए इसमें कोच रखरखाव की सुविधा भी है। इस बीच यात्रियों को अतिरिक्त रेल सुविधाएं प्रदान करने और सिकंदराबाद/हैदराबाद रेलवे स्टेशनों पर भीड़भाड़ कम करने के उद्देश्य से दक्षिण मध्य रेलवे ने दो एक्सप्रेस ट्रेनों के टर्मिनल स्टेशन बदल दिए हैं। ट्रेन संख्या 12603/12604 चेन्नई सेंट्रल-हैदराबाद-चेन्नई सेंट्रल का टर्मिनल 7 जनवरी से हैदराबाद से बदलकर चर्लापल्ली कर दिया जाएगा।
इसी तरह ट्रेन संख्या 12589/12590 गोरखपुर-सिकंदराबाद-गोरखपुर का टर्मिनल सिकंदराबाद से बदलकर चरलापल्ली कर दिया जाएगा। साथ ही चर्लापल्ली रेलवे स्टेशन पर तीन एक्सप्रेस ट्रेनों को अतिरिक्त ठहराव दिया गया है। ये 12757/12758 सिकंदराबाद-सिरपुर कागजनगर-सिकंदराबाद, 17201/17202 गुंटूर-सिकंदराबाद-गुंटूर और 17233/17234 सिकंदराबाद-सिरपुर कागजनगर-सिकंदराबाद ट्रेन हैं। (एजेंसियां)
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను వర్చ్యువల్ గా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
హైదరాబాద్: స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చ్యువల్ గా ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టును తలపించేలా చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగిందని, రూ.413 కోట్ల వ్యయంతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఓఆర్ఆర్‌కు అత్యంత సమీపంలో చర్లపల్లి ఉందని, తెలంగాణ ప్రగతిలో ఇది అత్యంత కీలకంగా మారబోతోందని, సోలార్ స్టేషన్‌గా దీన్ని అభివృద్ధి చేశారని మోదీ వ్యాఖ్యానించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా.. చర్లపల్లి లాంటి స్టేషన్లు ఎంతో అవసరమని, 2014లో కేవలం 5 నగరాల్లోనే మెట్రో ఉందని, పదేళ్లలో 21 నగరాలకు మెట్రో విస్తరించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
భారత రైల్వేలకు బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నామని, కోట్లాది మందిని వందేభారత్ రైళ్లు గమ్యం చేరుస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో 35 శాతం విద్యుదీకరణ పూర్తయిందని, వందేభారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు తెచ్చామని, హైస్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతోందన్నారు. 180 కి.మీ. వేగంతో వందేభారత్ స్లీపర్ కోచ్ రైలు ట్రయల్ రన్ పూర్తి అయిందన్నారు. త్వరలోనే బుల్లెట్ రైలు సాకారం అవుతుందని, పదేళ్లలో 30 వేల కి.మీ. రైల్వే లైన్లు నిర్మించామని అన్నారు. నాలుగు విభాగాలుగా రైల్వేలను అభివృద్ధి చేస్తున్నామని, మౌలిక వసతులు, ప్రయాణికుల సదుపాయాలు, మూరుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ, ఉపాధి కల్పనే తమ లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్, ఒడిషా, తెలంగాణలో.. కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయని, రైల్వే ఆధునికీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో వర్చ్యువల్‌గా పాల్గొన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, పలువురు ప్రజా ప్రతి నిధులు హాజరయ్యారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్‌లపై ఒత్తిడి తగ్గించి, నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు నాల్గో టెర్మినల్‌గా చర్లపల్లి రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఆరున్నరేళ్ల కాల వ్యవధిలో దాదాపు రూ.428 కోట్లతో నిర్మితమైన ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే శివారు ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది.
కాగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, వి.సోమన్న, రవనీత్ సింగ్, బండి సంజయ్, గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, తదితరులు హాజరయ్యారు. కాగా ఈ నెల7వ తేదీ నుంచి సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ (12757-12758), గుంటూరు- సికింద్రాబాద్- గుంటూర్ ఎక్స్‌ప్రెస్ (17201-17202), సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్(17233-17234) రైళ్లకు చర్లపల్లిలో అదనపు స్టాపేజ్ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లి వచ్చే రైళ్లు (12603-12604) మార్చి 7 నుంచి,. గోరఖ్‌పూర్- సికింద్రాబాద్ వెళ్లి వచ్చే రైళ్లు (12589-12590) మార్చి 12 నుంచి చర్లపల్లి టెర్మినల్ నుంచే రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెప్పారు.
చర్లపల్లిలో నూతనంగా ప్రారంభించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎన్నో ప్రత్యేకతలకు నిలయంగా మారింది. స్టేషన్ లో అధునాతన సౌకర్యాలతో ప్రయాణికులకు సేవలు అందించేలా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ప్రయాణికుల అధునాతన స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం కల్పించారు. అదేవిధంగా ఎక్జిక్యూటివ్ లాంజ్, స్త్రీ పురుషులకు వేరు వేరు వెయిటింగ్ ఏరియాలు, కేఫ్ టేరియా, భోజనశాలలు, ఎలివేటర్లు, ఎస్కులేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు మరెన్నో ఇతర అడ్వాన్స్ డ్ ఫెసిలిటీస్ కల్పించారు. ఎయిర్ పోర్టులలో ఉండే సౌకర్యాలు చర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేయడం విశేషం.
ఇటీవల హైదరాబాద్ ఎయిర్ పోర్టులో స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు చేశారు. ప్యాసెంజర్లకు ప్రత్యేక ప్రశాంత విశ్రాంతి కేంద్రాలు ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన స్లీపింగ్ పాడ్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తెలంగాణలో ఎక్కడా లేని స్లీపింగ్ పాడ్లను చర్లపల్లిలో ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఈ స్లీపింగ్ పాడ్స్ స్టార్టింగ్ ఫీజు 500 రూపాయలు. ప్రాయాణికులకు ప్రత్యేకమైన ప్రశాంతతను ఇవ్వడమే వీటి ఉద్దేశమని రైల్వే అధికారులు తెలిపారు. అదేవిధంగా లగేజ్, ఫుట్ వేర్ లు దాచుకోవడానికి సపరేట్ లాకర్ ఏరియాలతో POD హోటల్స్ లో సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
స్లీపింగ్ పాడ్స్ ఇప్పటికే పలు ఆస్పత్రులు, ఎయిర్ పోర్టులు, యూనివర్సిటీలు, ఇతర పబ్లిక్ ప్లేసెస్ లలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో 20 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే స్ట్రెస్ తొలగి పోయి, మైండ్ రీఫ్రెష్ అవుతుందట. అంతేకాకుండా ఎనర్జీ పెరగడంతో పాటు ఫోకస్ పెరగడం, లెర్నింగ్ స్కిల్స్ పెరగడం మొదలైన ఉపయోగాలు ఉన్నాయట ఈ స్లీపింగ్ పాడ్స్ తో. అందుకే పర్సనల్ గా కూడా వీటిని వినియోగిస్తుంటారు. ఈ స్లీపింగ్ పాడ్స్ మొదట జపాన్ లో 1979 లో కనుగొన్నారు. క్యాప్సుల్స్ ఇన్ ఒసాక అనే జపాన్ ప్రాజెక్టులో భాగంగా కిషో కురొకవా వీటిని రూపొందిచారు. (ఏజెన్సీలు)