తెలంగాణలోని కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ, చదవండి ప్రయోజనాలు…

118 కి.మీ.ల సంయుక్త పొడవు కలిగిన కాజీపేట – విజయవాడ బహుళ-ట్రాకింగ్ ప్రాజెక్టులోని వివిధ విభాగాలు మరియు కాజీపేట ‘రైల్ అండర్ రైల్’ బైపాస్

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గల ఎచ్.ఐ.సి సెంటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో, తెలంగాణ రాష్ట్రంలో సుమారు రూ. 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులలో కాజీపేట్ – విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్ లోని వివిధ సెక్షన్ లు మరియు ‘కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్’ వంటివి ఉన్నాయి.

ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ ప్రభుత్వ రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులు కూడా పాల్గొన్నారు.

ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేంద్రంగా హైదరాబాద్ సాధిస్తున్న పరివర్తనాత్మక ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ మరియు యావత్తు దేశం వేగంగా అభివృద్ధి చెందడంలో ఈ ప్రాంతం పోషిస్తున్న కీలక పాత్రను నొక్కిచెప్పిన ఆయన, ఈ రోజు ప్రారంభించిన పలు భారీ స్థాయి ప్రాజెక్టులు తెలంగాణను ఒక ప్రధాన తయారీ కేంద్రంగా (మ్యానుఫ్యాక్చరింగ్ హబ్)గా ఎలా తీర్చిదిద్దుతాయో వివరించారు. ప్రధానమంత్రి ఈ ప్రాజెక్టుల ప్రారంభం ద్వారా ప్రాంతీయ అనుసంధానం బలపడటంతో పాటు వేలాది నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని పేర్కొంటూ ఈ ప్రాజెక్టుల సందర్భంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు.

Also Read-

ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రంలో రైల్వే పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ 2014కు ముందు రైల్వే బడ్జెట్ కేటాయింపుతో పోలుస్తూ గణనీయమైన పెరుగుదల ఉందని తెలిపారు . 2014కు ముందు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రైల్వే బడ్జెట్ వెయ్యి కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉండగా, తెలంగాణ ప్రస్తుత వార్షిక రైల్వే కేటాయింపులు ఐదున్నర వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయని తెలిపారు. సుమారు 50 వేల కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు ఏకకాలంలో అమలులో ఉన్నాయని తెలియజేస్తూ ఆధునిక రైలు రవాణాలో వచ్చిన పరివర్తనకు నిదర్శనంగా తెలంగాణకు సేవలు అందిస్తున్న ఐదు వందే భారత్ మరియు ఆరు అమృత్ భారత్ రైళ్ల ప్రవేశాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాజీపేట-విజయవాడ బహుళ-ట్రాకింగ్ ప్రాజెక్టులోని ఎంపిక చేసిన సెక్షన్ లు మరియు కాజీపేట రైలు అండర్ బైపాస్ లైన్ అంకితోత్సవాన్ని ప్రస్తావిస్తూ, మోదీ ఇలా ఉద్ఘాటించారు: “ఈ సదుపాయాలు ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి మరియు రవాణాను వేగవంతం చేస్తాయి.”

ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో అనేక ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి కాబట్టి, నేటి రోజు తెలంగాణ ప్రజలకు ఒక ‘వికాస ఉత్సవం’ (అభివృద్ధి పండుగ) అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ‘వికసిత భారత్ 2047’ (అభివృద్ధి చెందిన భారతదేశం 2047) ఆశయాన్ని సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి పనిచేస్తుందని తెలిపారు.

స్వాగతోపన్యాసం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ రహదారులు, రైల్వేలు, వస్త్ర పరిశ్రమ మరియు లాజిస్టిక్స్ రంగాలకు సంబంధించిన రూ. 9,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను గౌరవ ప్రధాన మంత్రి ఈ రోజు ప్రారంభించారని తెలిపారు. ప్రధాన మంత్రి నాయకత్వంలో, వరంగల్‌లో రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు, 40 ‘అమృత్’ స్టేషన్ల పునరాభివృద్ధి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క భారీ స్థాయి ఆధునీకరణ వంటి వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్రంలో చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన అన్నారు.

అంకితం చేయబడిన ప్రాజెక్టుల ముఖ్యాంశాలు:
కాజీపేట – విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్
కాజీపేట–విజయవాడ సెక్షన్ దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తున్నఒక ముఖ్యమైన గ్రాండ్ ట్రంక్ రూట్. ఈ మార్గ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని, మూడవ లైన్ నిర్మాణం మరియు విద్యుదీకరణను ప్రాధాన్యంగా చేపట్టారు. కాజీపేట్ – వరంగల్, నెక్కొండ – మహబూబాబాద్ మరియు డోర్నకల్–ఎర్రుపాలెం సెక్షన్లలో మొత్తం 118 కిలోమీటర్ల మేర మూడవ లైన్ నిర్మాణం మరియు విద్యుదీకరణ పనులు పూర్తై ప్రారంభించబడ్డాయి. ఈ సెక్షన్లలో మూడవ లైన్

నిర్మాణానికి అయిన వ్యయం సుమారు రూ. 1,243 కోట్లు. డోర్నకల్ – మహబూబాబాద్ మధ్య పనులు వేగంగా జరుగుతుండగా, కాజీపేట – విజయవాడ మధ్య మిగిలిన మార్గాలు ఇప్పటికే పూర్తయి జాతికి అంకితం చేయబడ్డాయి.

ప్రయోజనాలు

  • దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాలను కలిపే, రద్దీతో నిండిన గ్రాండ్ ట్రంక్ మార్గంలో రద్దీని తగ్గిస్తుంది
  • ఈ మార్గం వెంబడి సామర్థ్యం మరియు సరుకు రవాణా లోడింగ్‌ను పెంపొందిస్తుంది
  • సుదూర రైళ్ల ప్రయాణ సమయాన్ని తగ్గించి మరియు సమయపాలనను మెరుగుపరుస్తుంది

కాజీపేట్ రైల్ అండర్ రైల్ బైపాస్
కాజీపేట్ జంక్షన్‌లో 21 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్ అండర్ రైల్ బైపాస్ సుమారు రూ. 292 కోట్ల వ్యయంతో నిర్మించబడింది. కాజీపేట్ జంక్షన్ కేంద్ర స్థానంలో ఉంది, ఇది ఒకవైపు సికింద్రాబాద్ దిశను, మరోవైపు బల్హర్షా దిశను మరియు ఇంకోవైపు విజయవాడ దిశను కలుపుతుంది. ఈ మూడు దిశలలో ప్రయాణీకుల మరియు సరుకు రవాణా రైలు సేవలను సజావుగా నిర్వహించడం కోసం ఈ జంక్షన్ వద్ద రైల్ అండర్ రైల్ బైపాస్ నిర్మాణం చేపట్టబడింది.

ప్రయోజనాలు

  • మూడు వేర్వేరు దిశలలో రైళ్లను సజావుగా నడపడానికి దోహదపడుతుంది
  • కీలకమైన కాజీపేట్ జంక్షన్లో రైలు కార్యకలాపాలను సులభతరం చేస్తుంది
  • మెరుగైన అనుసంధానానికి దోహదపడుతూ మార్గ మధ్యంలో రైళ్ళ నిలుపుదలను తగ్గిస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X