BRAOU: MLC ప్రొ కొదందారం హామీ మేరకు వంటా వార్పూ కార్యక్రమం వాయిదా, ఎందుకంటే…

67వ రోజుకు చేరిన అంబేద్కర్ వర్శీటీ ఉద్యోగుల నిరసనలు

హైదరాబాద్ : తెలంగాణా ఉద్యమ కీలక నేత, ఎమ్మెల్సీ ఆచార్య. కొదందారం విన్నపం మేరకు ఈ నెల 27 న తలపెట్టిన వంటా వార్పూ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు అంబేద్కర్ యూనివర్సిటీ జేఏసీ నేతలు ప్రకటించారు. డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలం జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 ను ఉపసంహరించుకోవాలని ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు ఉద్యోగులు సోమవారం వారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు బైఠాయించి, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనను కొనసాగించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబడే; సెక్రటరీ జనరల్ డా. పి. వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నానని, మరికొంత సమయం అవసరమని, ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం భావ్యం కాదని, కొంత సమయం వేచి చూడాలని ఆచార్య.కొదందారం తనను కలిసిన జేఏసీ నేతలను కోరినట్లు చెప్పారు. దీంతో పెద్దలు ప్రొ. కోదండరాం హామీ మేరకు వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Also Read-

ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ నేతలు డా. వెంకటేశ్వర్లు; డా. యకేశ్ దైద; డా. ఉదయిని; హబీబుద్దిన్; కాంతం ప్రేమ్ కుమార్; డా. రాఘవేంద్ర; పాండు; షబ్బీర్; రాములు; అధ్యాపక; అధ్యాపకేతర ఉద్యోగులు; అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X