“PSY-5” Continue Update: 15వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, ఈ రోజు 18 కిలోమీటర్ల

హైదరాబాద్ :

BREAKING

15వ రోజు దిగ్విజయంగా ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర

ఈరోజు మొత్తం 18 కిలోమీటర్ల మేర కొనసాగిన బండి సంజయ్ పాదయాత్ర

ఇవాళ కొండగట్టు సమీపంలో బండి సంజయ్ రాత్రి బస

BREAKING

15వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల క్రాస్ రోడ్ వద్దకు చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర

మల్యాల క్రాస్ రోడ్ వద్ద బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి శ్రేణులు

BREAKING

జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని నూకపల్లి స్టేజ్ వద్దకు చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర

నూకపల్లి స్టేజ్ వద్ద బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి శ్రేణులు

హారతులు పట్టి, నుదుట బొట్టుపెట్టి, బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన ఆడపడుచులు

డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో సందడిగా సాగుతున్న బండి సంజయ్ పాదయాత్

BREAKING

జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని రాజారం గ్రామంలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ని చూసి, నా దగ్గరికి రా బిడ్డా అని ఎంతో ప్రేమతో పిలిచిన ఓ ముసలవ్వ

ఆ వృద్ధురాలి కోరిక మేరకు, వెంటనే పాదయాత్ర నుంచి ఆ అవ్వ దగ్గరికి వెళ్లిన బండి సంజయ్

బండి సంజయ్ ని చూసి, ప్రేమతో హత్తుకుని, సం’జయుడి’ నుదుటిపై ముద్దుపెట్టి, ఆశీర్వదించిన ఆ ముసలవ్వ

బిడ్డా… నువ్వు పాదయాత్ర చేస్తానవ్, టైం కు తింటానవా…? లేదా..?

టైం కు తిను బిడ్డా…

ఇక మేమంటే ముసలోళ్లం… చావుకు దగ్గరగా ఉన్నోళ్ళం

ప్రజలకు మంచి చేయాలని తిరుగుతున్న నువ్వు చాలా గొప్పోడివి బిడ్డా… నా ఆయుస్సు పోసుకుని, సల్లగా బతుకు బిడ్డా… అని బండి సంజయ్ ని ఆశీర్వదించిన ఆ అవ్వ

తనపై ఆ అవ్వ చూపించిన ప్రేమకి, కళ్ళల్లో ఆనందభాష్పాలు రాల్చిన బండి సంజయ్

అవ్వా… నీ దీవెనలతో ప్రజలకు మరింత సేవ చేస్తా.. నీకు మాటిస్తున్న అవ్వా అని ఆ అవ్వకు చెప్పి, పాదయాత్రగా ముందుకు సాగిన బండి సంజయ్

కాసేపట్లో జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం లోని మల్యాల క్రాస్ రోడ్స్ కు చేరుకోనున్న బండి సంజయ్ పాదయాత్ర

BREAKING

లంచ్ అనంతరం జగిత్యాల టౌన్ లోని రెడ్డి కన్వెన్షన్ సెంటర్ నుంచి తిరిగి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర

బండి సంజయ్ పాదయాత్రలో నడుస్తున్న, వేలాదిగా తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు

పాదయాత్రలో భాగంగా…. ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ…. వారికి మేమున్నామనే భరోసా కల్పిస్తూ… ముందుకు సాగుతున్న బండి సంజయ్

పీఎఫ్ఐకి నిధులిస్తోన్న పార్టీ టీఆర్ఎస్

పీఎఫ్ఐ జిందాబాద్ అంటూ ర్యాలీలు చేస్తుంటే ఏం చేస్తున్నారు?

పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసిన లుచ్చాలను బట్టలూడదీసి కొట్టండి

అయ్యప్ప, హనుమాన్, భవానీ దీక్షాపరులకు విధుల్లో వెసులుబాటు ఎందుకివ్వరు?

ఎములాడ, ధర్మపురి, బాసర, కొండగట్టు ఆలయాల నిధుల హామీలేమైనయ్ ?

దొంగ సారా, పత్తాల దందా చేసిన కేసీఆర్ బిడ్డ స్వాతంత్ర్య సమరయోధురాలా?

బతుకమ్మ పేరుతో డిస్కో డ్యాన్స్ చేయించి బతుకమ్మ తల్లిని కించపర్చిన కేసీఆర్ బిడ్డ

తప్పు చేసినోళ్లు ఎంతటి వారైనా సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపుతుంది

మోటార్లకు మీటర్లు పెడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

మాతా శిశు సంరక్షణ కేంద్రాల్లో బాలింతల, పసిగుడ్డుల మరణాలు బాధాకరం

బిడ్డను కాపాడేందుకు ప్రజల మధ్య విద్వేషాలు రగిలించే కుట్ర

ఏపీ, తెలంగాణ సీఎంలు కలిసే కాంట్రాక్టులు, కమీషన్లు దోచుకుంటూ సెంటిమెంట్ రెచ్చగొట్టే యత్నం

వడ్ల కొనుగోళ్లు లేక కల్లాల వద్ద రైతులు పడుతున్న గోస పట్టని సీఎం

తరుగు పేరుతో రైతును దోచుకుంటున్న దళారులు

ఉద్యోగ, ఉపాధి లేక ముంబయి, గల్ఫ్ వలస బాట పడుతున్న యువత

గల్ఫ్ సంక్షేమానికి రూ.500 కోట్ల నిధి, 5 లక్షల ఆర్దిక సాయం హామీ ఏమైంది?

బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం

అర్హులందరికీ ఇండ్లు కట్టిస్తాం… పంట నష్టపోయిన రైతులకు పరిహారమిస్తాం

అయ్యప్ప, అంజన్న, భవానీ దీక్షాపరులకు విధుల్లో వెసులు బాటు కల్పిస్తాం
అధికారం, స్వార్ధం కోసం చేసే పూజలెన్నడూ ఫలించవనే సంగతి గుర్తుంచుకో….

బీజేపీని ఎదుర్కోలేక గుంటనక్క పార్టీలన్నీ ఏకమైనయ్

అయినా మోదీ సింహం…. సింగిల్ గానే వస్తారు

ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్

జగిత్యాల పట్టణంలో అపూర్వ స్వాగతం పలికిన వేలాది మంది ప్రజలు

కేంద్రం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) తీవ్రవాద సంస్థకు టీఆర్ఎస్ నిధులిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణ చేశారు. జగిత్యాల పీఎఫ్ఐకి అడ్డాగా మారిందని, ఎన్ఐఏ సోదాలు నిర్వహించేదాకా రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులకు సోయి లేదా? అని ప్రశ్నించారు. పీఎఫ్ఐ తీవ్రవాదుల జోలికి పోకుండా పోలీసులను టీఆర్ఎస్ నేతలే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జగిత్యాల నడిబొడ్డున ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసిన దుర్మార్గులను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఇకపై అలాంటి నినాదాలు చేసే లుచ్చాలను బట్టలూడదీసి కొట్టాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ పేరుతో డిస్కో డ్యాన్స్ చేయించి బతుకమ్మ తల్లిని అవమానించి పాపం చేసిన కేసీఆర్ బిడ్డకు ఉసురు తగిలి తీరుతుందన్నారు. రూ.లక్ష కోట్లతో దొంగ సారా, పత్తాల దందా చేస్తున్న బిడ్డ అరెస్ట్ కాకుండా కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎంతో కలిసి తెలంగాణ, సమైక్యాంధ్ర సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసే కాంట్రాక్టులు చేస్తూ కమీషన్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల పట్టణానికి వచ్చిన బండి సంజయ్ కు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…….
BREAKING

“బిజెపి కార్నర్ మీటింగ్ @ జగిత్యాల బస్ స్టాండ్ చౌరస్తా”

బండి సంజయ్, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు & కరీంనగర్ ఎంపీ కామెంట్స్:

ఏం జోష్ ఉన్నదే మీలో…

వట్టి గడ్డ నా ఇది… నా జితేందర్, రామన్న, గోపన్న ల గడ్డ ఇది

నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చినా… కాషాయ జెండా కోసం ప్రాణ త్యాగం చేసిన వ్యక్తులు పుట్టిన గడ్డ ఇది

మనమంతా జితేందర్, రామన్న, గోపన్న ల వారసులం

జగిత్యాల సీఎం కేసీఆర్ సభలో… విద్యార్థులతో కుర్చీలు వేయించారు. ఇంకా వారితో ఎన్నో పనులు చేయించారు

దేశంలో చైనా బజార్లు అని అంటున్న కేసీఆర్ కు సిగ్గుండాలి

చైనా బజార్లను భారత్ బజార్లుగా మార్చిన ఘనత మోడీది

మైసూర్ పాక్, మైసూర్ బజ్జీలను మైసూర్ లో తయారు చేస్తారా?

ఇరానీ చాయ్ అంటే.. ఇరాన్ లో చేస్తారా?

ఆ మాత్రం తెలివి లేదా కేసీఆర్..

టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. ఇప్పుడు ఢిల్లీ పోయి వీఆర్ఎస్ అవుతుంది

వేములవాడ ఆలయాన్ని ‘ప్రసాదం స్కీం’ కింద అభివృద్ధి చేద్దామంటే… కేసీఆర్ సహకరించడం లేదు

వేములవాడ అభివృద్ధికి 100 కోట్లు అన్న కేసీఆర్…. నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు

బాసర ఆలయం అభివృద్ధికి 120 కోట్లు అన్న కేసీఆర్…ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు

ఇప్పుడు కొండగట్టుకు 100 కోట్లు అంటున్నడు

కొండగట్టు ప్రమాదంలో అంతమంది పేదోళ్లు చనిపోతే… ఒక్కసారైనా కేసీఆర్ వచ్చి, సంతాపం ప్రకటించాడా..? ఆ బాధిత కుటుంబాలను ఆదుకున్నాడా…? కనీసం ఆ కుటుంబాలను పరామర్శించాడా?

కొండగట్టులో కేసీఆర్ బిడ్డ కవిత ఏదైనా జాగా కొని ఉండవచ్చు. అందుకే ఇప్పుడు 100 కోట్ల రూపాయలని అంటున్నడు

కేసీఆర్ కు కింద పెట్టిన మీటర్ దెబ్బకే… బిడ్డ బాగోతం బయటపడింది

కేసీఆర్ బిడ్డ దొంగ సారా దందా చేసింది

కేసీఆర్ కూతురు బతుకమ్మ పేరు మీద డిస్కో డాన్సులు చేసింది

బతుకమ్మ పేరుతో మన సంప్రదాయాన్ని, బతుకమ్మను కించపరిచింది

బతుకమ్మ తల్లిని కించపరిచిన కేసీఆర్ బిడ్డ ఉత్తగనే పోతదా?

లిక్కర్ దందా చేసిన కేసీఆర్ బిడ్డను అరెస్టు చేస్తే… జగిత్యాల చౌరస్తాలో ప్రజలు ధర్నా చేయాలా?

కేసీఆర్ బిడ్డను అరెస్టు చేయాలా..? వద్దా?

దొంగ దందా చేసిన కవిత సింహం, పులి బిడ్డా…?

అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన వాళ్లపై.. సీబీఐ, ఈడి విచారణ జరపాల్సిందే

నరేంద్ర మోడీ పేరు చెప్పి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేసీఆర్ చూస్తున్నాడు

రైతుల మోటార్లకు కేసీఆర్ మీటర్ పెడితే… బయటికి గుంజుతాం

ఇక్కడ బస్టాండ్ నిర్మాణం చేస్తా అన్నాడు. చేశాడా?

ఇక్కడ ‘మాతా శిశు కేంద్రం’లో అనేకమంది చనిపోయారు

ఒక్క నెలలో ఆరుగురు బాలింతలు చనిపోయారు

జగిత్యాలలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతుబంధు, రైతు రుణమాఫీ, దళిత బంధు, దళితులకు మూడెకరాలు ఇచ్చాడో కేసీఆర్ సమాధానం చెప్పాలి

బీసీ కుల వృత్తులను నిర్వీర్యం చేశాడు

ఈ ప్రాంత మున్సిపాలిటీకి కేసీఆర్ ఎన్ని కోట్ల నిధులు ఇచ్చాడో సమాధానం చెప్పాలి

ఇవేమీ చెప్పకుండా… బిడ్డను కాపాడుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు

ఏపీలో సమైక్యాంధ్ర నాయకులతో కుమ్మక్కై, కేసీఆర్ రాజకీయాలు చేస్తుండు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు ఇద్దరు కలిసి… కాంట్రాక్టులు చేస్తూ… కమిషన్లు దొబ్బుతూ… రాజకీయాలు చేస్తున్నారు

సెంటిమెంటు రగిలించి, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు

తెలంగాణ ప్రజలను కెసిఆర్ సర్వనాశనం చేసిండు

పుట్టబోయే బిడ్డ నెత్తి పైన లక్ష రూపాయల అప్పు పెట్టిండు

కరెంటు చార్జీలను పెంచిండు

ఈ జగిత్యాల జిల్లాలో పేదలకు ఇండ్లు కట్టడానికి పైసలు లేవంట కానీ, కేసీఆర్ బిడ్డ లక్ష కోట్లు పెట్టి ఢిల్లీ లక్కర్ దందా చేయడానికి మాత్రం పైసలు ఉన్నాయట

ఈ ఎనిమిదేళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్నీ, కెసిఆర్ ఆదుకోలేదు

ధాన్యం కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఇష్టపడడం లేదు

ధాన్యం సేకరణకు నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే

ధాన్యం సేకరణలో కేసీఆర్ చేస్తున్నది కేవలం బ్రోకరిజమే

కెసిఆర్ చేస్తున్న బ్రోకరిజానికి డబ్బులు ఇస్తున్నది మోడీనే

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత, మనం ఏం సాధించుకున్నాం?

తెలంగాణ రాష్ట్రానికి ముందు… వచ్చిన తర్వాత.. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి

కుటుంబ పోషణ కోసం టెన్త్ క్లాస్ చదివే పిల్లోడు కూడా… దుబాయ్ కి వలస పోతున్న పరిస్థితి

ఈ జగిత్యాల నుంచే రోజు 5 బస్సులు ముంబైకి వలస పోతున్నాయి

గల్ఫ్ కార్మికుల ఇబ్బందులను మాటల్లో వర్ణించలేను….

ఇప్పటికీ విదేశాల్లో వేల మంది వలస కార్మికులు జైళ్లలో మగ్గుతున్నారు

గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు 500 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు కేసీఆర్. మరి ఏర్పాటు చేశాడా?

నేటికీ గల్ఫ్ కార్మికులు బిచ్చమెత్తుకునే పరిస్థితి

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే…ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిలువ నీడలేని వాళ్లకు ఇండ్లను కట్టించి ఇస్తామని హామీ ఇచ్చాం

తెలంగాణకు మోదీ మంజూరు చేసిన ఇండ్లను కూడా… కేసీఆర్ కట్టించడం లేదు

ఈ ఎనిమిదేళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్నీ కేసీఆర్ ఆదుకోలేదు. బీజేపీ వస్తే… ‘ఫసల్ బీమా యోజన’ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి, రైతులను ఆదుకుంటాం

కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే… మతతత్వం రెచ్చగొట్టినట్టా?

సంఘవిద్రోహ శక్తులకు జగిత్యాల అడ్డాగా మారింది

PFI లుచ్చాగాళ్ళు హిందువులను చంపుతున్నారు

పాకిస్తాన్ జిందాబాద్ అన్నవాళ్లను బట్టలు ఊడదీసి కొడతాం

PFI లుచ్చాగాళ్ళు ఇక్కడ ర్యాలీలు తీస్తుంటే… మీరేం చేస్తున్నారు?

PFI అనే ఒక దుర్మార్గపు సంస్థకు, నిషేధిత సంస్థకు ఫండింగ్ చేస్తున్నది కేసీఆర్ పార్టీ నే

“పోలీసులకు బండి సంజయ్ విజ్ఞప్తి…”

PFI లుచ్చాగాళ్లను కాల్చిపారేయండి. రేపు మీ పిల్లలు మిమ్మల్ని చూసి, గర్వించేలా చేయండి

ఢిల్లీ నుంచి NIA(NATIONAL INVESTIGATION AGENCY) వచ్చి, ఇక్కడ PFI వాళ్ళను అరెస్ట్ చేసే వరకు… ఇక్కడి ఇంటెలిజెన్స్ కు తెలీదా?

కేసీఆర్ పాలనలోని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది?

15 నిమిషాల్లో హిందువుల తలలను నరికి చంపుతానన్నా లుచ్చా నా కొడుకు గాడు… ఏం మాట్లాడినా ఊరుకుందామా?

బరాబర్ నా ధర్మాన్ని నేను కాపాడుతా… పోరాడుతా

*హిందూయేతర పండుగలకు అనుమతి ఇచ్చే కేసీఆర్ ప్రభుత్వం… హిందువుల పండగలు జరుపుకోవాలంటే అనుమతుల పేరుతో ఇబ్బంది పెడుతోంది

సౌదీ, మక్కాకు వెళ్ళేవారికి తెలంగాణ ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది

ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న పేద అయ్యప్ప స్వాములకు పూజ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వరా…? వెసులుబాటు కల్పించరా…?

అయ్యప్ప దీక్ష , హనుమాన్ దీక్ష, భవాని దీక్ష వేసుకునే స్వాములకు వెసులుబాటు కల్పించాల్సిందే

బీజేపీ అధికారంలోకి వస్తే…నిరుపేద అయ్యప్ప భక్తులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తాం

అల్లాని, ఏసుప్రభు ను ఎప్పుడూ నేను కించపరచలేదు

‘లవ్ జిహాద్’ పేరుతో… హిందూ అమ్మాయిలను 30 ముక్కలు చేసి, నరికి చంపుతున్నారు. అయినా ఏ ఒక్కరూ మాట్లాడలేదు

కనీసం ప్రజా సంఘాలు కూడా మాట్లాడలేదు

జిహాదీ ఉగ్రవాదులు కేరళలో 30 వేల మంది క్రైస్తవ అమ్మాయిలను మతమార్పిడి చేసి, విదేశాలకు అమ్మేశారు

హిందువులు హిందువు అని చెప్పుకుంటే… మతతత్వవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు

తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు

కేసీఆర్ ఢిల్లీకి పోయిండు. ఇక అటే పోతాడు

‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పేరు నుంచి ‘తెలంగాణ’ పదాన్ని తీసి పడేసిండు

తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద ఓట్లు వేసి, గెలిపించిన ప్రజలను… తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ మోసం చేసిండు

బీఆర్ఎస్ అంటే లండన్ లో ఒక జిన్(మందు) పేరు

తెలంగాణ తల్లికి ద్రోహం చేసిండు

దొంగ దందాలు చేయడానికి… తెలంగాణ తల్లిని, తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తుండు

పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు నా చిన్నమ్మ ‘సుష్మా స్వరాజ్’ సపోర్ట్ చేయకపోతే… నేడు తెలంగాణ వచ్చేదేనా?

తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ వేలకోట్ల రూపాయల నిధులు ఇస్తుంటే…. కేసీఆర్ సహకరించడం లేదు

తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్

ఇచ్చేటోడు మోదీ… పంచటోడు మనోడు కాదు. కేసీఆర్ ఒక ద్రోహి

ఇచ్చేవాడికే… పంచే అధికారాన్ని ఇవ్వండి

డబుల్ ఇంజన్ సర్కార్ వస్తనే… తెలంగాణ అభివృద్ధి

నీతివంతమైన పాలన, పారదర్శక పాలన తెలంగాణలో రావాలంటే బీజేపీకి ఓటు వేయండి

ఒక కుటుంబం కోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది?

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్… తన కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు

టిఆర్ఎస్ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఒకసారి ఆలోచించండి

మీ పార్టీలో మీరెప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు

కెసిఆర్ తన కొడుకు కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నాడు

మీకెవరికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా?

మీరు సీఎం పదవికి అర్హులు కారా?

ఇప్పటికైనా మీరంతా ఆలోచించండి

ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా… లక్షల కోట్లు దండుకుని, విదేశాల్లో పెట్టుబడులు పెట్టిండు

ప్రజాస్వామ్య నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ మహోద్యమంలో… టిఆర్ఎస్ నేతలంతా భాగస్వామ్యం కావాలని కోరుతున్న

ప్రజాస్వామ్య నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం

కెసిఆర్ అవినీతి, కుటుంబ, నియంతృత్వ, గడీల పాలనను బొందపెడదాం

పచ్చ జెండా గాడు(ఎంఐఎం) అపవిత్రం చేసిన జగిత్యాల గడ్డను… నిన్ననే ఏబీవీపీ తమ్ముళ్లు యాత్రచేసి పవిత్రం చేశారు

జగిత్యాల నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద భారీగా నిధులను మంజూరు చేసింది

ఉచిత బియ్యం, ఉచిత వాక్సిన్ ఇచ్చిన ఘనత మోడీ దే

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అంతా… కేంద్రం ఇస్తున్న నిధులతోనే

కెసిఆర్ ఢిల్లీ పోయి రాజశ్యామల యాగం చేస్తాడట

ఢిల్లీలో పూజలు చేస్తున్న సందర్భంగా… నువ్వు ఎన్ని హామీలు ఇచ్చావో ముందు ప్రజలకు చెప్పు.

అప్పుడే రాజశ్యామల యాగం కు సార్ధకత ఉంటుంది

ఒక మోడీ ని అడ్డుకునే దమ్ములేక, గుంటనక్కలు అన్నీ కలిసి వస్తున్నాయి

నరేంద్రమోదీ సింగిల్ గా… సింహలా వస్తారు

తెలంగాణలో బిజెపికి ఒకసారి అవకాశం ఇవ్వండి

అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం

BREAKING

జగిత్యాల జిల్లా చెల్గల్ గ్రామంలోని బీడీ ఫ్యాక్టరీని సందర్శించిన బండి సంజయ్

బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్

బండి సంజయ్ కి తమ సమస్యలను చెప్పుకున్న బీడీ కార్మికులు

జగిత్యాల జిల్లా పరిధిలో 6 లక్షల మంది వరకు బీడీ కార్మికులం ఉన్నాము – బండి సంజయ్ తో బీడీ కార్మికులు

ఈ జిల్లా పరిధిలో 14 బీడీ పరిశ్రమలు ఉన్నాయి – బండి సంజయ్ తో బీడీ కార్మికులు

కనీసం మాకు ఇక్కడ ‘ఈఎస్ఐ హాస్పిటల్’ కూడా లేదు – బండి సంజయ్ తో బీడీ కార్మికులు

మాకు ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చేలా, మా కార్మికులను ఆదుకునేలా చూడగలరు – బండి సంజయ్ తో బీడీ కార్మికులు

తప్పకుండా జగిత్యాలలో ‘ఈఎస్ఐ హాస్పిటల్’ వచ్చేలా కృషి చేస్తా – బీడీ కార్మికులతో బండి సంజయ్

తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వచ్చాక, బీడీ కార్మికులను ఆదుకుంటాం – బీడీ కార్మికులతో బండి సంజయ్

బీడీ కార్మికులను కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదు – బీడీ కార్మికులతో బండి సంజయ్

BREAKING

15వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

జగిత్యాల జిల్లా హస్నాబాద్ బస్టాండ్ వద్ద, బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి శ్రేణులు

కాసేపట్లో జగిత్యాల టౌన్ లోకి ప్రవేశించనున్న బండి సంజయ్ పాదయాత్ర

BREAKING

15వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

జగిత్యాల టౌన్ లోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర

జగిత్యాల టౌన్ లో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి శ్రేణులు

బండి సంజయ్ అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్న, వేలాది గారు వచ్చిన ప్రజలు, కార్యకర్తలు, బండి సంజయ్ అభిమానులు

పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడుతున్న యువత, చిన్నపిల్లలు

ప్రజలకు అభివాదం చేస్తూ… పాదయాత్రగా ముందుకు సాగుతున్న బండి సంజయ్

BREAKING

పాదయాత్రలో భాగంగా… ‘జగిత్యాల నుంచి ముంబై’ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సును చూసి, బస్సు ఎక్కి, ప్రయాణీకులతో మాట్లాడిన బండి సంజయ్

ఈ సందర్భంగా బండి సంజయ్ కి తమ ఆర్థిక స్థితి సహా ఇబ్బందులను చెప్పుకున్న ముంబై కి వలస వెళ్తున్న కుటుంబాలు

పొట్టకూటి కోసం జగిత్యాల నుంచి ముంబై వలస పోతున్నామని సంజయ్ ఎదుట తమ గోడు చెప్పుకున్న వలస కార్మికులు

తెలంగాణలో ఉపాధి లేక, కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకే… వలస బాట పట్టామని ఆవేదన వ్యక్తం చేసిన కార్మికులు

బస్సు టికెట్ ఎంత అని అడుగగా… రూ.2000 అని చెప్పిన కార్మికులు

కార్మికుల కష్టాలు విని చలించిపోయిన బండి సంజయ్

కేసీఆర్ పాలనలో ఇంకా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి

మహబూబ్నగర్ లో పాదయాత్ర చేసినప్పుడు కూడా… ముంబైకి వలస పోతున్న కుటుంబాలను చూసాం

రాష్ట్రంలో ఉపాధి లేకనే వలసలు వెళ్లే పరిస్థితి వచ్చింది

ఈ మూర్ఖుడి పాలన పోవాలి.. పేదల పాలన రావాలి

పేదల ప్రభుత్వం వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది

తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వచ్చాక, తప్పకుండా వలసలను ఆపుతాం. అందరికీ ఉపాధి కల్పించి, ఆర్థికంగా అండగా నిలబడతాం

– వలస కార్మికులతో బండి సంజయ్

BREAKING

15వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

జగిత్యాల పట్టణంలో భారీ జన సందోహం నడుమ కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

జగిత్యాల టౌన్ లోని మంచినీళ్ల బావి వద్ద ‘ఛత్రపతి శివాజీ’ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించిన బండి సంజయ్

అనంతరం పాదయాత్రగా ముందుకు సాగిన బండి సంజయ్

15వ రోజు ప్రారంభమైన బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”. జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామంలోని రాత్రి బస కేంద్రం నుంచి ప్రారంభమైన బండి సంజయ్ రాత్రి బస. జగిత్యాల టౌన్, ధరూర్, రాజారం, తారక రామ్ నగర్, నూకపల్లె, మల్యాల క్రాస్ రోడ్స్, ముత్యంపేట్ మీదుగా కొండగట్టు వరకు కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర. ఈరోజు మొత్తం 18 కిలోమీటర్ల మేర కొనసాగునున్న పాదయాత్ర. ఇవాళ రాత్రికి కొండగట్టు సమీపంలో బండి సంజయ్ రాత్రి బస.

BREAKING

బండి సంజయ్, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు & కరీంనగర్ ఎంపీ కామెంట్స్ @ చెల్గల్ రాత్రి శిబిరం:

5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఈనెల 15న మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ లో జరగనుంది

ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరవుతారు

జనసమీకారణ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

కరీంనగర్ నుంచి బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేసి, కేసీఆర్ కు ఛాలెంజ్ విసురుతాం

కేసీఆర్ కుట్రలను, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారు

సమైక్యాంధ్ర చిచ్చు రగిల్చి, సెంటిమెంట్ తో మళ్లీ లబ్దిపొందాలని చూస్తున్నాడు

1400 మంది బలిదానం చేసుకుంటేనే తెలంగాణ వచ్చింది

ఏపీతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నాడు

అడ్డగోలుగా సంపాదించిన కుటుంబాన్ని కాపాడుకోడానికే.. ప్రజల దృష్టి మళ్లించి, నీచ రాజకీయాల చేస్తున్నాడు

కేసీఆర్ మాటలను ఎవరూ పట్టించుకోరు

కేసీఆర్ చెల్లని రూపాయి

ఇక్కడే చెల్లని కేసీఆర్..

BRS పేరుతో అక్కడ చెల్లుతాడా?

కేసీఆర్ కుటుంబం అంతా అవినీతిమయం

కేసీఆర్ పేదోళ్లను అరిగోస పెడుతున్నాడు… ఏ యాగం చేసినా… నీకు ఫలించదు

గతంలో తెలంగాణలో యాగం చేసిన తర్వాత, నువ్వు తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేశావ్?

ఢిల్లీలో రాజశ్యామల యాగం చేస్తే… నీ పాపాలు పోతాయా?

తెలంగాణ లో ఎంతమందికి 2bhk, నిరుద్యోగ భృతి, దళిత బంధు, దళితులకు 3 ఎకరాలు ఇచ్చావ్?

కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎంత కమిషన్ దొబ్బి పోయావో.. ముందు ప్రజలకు సమాధానం చెప్పు

రాజశ్యామల యాగం సాక్షిగా ప్రజలకు నిజాలు చెప్పు

లిక్కర్ కేసులో నీ కూతురు(కవిత) ప్రమేయం పై ఎందుకు స్పందించడం లేదు?

రాజశ్యామల యాగం సాక్షిగా నీ కూతురుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంబంధం లేదని ప్రమాణం చెయ్ కేసీఆర్

కవిత ఇంటి దగ్గర సింహాలు…పులుల ఫోటోలు ఏంటి?

కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుంది

దేశంలో అవినీతి విషయంలో ఏ రాష్ట్రంలో ఏం జరిగినా సీబీఐ వెళ్లి దర్యాప్తు చేస్తుంది

సీబీఐ రావొద్దు అని చెప్పడానికి నువ్వెవరు?

మోడీ వచ్చేముందు ఈడీ రాదు

మోడీ వచ్చే ముందు కేటీఆర్ కు కాలు విరుగుతది

మోడీ వస్తే ఇంకొకరికి కరోనా వస్తది

‘ధరణి’ పేరుతో భూములు దండుకున్నారు

ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ని ఓడగొట్టేందుకు, కేసీఆర్ వేల కోట్ల రూపాయలు పంపిస్తున్నారు

సీబీఐ కి బీజేపీ కి సంబంధం ఏంటి?

అక్రమంగా.. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తే, దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయకుండా ఉంటాయా..? కేంద్ర దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదని చెప్తున్నటువంటి కేసీఆర్ జాతీయ పార్టీ ఎందుకు పెడుతున్నారు – బండి సంజయ్. దేశానికి అంతర్జాతీయ సంస్థలను తీసుకొచ్చి విచారణ జరిపిస్తారా

BREAKING

నేటితో 15వ రోజుకు చేరుకున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”. కాసేపట్లో జగిత్యాల జిల్లా చల్ గల్ గ్రామంలోని రాత్రి బస కేంద్రం నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర. జగిత్యాల టౌన్, ధరూర్, రాజారం, తారక రామ్ నగర్, నూకపల్లె, మల్యాల క్రాస్ రోడ్స్, ముత్యంపేట్ మీదుగా కొండగట్టు వరకు కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర. మధ్యాహ్నం జగిత్యాల పట్టణంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్. ఈరోజు మొత్తం 18 కిలోమీటర్ల మేర కొనసాగునున్న పాదయాత్ర. ఇవాళ రాత్రికి కొండగట్టు సమీపంలో బండి సంజయ్ రాత్రి బస

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X