డెడెకేటెడ్ కమిషన్ కు సమగ్ర నివేదిక సమర్పించిన MLC కవిత, చేసారు ఈ డిమాండ్స్

55 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ దేశంలో కులగణన ఎందుకు చేపట్టలేదు

బీజేపీ డీఎన్ఏలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక భావం ఉంది

డెడికేటెడ్ కమిషన్ ను స్వతంత్రంగా పనిచేయనివ్వాలి

బీసీ గణనపై అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలి

కమిషన్ కు కూర్చుందామంటే కుర్చీ లేదు… రాసుకొందామంటే పెన్ను లేదు..

బీసీ కులగణనను ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టాలి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్

డెడెకేటెడ్ కమిషన్ కు సమగ్ర నివేదిక సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ : బీసీ కులగణన విషయంలో ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ను స్వతంత్రంగా పనిచేయనివ్వాలని, దానికి అన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీ కులగణనపై బీసీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని, వాటిని ప్రభుత్వం నివృత్తి చేయాలని అన్నారు.

55 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశంలో కులగణనను ఎందుకు చేపట్టలేదో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నాటకలో చేపట్టిన కులగణ వివరాలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ఆ వివరాలను బయటపెట్టించాలని రాహుల్ గాంధీకి సూచించారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన సమగ్ర నివేదికను సోమవారం నాడు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బీ వెంకటేశ్వర రావును కలిసి ఎమ్మెల్సీ కవిత అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… సమాజంలో అన్ని కులాలు అభివృద్ధి చెందాలని ఆయా ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జరగాల్సిన న్యాయం జరగలేదన్న ఆవేదన బీసీ వర్గాల్లో ఉందని తెలిపారు. రాజ్యాంగపరమైన హక్కులు కల్పించలేదన్న భావన బీసీల్లో తీవ్రంగా ఉందని తెలియజేశారు.

Also Read-

“ప్రాంతీయ పార్టీల హయాంలోనే బీసీలకు న్యాయం చేసే చర్యలు జరిగాయి. తమిళనాడులో జయలలిత అధికారంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు సమయంలో, తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీలకు న్యాయం జరిగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. బీసీలకు రాజకీయ, ఆర్థిక సాధికారతను ప్రాంతీయ పార్టీలే కల్పించడానికి చర్యలు చేపట్టాయి. ” అని వ్యాఖ్యానించారు.

తాము కులగణన చేపట్టబోమని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో 2021లో అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. బీజేపీ డీఎన్ఏలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక భావాలు ఉన్నాయని ధ్వజమెత్తరు. అటువంటి పార్టీలను నిలదీసి హక్కులు సాధించుకునే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పించడమే కాకుండా బీసీల అభివృద్ధికి ఏటా రూ 20 వేల కోట్ల చోప్పున ఐదేళ్లలో రూ లక్ష కోట్లు ఖర్చు చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిందని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ను యధాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

డెడికేటెడ్ కమిషన్ ను నియమించడానికి 11 నెలల పాటు ప్రభుత్వం తాత్సారం చేసిందని విమర్శించారు. డెడికేటేడ్ కమిషన్ ను ఏర్పాటు చేస్తేనే కుల గణన సాధ్యమువుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు సుప్రీం కోర్టు రెండు తీర్పులు ఇచ్చిందని, అయినా కూడా బీఆర్ఎస్ పార్టీతో పాటు అనేక బీసీ సంఘాలు ఉద్యమించే వరకు రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేయలేదని తప్పుబట్టారు. కమిషన్ ను ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ కమిషన్ కు కూర్చుందామంటే కుర్చీ లేదని, రాసుకొందామంటే పెన్ను లేదని, ఎటువంటి సౌకర్యాలు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో కేవలం నెల రోజుల్లోనే ఇంత పెద్ద అంశంపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. డెడికేటెడ్ కమిషన్ ను స్వతంత్రంగా పనిచేయనివ్వాలని విజ్ఞప్తి చేశారు. కేవలం రాజకీయ రిజర్వేషన్లకే పరిమితం కాకుండా బీసీలకు సంబంధించిన అన్ని అంశాలపై ప్రభుత్వానికి సిఫారసులు చేయాలని కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.

ప్రణాళిక శాఖ ద్వారా ఇంటింటి సర్వే చేయిస్తున్నారని, బీసీ శాఖ బీసీల వివరాలు సేకరిస్తున్నదని, ఆ సమాచారాన్ని డెడికేటెడ్ కమిషన్ వాడుకోవాలని ప్రభుత్వం చెబుతోందని, ఇది కోర్టుల్లో నిలబడుతుందా అని అన్నది ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. బీసీలకు రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు కోర్టులో కేసులు వేస్తే ఈ అంశం నిలబడుతుందా అన్న దానిపై బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బీసీ కులగణనకు సంబంధించి ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికి కూడా స్టిక్కర్లు వేయనటువంటి ఇళ్లు 70 శాతం ఉన్నాయని,అత్యధిక జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో ఇప్పటికీ సర్వే పూర్తి కాకుండానే రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం సర్వే పూర్తయిందని ప్రభుత్వం ఎలా చుబుతుందని ప్రశ్నించారు. అంతేకాకుండా, సర్వే వివరాల కంప్యుటరైజేషన్ 7 శాతం కూడా పూర్తి కాలేదని అన్నారు.

బీసీ వర్గాలకు సంపూర్ణ న్యాయం జరగాలన్న ఉద్యమాన్ని తనను జైలులు వేయకముందే వెళ్లకముందే ప్రారంభించానని, భవిష్యత్తులోనూ ఉద్యమిస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు.

డెడికేటెడ్ కమిషన్ కు సమర్పించిన నివేదికలోని డిమాండ్లు, ముఖ్య అంశాలు:

  1. తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కుల గణనను శాస్త్రీయంగా నిర్వహించేలా కమిషన్ ప్రభుత్వానికి సూచించాలి.
  2. జాతీయ స్థాయిలొ జరిగే జన గణనలో బీసీ ల గణనను కూడా చేపట్టేలా కమిషన్ నివేదికలో సిఫారసు చేయాలి.
  3. స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా రిజర్వేషన్లు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ నివేదిక సమర్పించాలి.
  4. విద్యా, ఉద్యోగావకాశాలలో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లను బీసిల జానాభా దామాషా ప్రకారం పెంచేందుకు కమిషన్ సిఫారసు చేయాలి.
  5. చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లు అమలు జరిపేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కమిషన్ సిఫారసు చేయాలి..
  6. ప్రతి ఆర్థిక సంవత్సరం తప్పనిసరిగా బిసీ సబ్ ప్లాన్ అమలు జరిపేలా ప్రభుత్వాలకు కమిషన్ సిఫారసు చేయాలి .
  7. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి కమిషన్ సూచించాలి.
  8. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఉండేలా కేంద్ర ప్రభుత్వానికి కమిషన్ సూచించాలి.
  9. ఎంబీసీ, సంచార జాతుల వారి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు జరిపేలా ప్రభుత్వానికి కమిషన్ సిఫారసు చేయాలి .
  10. అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీల) ఆర్థిక స్వావలంబనకు ప్రత్యేక చర్యలు తిసుకునేలా, ప్రస్తుతం ఉన్న ఎంబీసీ కార్పోరేషన్ కు అవసరమైన నిధులు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ సిఫారసు చేయాలి.
  11. సంచార జాతుల వారికి స్థిర నివాసాలు, ఉపాధికి ప్రభుత్వం చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి కమిషన్ సిఫారసు చేయాలి..
  12. బిసీ విద్యార్థులకు ఫిజు రీయెంబర్స్మెంట్ నిరాటంకంగా అందించేలా, విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించే బీసీ విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సహాకారం అందేలా ప్రభుత్వానికి కమిషన్ సూచించాలి.
  13. ఈనాటికీ కూడా ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగాలలో కనీస ప్రాతినిధ్యం దక్కని ఎంబీసీ, సంచార కులాలకు వారి జనాభా దామాషాను అనుసరించి, వారికి న్యాయంగా విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో దక్కవలసిన రిజర్వేషన్లు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా కమిషన్ సిఫారసు చేయాలి.
  14. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలో బీసీ కమిషన్ ద్వారా బిసి ఎన్యుమరేషన్ అన్నారు మరో వైపు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా డోర్ టు డోర్ సర్వే అన్నారు. తాజాగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా స్థానిక సంస్థల్లో బిసీల రిజర్వేషన్ల పెంపు కోసం విచారణ జరిపిస్తున్నారు. ఈ మూడింటి మధ్యలో స్పష్టత లేక ప్రజల్లో గందరగోళం నెలకొంది. కాబట్టి ఈ గందరగోళానికి ప్రభుత్వం తొలగించేలా కమిషన్ సూచించాలి.
  15. సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఇచ్చిన తీర్పుల ప్రకారం ఓబిసి రిజర్వేషన్లకు సంబంధించి ట్రిపుల్ టెస్ట్ ప్రకారం కుల గణన చేయాలి. అయినా తెలంగాణలో ప్రభుత్వం మాత్రం కుల గణన కోసం డెడికేటెడ్ కమిషన్ వేయకుండా రెగ్యులర్ బీసీ కమిషన్ కే ఆ బాధ్యతలు ఇచ్చింది. ఇది సహజంగానే కోర్టులు ఒప్పుకోని పద్ధతి. కోర్టులో బీసీ సంఘాలు ఛాలెంజ్ చేయగా కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేయవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టీ డెడికేటెడ్ కమిషన్ సమర్పించే నివేదిక స్థానిక సంస్థల్లో బిసీల రిజర్వేషన్ల పెంపుదలకు దోహద పడేలా రూపొందించాలి అని కమిషన్ కు విజ్ఞప్తి.
  16. ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ద్వారా నిర్వహిస్తున్న సర్వే ప్రశ్నావళి మీద ప్రజల్లో చాలా అభ్యంతరాలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వమే వాటిని నివృత్తి చేసే విధంగా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలి.
  17. సర్వే యొక్క మెథడాలజీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లను ప్రజలకు వివరించాల్సిందిగా కమిషన్ ను కోరుతున్నాము.
  18. ప్రభుత్వం కుల గణనకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సమకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ సూచించాలి.
  19. సామాజిక ఆర్థిక జనాభా లెక్కలు – 2011 వైఫల్యాల నుండి నేర్చుకుని, కులాల వారీ గణనను కేంద్ర ప్రభుత్వ ఇష్టానికి వదిలివేయడానికి బదులుగా జనాభా గణన చట్టం, 1948ని సవరించాలి. సాధారణ జనాభా గణనలో భాగంగా కులాన్ని సెన్సస్ కమీషనర్ మాత్రమే లెక్కించాలి, ప్రశ్నాపత్రానికి కొన్ని సంబంధిత ప్రశ్నలు జోడించబడతాయి. అదనంగా, ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి నిర్దిష్ట కులాల ముసాయిదా జాబితాను రూపొందించడానికి సామాజిక శాస్త్ర/మానవశాస్త్ర నిపుణులను నియమించాలి, ముసాయిదా జాబితాను ఆన్‌లైన్‌లో ప్రచురించాలి, దానిని ఖరారు చేసే ముందు ప్రజల నుండి సూచనలు మరియు అభిప్రాయాలను ఆహ్వానించి, ఆ జాబితాను మాత్రమే ఎన్యుమరేటర్‌లకు అందించాలి. ప్రశ్నాపత్రం ఉపకులం, కులం, కుల సమూహం, ఇంటి పేరు వంటి పేర్లను ఇళ్లకు వెళ్లి అడిగే విధంగా రూపొందించాలి. ఈ వివరాలతో ముందే లోడ్ చేయబడిన అప్లికేషన్లతో కూడిన పరికరాలు ఉండాలి. ఇక్కడ ఎన్యూమరేటర్ల పాత్ర లిస్టులో ఉన్నవాటిని ఎంచుకోవడానికే పరిమితం కావాలి. అంటే లిస్టు సమగ్రంగా ఉండాలి. ఎన్యుమరేటర్ పాత్రను పరిమితం చేయడం వలన పని సులభం అవుతుంది. వివిధ ఎన్యూమరేటర్లు సేకరించిన సమాచారం మధ్య గందరగోళం ఉండదు.
  20. బీసీలకు అన్ని రకాల రిజర్వేషన్లకు కుల గణన ప్రామాణికమై ఉన్నందున అత్యంత సమగ్రంగా కుల గణన జరిపేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ ను కోరుతున్నాము. ఇప్పటికే 2010లో జతీయ జనాభా లెక్కలలో భాగంగా సేకరించిన కులాల వారీ వివరాలు చెల్లుబాటు కానందున ఎక్కువ జాగ్రత్త అవసరం అని మేము భావిస్తున్నాము. ఇటీవల బిహార్ లో చేసిన కులగణన కూడా సంకేతిక సమస్యలతో తాత్కాలికంగా అమలుకాకుండా ఆగింది. కాబట్టి మున్ముందు చట్ట సభలలో, న్యాయస్థానాలలో నిలబడేలా సాధికారిక సమగ్ర కుల గణన జరపాలి అని గౌరవ కమిషన్ ను కోరుతున్నాము.
    ఈ కార్యక్రమంలో బి ఆర్ యస్ పార్టీ సీనియర్ బీసీ నాయకులు వి ప్రకాష్ , రవీందర్ సింగ్ , జూలూరి గౌరీ శంకర్ , పల్లె రవి కుమార్ గౌడ్ , సుమిత్ర ఆనంద్, రాజీవ్ సాగర్, మఠం భిక్షపతి , ఉపేంద్ర చారి , కిషోర్ గౌడ్ , శుభప్రద పటేల్ , రామ్ బాబు యాదవ్ , రూప్ సింగ్ ,రవీందర్ యాదవ్, మహేష్ యాదవ్, నారాయణ , నరహరి, నిమ్మల వీరన్న, మారయ్య , ఇంతియాజ్ , పావని గౌడ్, ఓదెళ్ల మాధవ్ , గీత గౌడ్ , మాధవి , మేఘన ,

జాగృతి రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి , అర్చన సేనాపతి , వరలక్ష్మి మంచాల , లలిత యాదవ్ , ఈగ సంతోష్ , నరేంద్ర యాదవ్ , శ్రీనివాస్ పుట్టి,

యునైటెడ్ ఫులే ఫ్రంట్ నాయకులు

గట్టు రామచంద్రం బొల్ల శివశంకర్ రాజారాం యాదవ్ ఆలకుంట్ల హరి దత్తాత్రేయ డి నరేష్ ఎమ్మెస్ నరహరి జఅంబటి సుధాకర్ కుమారస్వామి ప్రవీణ్ గోపు సదనందం న్యాయిని నరేందర్ మధు సుంకోజు కృష్ణమాచారి విజయేందర్ సాగర్స్ సురేష్ నిమ్మల వీరన్న మాడెపు అనిల్, లింగం , జంగయ్య పాల్గొన్నారు.

K Kavitha on X

కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసింది. కన్నతల్లికి కడుపు కోత మిగిల్చింది. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురై 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శైలజ మరణ వార్త నన్ను ఎంతగానో కలచి వేసింది.

ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పాఠశాలలో కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా, పదకొండు నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీసింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X