“నా తెలంగాణ కోటి రతనాల వీణ”

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవముల సందర్భముగా శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు రోడ్లు & భవనాలు, శాసనసభ వ్యవహారాలు మరియు గృహ నిర్మాణ శాఖ గారి ప్రసంగం…

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఇక్కడకు విచ్చేసిన గౌరవ ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, మీడియా మిత్రులకు, జిల్లా ప్రజలకు, స్వాతంత్ర్య సమరయోధులకు, తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు నా ధన్యవాదములు మరియు బాలబాలికలకు నా ఆశీస్సులు.
మహాకవి శ్రీ దాశరధి గారు తెలంగాణ గురించి “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని వివరించారు. అలాంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని, బంగారు తెలంగాణ గా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామముగా కృషి చేయడం జరుగుతుంది.

మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాలు పూర్తి కాబడి 10వ సంవత్సరములోకి అడుగిడిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను జూన్ 2వ తేది నుండి 22వ తేది వరకు వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించుతూ ఘనంగా నిర్వహిస్తున్నది.

ఈ శుభవేళ మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వాములం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది. ప్రజాసంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది. “తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది” అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం.

మానవీయమైన దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచన, ప్రణాళికా రచన, పారదర్శకమైన పరిపాలన వీటన్నిటి మేలు కలయిక అయిన “తెలంగాణ మోడల్” నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్నది. రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సమగ్రాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం.

  1. వ్యవసాయ రంగం
    నిజామాబాద్ జిల్లా ప్రధానముగా వ్యవసాయాధారిత జిల్లా నీటి పారుదల రంగములో అధ్బుతమైన వృధ్ధి ఫలితముగా 2014 సంవత్సరములో4.14 లక్షల ఎకరాల పంటల సాగు విస్తీర్ణం గత తొమ్మిది సంవత్సరములలో 1.26 లక్షల ఎకరాలలో పెరిగి 2022 సంవత్సరము నాటికి 5.40 లక్షల ఎకరాలు సాగు చేయబడుచున్నది. వరి పంట సాగు 2014 లో 1.93 లక్షల ఎకరాలలో ఉండగా 2022 నాటికి 116% వృద్ది చెంది 4.18 లక్షల ఎకరాలు సాగు చేయబడుతుంది.
    రైతు బంధు పథకం: రాష్ట్ర ప్రభుత్వం 2018-19 సంవత్సరము నుండి రైతు బంధు పథకం అమలు చేస్తున్నది. ఈ పథకం క్రింద ప్రస్తుతము ఒక ఎకరానికి వానాకాలంలో 5,000 రూపాయలు మరియు యాసంగిలో 5,000 రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుచున్నది. ఇప్పటి వరకు జిల్లాలో 2018-19 సంవత్సరం నుండి 2022-23 సంవత్సరము వరకు 2,60,617 మంది రైతులకు 2385.72 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. 2022-23 సంవత్సరమునకు గాను 2,60,617 రైతులకు 531.37 కోట్ల రూపాయలు రెండు సీజనులకు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది.
    రైతు బీమా పధకము:‌‌‌ 2018-19 సంవత్సరము నుండి రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకం క్రింద అర్హత కలిగి చనిపోయిన రైతు యొక్క నామినీ ఖాతాలో నేరుగా 5 లక్షలు జమ చేసి ఆర్ధిక భరోసా కల్పించడం జరుగుతుంది.
    జిల్లాలో 2018-19 సంవత్సరము నుండి ఇప్పటివరకు చనిపోయిన 4,557 రైతుల యొక్క నామినీ ఖాతాలలో రూ.227.85 కోట్లు జమ చేయడం జరిగింది. 2022-23 లో చనిపోయిన 616 రైతుల యొక్క నామినీ ఖాతాలలో రూ.30.80 కోట్లు జమ చేయడం జరిగింది.
    వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి చొప్పున మొత్తం 106 వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులను కేటాయించి నియామకం చేపట్టడం జరిగినది. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 106 రైతు వేదికలు రూ.23.32 కోట్ల రూపాయలతో నిర్మాణము చేయనైనది.
    జిల్లాలో వానాకాలం 2023 కు గాను అవసరమయిన 89,836 మెట్రిక్ టన్నుల యూరియాకు గాను 41,679 మెట్రిక్ టన్నులు (46%) ఇప్పటికే రైతులకు అందుబాటులో ఉంచడం జరిగినది.
    ఉచిత విద్యుత్: జనవరి 1, 2018 నుండి, రాష్ట్రములోని వ్యవసాయ వినియోగదారులకు ప్రభుత్వం 24 గంటల ఉచిత మరియు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందిస్తున్నది. మన జిల్లాలో వ్యవసాయ రంగానికి రూ.3,719.25 కోట్లతో ఉచిత విద్యుత్ అందించడం జరిగింది.
  2. పౌర సరఫరాల శాఖ
    i. ధాన్యం కోనుగోలు : జిల్లాలో 2014-15 సంవత్సరం నుండి ఇప్పటి వరకు అనగా 2022-23 సంవత్సరం వరకు 75.36 లక్షల మెట్రిక్ టన్నులను రైతుల నుండి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి 13,687 కోట్ల రూపాయాలు ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల వ్యక్తిగత ఖాతాలలో నగదు చెల్లింపులు చేయడం జరిగింది. తెలంగాణా రాష్ట్రం లో ఇప్పటి వరకు సేకరించిన ధాన్యంలో నిజామాబాద్ జిల్లా వాటా 11 శాతం గా కలిగి ఉంది.
    ప్రస్తుత యాసంగి 2022-23 సీజన్ లో 5 లక్షల 92 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని (483) కేంద్రాల ద్వారా 84,807 రైతుల నుండి కొనుగోలు చేసి 552 కోట్ల రూపాయలను నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలలో చెల్లించడం జరిగినది. ఇంకను కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నది.
    ii. ప్రజా పంపిణీ పథకం: ప్రస్తుతం 2023 సం. లో మొత్తం 4,02,463 ఆహార భద్రత కార్డులు కలవు. 2023 సం. లో 12,87,360 మంది ప్రజలు లబ్ది పొందుతున్నారు. 2023 మే నెలలో ప్రతి ఆహార భద్రత కార్డుదారునికి 6 కిలోల చొప్పున, అంత్యోదయ కార్డు వారికి 35 కిలోల చొప్పున మరియు అన్నపూర్ణ కార్డు దారునికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం సరఫరా చేయబడుతున్నది. 2014 సంవత్సరము తరువాత 26,369 ఆహార భద్రతా కార్డులను అధికముగా ఇవ్వడం జరిగినది.
  3. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ
    2022-2023 ఆర్ధిక సంవత్సరములో ఆయిల్ పామ్ చెట్లు ‌2632.25 ఎకరములలో నాటనైనది. దీనికోసం 948 మంది రైతులకు 3.63 కోట్ల రూపాయల రాయితీ కల్పించనైనది మరియు బిందు సేద్యం కోరకు 3.68 కోట్ల రూపాయల రాయితీ ఇవ్వనైనది. 2023-2024 సంవత్సరములో 4,600 ఎకరములలో ఆయిల్ పామ్ సాగు చేయుటకు మరియు బిందు సేద్యం ఏర్పాటు చేయుటకు నిర్ణయించనైనది. దీనికోసం రైతుల ఎంపిక జరుగుతున్నది.
    గౌరవ ముఖ్యమంత్రి గారి హామి పథకము క్రింద అంకాపూర్, మోతే మరియు వేల్పూర్ గ్రామాలలో సూక్ష్మ నీటిపారుదల పథకము క్రింద అంకాపూర్ గ్రామాంలో 253 రైతులకు, 793.75 ఎకరములలో 4.17 కోట్ల రూపాయలు రాయితీ ఇవ్వడం జరిగినది మరియు, మోతే మరియు వేల్పూర్ 1,008 రైతులకు, 3,839.27 ఎకరములలో 18.42 కోట్ల రూపాయలు రాయితీ ఇవ్వడం జరిగినది. మరియు నీటి నిలువ కుంటల పథకం క్రింద అంకాపూర్ గ్రామములో 73 రైతులకు 1.45 కోట్ల రూపాయలు రాయితీ ఇవ్వడం జరిగినది.
  4. టి.ఎస్.మార్క్ ఫెడ్
    మార్కెఫెడ్ ద్వారా 5.41 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను 2014 నుండి 2023 (28.05.2023 వరకు) 89 PACS/IDCMS ల ద్వారా రైతులకు సరఫరా చేయడమైనది. వివిధ పంటలకు మద్దతు ధరతో 1,23,928 మంది రైతులకు 33.61 లక్షల క్వింటాళ్ళ పంటలకు 810.11 కోట్ల రూపాయలతో కొనుగోలు చేయడం జరిగింది.
  5. మత్స్య శాఖ
    ప్రస్తుతం జిల్లాలోని మొత్తం 353 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు 22,622 మంది సభ్యులు కాగా అందులో 257 పురుష సంఘాలు మరియు 94 స్త్రీ సంఘాలు కలవు. జిల్లాలోని పోచంపాడ్ ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి గడిచిన (09) సంవత్సరాలలో (12.00) కోట్లు మంజూరు చేయడం వలన కోటి చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యానికి గాను 92.66 లక్షల చేప పిల్లల ఉత్పత్తి చేయడం జరిగింది, దీనిలో భాగంగా ప్రతి సంవత్సరము ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రము పోచంపాడ్ నందు అత్యధికంగా చేప పిల్లలను ఉత్పత్తి చేసి రాష్ట్రములోనే ప్రథమ స్థానములో ఉన్నది.
    ii. చేప పిల్లల విడుదల కార్యక్రమము: జిల్లాలో 2014-15 సంవత్సరము నుండి ఇప్పటివరకు 258 సొసైటీలు మరియు సొసైటీలు లేని గ్రామాలలో కూడా ఉచితంగా 19.76 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగింది, దానికి గాను ప్రభుత్వం 18.08 కోట్లు వెచ్చించడం జరిగింది. 2014-15 సంవత్సరము నుండి ఇప్పటివరకు ఉచిత చేప పిల్లలతో పాటు తెలంగాణ ప్రభుత్వం 100% సబ్సిడీతో ఉచితంగా రొయ్య పిల్లల పంపిణీ చేయడము జరుగుచున్నది. దీనిలో భాగంగా జిల్లాలో 2.66 కోట్ల రొయ్య పిల్లలను వదలడం జరిగింది దీని కోసం ప్రభుత్వం 6.15 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది.
    iii. సమీకృత మత్స్య అభివృద్ది పథకము: ద్వార 4,301 మంది లబ్ధి పొందడం జరిగింది (75% సబ్సిడీతో) దీనికి గాను ప్రభుత్వం 20.94 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
    iv. నీలి విప్లవ పథకం: జిల్లాలో (01) హచారికి 12.00 లక్షలు మరియు 02 చేప విత్తన పెంపక చెరువులకు 8.88 లక్షలు మొత్తం ఈ పథకం ద్వారా 20.88 లక్షలు వెచ్చించడం జరిగింది.
  6. పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ:
    జిల్లాలో పశు పోషణ పై ఆధారపడిన 74 వేల రైతు కుటుంబాల అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు వివిధ కార్యక్రమాలు, పథకాలు ప్రభుత్వం అమలు చేయు చున్నది.
    i. గొర్రెల పెంపక అభివృద్ధి పథకము 2017 సంవత్సరంలో గొర్రెల పెంపక వృత్తిపై ఆధారపడ్డ ప్రాథమిక గొర్రెల మేకల పెంపక సహకార సంఘ సభ్యులైన గొల్ల కురుమ, యాదవ సభ్యులకు 75% రాయితిపై జిల్లాలో (19,106) గొర్రెల యూనిట్లు (20+1 యూనిట్) రెండు దశలలో అందచేయుటకు, గొర్రెల పెంపక అభివృద్ధి పథకం చేపట్ట బడినది. తద్వారా మాంసం ఉత్పత్తి లో స్వయం సమృద్ది సాదించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగినది.
    ఇప్పటివరకు మొదటి దశలో సరఫరా చేయబడిన గొర్రెల యూనిట్లు : 10,722 (20+1) విలువ : రూ.139.35 కోట్లు, పథకము చేపట్టబడిన తదుపరి జిల్లాలో పెరిగిన గొర్రెల సంఖ్య 2.85 లక్షలు, పెరిగిన గొర్రెల సంపద విలువ : రూ.249 కోట్లు. మాంసము ఉత్పత్తి నేడు 63.6 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగినది. జిల్లాలో రెండవ దశలో 8,384 యూనిట్ల పంపిణి యూనిట్ విలువ రూ.1,75,000/- తో జూన్ 9 నుండి ప్రారంభించడం జరుగుతున్నది.
    ii. పాడి రైతుల సంక్షేమం జిల్లాలో పాల సేకరణ 2023 నాటికీ 21.59 లక్షల లీటర్ల జరుగుతున్నది. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక సంచార పశువైద్య శాల ఏర్పాటు చేయనైనది. జిల్లా లో (4) సంచార పశువైద్య శాలలు కలవు.జిల్లాలో 4 సంచార పశువైద్య శాల నిర్వహణకు సంవత్సరానికి రూ.1.10 కోట్లు (రూపాయలు కోటి పది లక్షలు) ప్రభుత్వము ఖర్చు చేయుచున్నది. తద్వారా ఇప్పటి వరకు 91,343 పశువులకు రైతు ఇంటిముందర, అత్యవసర పశువైద్య సేవలు అందజేయ బడినవి.
    iii. గోపాల మిత్ర సేవలు : జిల్లా లో పశు జాతి అభివృద్ధి కొరకు (56) గోపాల మిత్రుల ద్వారా రైతు ఇంటిముందర కృత్రిమ గర్భధారణ సేవలు మరియు ప్రాథమిక పశు వైద్య సేవలు అందచేయబడుతున్నవి. కృత్రిమ గర్భాధారణలు 2022-23 నాటికీ (52,813) వరకు చేయడం జరిగినది. గోపాలమిత్ర సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో గోపాలమిత్రకి 2014 నాటికి నెలకి రూ. 3,500/- ఉన్న గౌరవ వేతనాన్ని 2023 సంవత్సరములో నేలకు రూ. 11,050/- (3 రెట్లు వెచ్చించి) వారిని ప్రోత్సహిస్తున్నది.
  7. విద్యుత్ శాఖ
    తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించిన తర్వాత జిల్లాలో 372.87 కోట్ల రూపాయల వ్యయం తో అదనపు ట్రాన్స్ ఫార్మర్లు మరియు లైన్లు వేయడం వలన రైతన్నలకు లో వోల్టేజ్ సమస్య తీరడoతో పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూన్నాము. మన జిల్లాలో 1,80,000 వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఇచ్చిన సబ్సిడీ 3,719.25 కోట్ల రూపాయలు. జిల్లాలో గృహ మరియు పవర్ లూమ్స్ వినియోగదారులతో పాటు ధోభీ ఘాట్, లాండ్రి, సెలూస్ వినియోగదారులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం ద్వారా ఇప్పటి వరకు ఇచ్చిన సబ్సిడీ రూ.2.62 కోట్లు.
    జిల్లాలో SC/ST వినియోగదారులకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా ద్వారా ఇప్పటి వరకు ఇచ్చిన సబ్సిడీ రూ.25.74 కోట్లు. మన జిల్లాలో రూ.160 కోట్లతో 4 క్రొత్త 220 KV సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు రూ. 5 కోట్లతో ఒక్క నూతన 132 KV సబ్ స్టేషను ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో 273.13 కోట్ల రూపాయలతో 487.5 CKM ల నూతన EHT లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
  8. నీటి పారుదల శాఖ
    జిల్లాలో 2014 నుండి 2022 వరకు భారీ, మద్య తరహా, చిన్న నీటి పారుదల, చెక్ డ్యాంలు, చిన్న నీటి ఎత్తిపోతల పథకాలు మరియు పుష్కర ఘాట్ ల పనుల పై ఇప్పటి వరకు రూ.3,894.18 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. 2015 సంవత్సరము నుండి 841 చెరువులకు రూ.348.53 కోట్లతో మిషన్ కాకతీయ పనులు (చిన్న నీటివనరుల పునరుద్ధరణ) పనులు చేపట్టడం జరిగింది. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ మరియు రూరల్ నియోజకవర్గంలో మినీ ట్యాంక్ బండ్ లను రూ. 31.67 కోట్ల వ్యయంతో అభివృద్ది చేయడం జరిగింది. RRR పనుల క్రింద జిల్లాలో 58 పనులకు రూ.27.95 కోట్లతో 2018 లో పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగింది. 2014 నుండి నిజామాబాద్ జిల్లాలో 47 చెక్ డ్యామ్ ల నిర్మాణం రూ.253.76 కోట్లతో చేపట్టడం జరిగింది.
    సిద్దాపూర్ రిజర్వాయర్: రూ.72.52 కోట్లతో వర్ని మండలం లోని చెరువుల అభివృద్ధి మరియు సామర్థ్య పెంపుదలకు పనులు జరుగుతున్నాయి. వర్ని(M) లోని చద్మల్, పైడిమల్ & నామ్‌కల్ రిజర్వాయర్ నుండి గ్రావిటీ కాలువల తవ్వకానికి రూ.46.89 కోట్లతో పనులు జరుగుతున్నాయి.
    నిజాంసాగర్ ప్రాజెక్ట్ ముఖ్య కాలువల ఆధునీకరణ: జిల్లాకు సంబంధించి (80) కి.మీ ప్రధాన కాలువ లైనింగ్ మరియు ఉప కాలువల ఆధునీకరణ పనులకు రూ.413.15 కోట్ల వ్యయంతో పూర్తి చేయబడినవి.
    శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్ జిల్లా లో జరిగిన పనుల వివరాలు : 2014 నుండి 2022 మద్య కాలంలో రు.62.66 కోట్ల వ్యయంతో ముంపు గ్రామాలకు సీసీ రోడ్లు, కట్టపైన గోడ, BT రోడ్ మరియు డ్యామ్ గేట్ల మరమ్మత్తుల పనులను చేయడం జరిగింది.
    లక్ష్మి కెనాల్ ఆధునీకరణ: లక్ష్మి కెనాల్ D2, D3, D4, D3-R2 & D3-L1 ఆధునీకరణ పనులకై తెలంగాణ ప్రభుత్వము 2017 లో రూ.20.44 కోట్లకు పరిపాలన ఆమోదము తెలిపింది. ఇట్టి పనులపై రూ.9.13 కోట్లు ఖర్చు చేయడం జరిగినది.
    కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-VII: యొక్క ముఖ్య ఉద్దేశ్యము శ్రీ రామ్ సాగర్ జలాశయం నుండి 73 Cumecs (2578 Cusecs) నీటిని ఎత్తిపోసి 1 Cumecs (35 Cusecs) నీటిని నిజామాబాద్ కి త్రాగునీరు అందించడంతో పాటు 72 Cumecs (2543 Cusecs) లతో జిల్లాలో 1.81 లక్షల ఎకరాలకు నీటి పారుదల అందించడం.
    కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 20, 21, 21A వివరాలు:
    ప్యాకేజ్ 20 సర్జ్పూల్ మరియు పంప్ హౌస్ సారంగాపూర్: (3 పంపులు ఒక్కొక్కటి 30MW) బిగింపు పని పూర్తి అయినది. పంపుల టెస్ట్ రన్ పూర్తి అయినది. 2014 నుండి ఈ ప్యాకేజ్ క్రింద అయిన ఖర్చు రు.569.76 కోట్లు.
    ప్యాకేజ్ 21 సర్జ్ ఫూల్ & పంపు హౌస్ @ మంచిప్ప: (ఒక్కక్కటి 30MW, 2 పంపులు) పంపులు మరియు మోటార్లు రావాల్సి ఉన్నవి. కొండెము చెరువులో నీటిని వదలడానికి ప్రెజర్ మెయిన్స్ వేయు పని మరియు సర్జ్ ఫూల్ లైనింగ్ పని పూర్తి అయినది. 2014 నుండి ఈ ప్యాకేజ్ క్రింద అయిన ఖర్చు రు.226.94 కోట్లు.
    ప్యాకేజ్ 21A మెట్‌పల్లి సెగ్‌మెంట్: పంపు హౌస్ నిర్మాణము (10 పంపులు X 2.5 MW సామర్ద్యము, 14.400 కి.మీ., నిజాంసాగర్ కెనాల్, మెంట్రాజ్పల్లి వద్ద) దాదాపు పూర్తి అయినది మరియు నెట్‌వర్క్ పైపు లైన్ పనులు జరుగుతున్నవి. పంపుల డ్రై రన్ మరియు వెట్ రన్ కు సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. నెట్‌వర్క్ పైప్ లైన్ లో భాగంగా 83.69 కి. మీ. M.S, 130.86 కి. మీ. D.I. మరియు 1,029.53 కి. మీ. HDPE పైప్ లైన్ వేయడం జరిగింది. ఈ ఖరీఫ్ లో 16,500 ఎకరాలకు నీరు అందించడానికి సిద్దం చేయబడుతున్నది.
    ప్యాకేజ్ 21A గడ్కోల్ సెగ్‌మెంట్: పంపు హౌస్ నిర్మాణము (8 పంపులు X 2.0 MW సామర్త్యంతో మంచిప్ప చేరువు వద్ద) పురోగతిలో ఉంది మరియు నెట్‌వర్క్ పైపు లైన్ పనులు పురోగతిలో ఉన్నాయి. నెట్‌వర్క్ పైప్ లైన్ లో భాగంగా 51.70 కి. మీ. M.S మరియు 90.35 కి. మీ. D.I. పైప్ లైన్ వేయడం జరిగింది. మొత్తం ప్యాకేజ్ 21A క్రింద అయిన ఖర్చు రు.1,748.95 కోట్లు.
    శ్రీ రామ్ సాగర్ జలాశయ పునరుజ్జీవ పథకం: శ్రీ రామ్ సాగర్ పునరుజ్జీవనలో భాగంగా తెలంగాణా ప్రభుత్వము రూ.1,999.56 కోట్లతో పునరుజ్జీవ పథకాన్ని చేపట్టి, మూడు ఎత్తిపోతల ద్వారా వరద కాలువలో నీరు నిలిచి వరద కాల్వను నాలుగు రిజర్వాయర్లు గా మార్చడము జరిగింది.
    జాకోర, చందూర్ ఎత్తిపోతల పథకం: నిజాంసాగర్ కెనాల్ కుడి వైపున ఉన్న 7050 ఎకరాలకు నీరు అందించడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ రూ.106.04 కోట్లకు పనులు జరుగుతున్నాయి.
    చిన్న నీటి ఎత్తిపోతల పథకాలు:- ఫతేపూర్, సుబీరియాల్, మరియు చిట్టాపూర్ ఎత్తిపోతల పథకానికి రూ.149.66 కోట్లతో పనులు జరుగుతున్నాయి. 9,214 ఎకరాలకు ఈ పథకం ద్వారా నీరు అందుతుంది. మాక్లూర్ మండలములోని నిజాంసాగర్ చివరి ఆయకట్టు 1,000 ఎకరాలకు నీటిని అందివ్వటానికి, ఎత్తిపోతల పథకానికి రూ.11.71 కోట్లతో పనులు జరుగుతున్నాయి.
    మునిపల్లి లిఫ్ట్ స్కీమ్: గుత్పా బ్యాలెన్సింగ్ ట్యాంక్ పైన ఎత్తిపోతల పథకానికి రు.26.80 కోట్లతో పనులు జరుగుతున్నాయి. 2,642 ఎకరాలకు ఈ పథకం ద్వారా నీరు అందుతుంది.
    ఆపరేషన్ మరియు మేంటెనెన్స్ పనులు
    మేజర్ లిఫ్ట్ స్కీమ్ లు: అలీ సాగర్, గుత్ప, చౌట్పల్లి మరియు లక్ష్మి కెనాల్ లిఫ్ట్ పథకాల కార్యనిర్వహణ పనుల గురించి 2014 నుండి 2022 వరకు రూ.27.57 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
    చెరువుల మరియు కాల్వల నిర్వహణ పనులు: 2021 నుండి 191 ఆపరేషన్ మరియు మేంటెనెన్స్ పనులకు రూ.18.34 కోట్లకు అనుమతి మంజూరు చేయబడినది.
    పుష్కర ఘాట్ లు: జిల్లాలో 10 పుష్కర ఘాట్లను రూ.10.22 కోట్ల వ్యయంతో 2015 లో గోదావరి పుష్కరాల సంధర్భంగా నిర్మించడం జరిగింది.
  9. రహదారులు మరియు భవనముల శాఖ
    జిల్లాలో రహదారులు మరియు భవనముల శాఖ కింద 1,366 కి.మీ రహదారి కలదు. వీటిలో రాష్ట రహదారులు 23 కి.మీ పొడవు, ప్రధాన జిల్లా రహదారులు 576 కి.మీ పొడవు . ఇతర జిల్లా రహదారులు 566 కి.మీ పొడవు, పంచాయత్ రాజ్ శాఖ నుండి తీసుకున్న రహదారులు 201 కి.మీ పొడవు కలదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 60 సంవత్సరములో జిల్లాలో 380 కి.మీ. ల డబల్ లేను రహదారులు ఉండెను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 9 సo. కాలంలో జిల్లాలో 566 కి.మీ అదనంగా డబల్ లేన్లుగా 115% అభివృద్ధి చేయడం జరిగినది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిధులతో (R&B) శాఖ ఆధ్వర్యంలో
    ప్రణాళిక పద్దు కింద : రూ.905.00 కోట్లతో 79 రహదారి పనులు, 566 కి.మీ పొడవుతో మంజూరు కాగా, 504 కి.మీ రూ.782 కోట్ల వ్యయంతో పూర్తి అయి, 62 కి.మీ పనులు 123.00 కోట్లతో పురోగతిలో ఉన్నవి. బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూర్ మరియు మోతే వద్ద నిర్మించిన భారి వంతెనలను 100 రోజుల రికార్డు సమయంలో పూర్తి చేయడంతో పాటుగా మొత్తం 14 వంతెనలు రూ.60.00 కోట్లతో మంజూరుకాబడి పూర్తి అయినవి.
    ప్రణాళికేతర పద్దు కింద :- రూ. 377.5 కోట్లతో 213 పనులు, 963 కి.మీ, పొడవు మంజూరు అయినవి. వీటిలో 671 కి.మీ పొడవు 264 కోట్ల వ్యయంతో పూర్తి అయినవి. రూ. 113.5 కోట్లతో 292 కి.మీ పొడవుతో పనులు వివిధ దశలలో ఉన్నవి. రూ. 65.5 కోట్ల నిధులతో 45 వంతెనలు మంజూరు కాగా 7 వంతెనలు రూ. 15.90 కోట్లతో పూర్తి కాగా 38 వంతెనలు వివిధ దశలలో ఉన్నవి.
    సి.ఆర్.ఎఫ్:- రూ 122.00 కోట్లతో మొత్తానికి, 8 పనులు, 99 కి.మీ పొడవు మంజూరయ్యింది. 5 పనులు పూర్తయ్యాయి, 70 కి.మీ పొడవు రూ. 69 కోట్ల వ్యయంతో పూర్తి అయినవి. 3 పనులు పురోగతిలో ఉన్నవి.
    నాబార్డ్ & ఆర్.డిఎఫ్ :- రూ.25.29 కోట్లతో 6 వంతెనలు, 4 రహదారి పనులు , 32 కిమీ పొడవు మంజూరయ్యింది .6 బ్రిడ్జిలు, 4 రహదారి పనులు రూ. 21.80 కోట్ల వ్యయంతో పూర్తి అయినవి.
    భవనముల పనుల కింద :- రూ.82.03 కోట్లతో సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం, 5 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కమ్ రెసిడెన్స్, నాక్ భవనము మరియు కలెక్టర్ రెసిడెన్సి భవనము మంజూరు చేయబడినవి. రూ.59.12 కోట్ల వ్యయంతో 5 భవనాల నిర్మాణం పనులు పూర్తి అయ్యాయి. 3 పనులు అభివృద్ధి లో ఉన్నాయి.
    రైల్వే డిపాజిట్ వర్క్స్ కింద:- ఆర్మూర్ పట్టణంలో పాత ఎన్ హెచ్7 రహదారి కి.మీ 311/6 రైల్వే బ్రిడ్జ్ నంబర్ 773 రూ. 32.00 కోట్లతో మంజూరు చేయబడింది. ఈ పని అభివృద్ధి దశలో ఉంది. ROB-ఆర్మూర్-భీమ్‌గల్ రోడ్డు రైల్వే బ్రిడ్జి నెం. 771లో 0/100 నుండి 0/9 వరకు రూ.11.10 కోట్లతో పని పూర్తి అయినది. ROB @ మాధవనగర్ ఎల్సి నెం.193 పని రూ.93.12 కోట్లతో మంజూరు చేయబడింది మరియు ఈ పని అభివృద్ధి దశలో ఉంది. ROB @ అర్సపల్లి ఎల్సి నెం.191 పని రూ.138 కొట్లలో మంజూరుకాగ అట్టి పనికి టెండరు పిలవబడినది.
    SCSDF & STSDF 2022-2023 :- రూ.162.51 కోట్లతో మొత్తానికి 73 పనులు, 128 కి.మీ పొడవు మంజూరయినవి.
    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 9 సo. కాలంలో మొత్తం రూ.2,008.55 కోట్లతో జిల్లాలో అభివృద్ధి చెయ్యడం జరిగినది.
  10. పల్లె ప్రగతి
    తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు కంటే ముందు మన జిల్లాలో 19 మండలములు, 393 గ్రామపంచాయితీలు కలవు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము తరువాత క్రొత్తగా 14 మండలాలు 137 గ్రామ పంచాయితీలు ఏర్పాటు చేయబడినవి. నేడు జిల్లాలో 33 మండలములు, 530 గ్రామ పంచాయితీలు కలవు. 530 పంచాయితీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు.
    ప్రస్తుతము గ్రామ పంచాయితీలకు సంవత్సరానికి దాదాపుగా రూ.120 కోట్ల నిధులు మంజూరి చేయబడుచున్నవి. 2014 సంవత్సరము నుండి 2023 సంవత్సరము వరకు 689.96 కోట్ల నిధులు విడుదల చేయబడి వాటి ద్వారా అభివృద్ది కార్యక్రమములు చేపట్టబడుచున్నవి.
    పారిశుద్ద్యము : తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు కంటే ముందు, గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు అతి తక్కువ వేతనముతో గ్రామానికి ఒకరు లేదా ఇద్దరు ఉండేవారు. ప్రస్తుతము ప్రతి గ్రామ పంచాయితీలో 500 జనాభాకు ఒకరు చొప్పున 530 గ్రామ పంచయితీలకు గాను 2,288 మల్టీపర్పస్ వర్కర్లను నియమించడము జరిగినది. వీరికి ప్రతి మాసము ఒక్కొకరికి రూ.9,500/- చొప్పున నెలకు వేతనము చెల్లించడము జరుగుతున్నది.
    గ్రామీణ పారిశుద్ద్య నిర్వహణ కోసం ప్రభుత్వము గ్రామ పంచాయితీలకు కావాలసిన సాధనాలన్నింటిని సమకూర్చింది. జిల్లా యందలి 530 గ్రామ పంచాయితీలలో రూ.13.25 కోట్లతో సిగ్రిగేషన్ షెడ్ లు ఏర్పాటు చేయడము జరిగింది. మరియు ప్రతి గ్రామ పంచాయితీకి ట్రాలీతో కూడిన ట్రాక్టర్ ను అందించడం జరిగినది.గ్రామ పంచాయితీలలో ఉన్న (1675) OHSR ట్యాంకులను ప్రతి వారము శుభ్రపరిచి నీటిని క్లోరినేషన్ చేసి ప్రతి పంచాయితీ కార్యదర్శి విధిగా DSR App నందు పొందుపరచడము జరుగుతున్నది. రాష్ట్రము ఏర్పాటుకు ముందు కరెంటు చార్జీలు సంవత్సరానికి రూ.1.2 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి చెల్లించగా, నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రతి మాసానికి సుమారు రూ. 2.5 కోట్లు కరెంటు చార్జీల క్రింద చెల్లింపులు చేయబడుచున్నవి.
    హరిత హారం : అంతరించిపోతున్న ఆడవులను 33% పెంచడానికి తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత హరిత నిధి ఏర్పాటు చేయడం జరిగినది. 2019-20 నుండి 2022-23 వరకు విడుదలైన నిధుల నుండి 10% రూ.50.06 కోట్లు హరిత నిధికి కేటాయించి పూర్తిగా వ్యయము చేయడం జరిగింది. రాష్ట్రము ఏర్పాటు కంటే ముందు 36 నర్సరీలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతము 530 గ్రామ పంచాయితీలలో నర్సరీలను ఏర్పాటు చేసి హరితహారము కొరకు మొక్కలను పెంచుతూ ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున సరఫరా చేయడం కూడా జరుగుతుంది. జిల్లాలోని 530 గ్రామ పంచాయితీలకు గాను 660 పల్లె ప్రకృతి వనము మరియు 120 బృహత్ పల్లె ప్రకృతి వనాలు, 490 తెలంగాణ క్రీడా ప్రాంగణాలు మరియు 530 వైకుంఠధామలు ఏర్పాటు చేయబడినవి.
    పల్లె ప్రగతి : 2019 సంవత్సరము నుండి నేటి వరకు 6 విడతలుగా పల్లె ప్రగతి కార్యక్రమము అన్నీ గ్రామాలలో విజయవంతంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమములో దాతల నుండి మరియు గ్రామ పంచాయితీ నిదులనుండి 155 వైకుంఠ రథాలు, 52 ఫ్రీజర్లు మరియు 5 లాకర్లు సమకూర్చుకోవడం జరిగినది. పల్లె ప్రగతి కార్యక్రమాలలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రేరణ పొందిన దాతలు స్వచ్చందముగా రూ.5.08 కోట్లను విరాళాలు వస్తు మరియు ధన రూపములో గ్రామ పంచాయితీలకు ఇవ్వడము జరిగింది. ఇట్టి విరాళాలతో గ్రామ పంచాయితీలలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడము జరిగినది.
    గ్రామ పంచాయితీలకు అవార్డులు : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత మన జిల్లాకు జాతీయ స్థాయిలో 2017 సం.నకు గాను వేల్పూర్ మండలము లోని వేల్పూర్ గ్రామ పంచాయతీకి స్వశక్తి కరణ్ పురస్కారము, 2019 సం.నకు కమ్మర్ పల్లి మండలములోని నాగపూర్ గ్రామ పంచాయతీకి దీన్ దయాల్ ఉపాధ్యాయ స్వశక్తి కరణ్ పురస్కారము, 2020 సం.నకు గాను జిల్లా ప్రజా పరిషత్ నిజామాబాద్ మరియు మండల ప్రజా పరిషత్ నందిపేట్ నాకు దీన్ దయాల్ ఉపాధ్యాయ స్వశక్తి కరణ్ పురస్కారములు పొందినవి.
    సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన 2021-22 క్రింద దేశవ్యాప్తంగా ప్రకటించిన అత్యుత్తమ 20 గ్రామ పంచాయితీలలో తెలంగాణ రాష్ట్రము నుండి 19 గ్రామ పంచాయితీలు ఎంపిక కాబడినవి, వాటిలో 5 గ్రామ పంచాయితీలు మన నిజామాబాద్ జిల్లాకు చెందినవి. స్వచ్చ్ భారత్ అవార్డు – 2022: (స్వచ్చ్ సర్వేక్షణ గ్రామీణ) 2021-22లో ODF సుస్థిరత చర్యలు మరియు ODF-Plus కాంపోనెంటుల అమలు కోసం స్వచ్చ్ భారత్ మిషన్ గ్రామీణ కింద చేసిన అత్యుత్తమ పనికి గుర్తింపుగా భారతదేశం లోని మొత్తం జిల్లాల విభాగం లో నిజామాబాద్ జిల్లా 3 వ స్థానాన్ని పొందింది.
    2023 సంవత్సరమునకు గాను రాష్ట్ర స్థాయిలో కుకునూర్ గ్రామ పంచాయితీ వేల్పూర్ మండలమునకు జాతీయ పంచాయితీ అవార్డు రావడం జరిగినది.
  11. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ
    2023 నాటికి 2,50,030 మహిళలతో, 23,775 సంఘాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా 806 గ్రామ సంఘాలు కలవు. సంస్థాగత నిర్మాణం లో భాగంగా 2014 కు ముందు VOA లకు ప్రభుత్వం నుండి ఎలాంటి వేతనము చెల్లించబడలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 సం.లో GOMs No. 58, తేదీ: 03.08.2017 ద్వారా VOA లకు గౌరవ వేతనం రూ. 3,000/- లు ఏప్రిల్ 2017 నుండి SERP ద్వారా గ్రామ సంఘాలకు నేరుగా అందజేయడం జరిగింది. ఇది కాకుండా గ్రామ సంఘాల ఆర్ధిక అభివృద్ధిని బట్టి VOA లకు రూ.2,000/- లు చెల్లించడం జరుగుతుంది. 2021 జూలై మాసం నుండి 30% పెంపుదల కలిపి ప్రస్తుతము మొత్తం రూ.3900/- లను VOA లకు గౌరవ వేతనం చెల్లించడం జరుగుతుంది.
    2023 వరకు ఉపాది కల్పన మరియు మార్కెటింగ్ మిషన్ ద్వారా 2,028 నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి 1,871 మందికి ఉద్యోగ కల్పన చేయడం జరిగినది. 2022-2023 సంవత్సరములో బ్యాంకు లింకేజి ద్వారా 19,379 మహిళా సంఘాలకు రూ.1123.28 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగినది. 2014-15 నుండి 2022-23 వరకు మహిళా సంఘాలకు రూ.260 కోట్ల 46 లక్షలతో వడ్డీ రాయితీ అంద చేయడమైనది. 2023 వరకు స్త్రీనిది ద్వారా 182.00 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడం జరిగినది. రాష్ట్ర స్థాయిలో వరుసగా గత 10 సం.ల నుండి నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానములో నిలిచి అవార్డు తీసుకోవడం జరిగినది.
    ఆసరా పెన్షన్లు : 2023 నాటికి జిల్లాలో మొత్తం 2,78,512 లబ్దిదారులకు వివిధ రకాల ఆసరా పెన్షన్లు (ఒక్కో లబ్దిదారునికి పెన్షన్ రూ.2016, మరియు రూ.3016/- ఒక్కో నెల చోప్పున) అందజేయబడినవి. మొత్తం విలువ రూ.558.67 కోట్లు.
    MGNREGS : 2023 నాటికి జారీచేసిన జాబ్ కార్డుల సంఖ్య 2,55,012. జిల్లాలో ఉపాది హామీ ద్వారా, 2023 నాటికి 63.01 లక్షల పనిదినాలు కల్పించబడి 93.29 కోట్ల రూపాయలు వేతనాలు చెల్లించడం జరిగినది. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకము క్రింద జాతీయ స్థాయిలో 3 గ్రామ పంచాయితీలకు అవార్డులు ప్రధానం చేయబడినవి, ఎడపల్లి మండలములో 30.00 కోట్ల రూపాయల అంచనాలతో వివిధ పనులు శాం ప్రసాద్ ముఖర్జీ రూర్బాన్ పథకం క్రింద చేపట్టబడినవి. CM గిరి వికాస్ పథకం క్రింద, 467 ఎకరాల సాగుకు 177 గిరిజన లబ్దిదారులకు బంజరు భూములలో బోర్ తవ్వకం, మోటారు, కరెంటు సరఫరా కొరకు 1.37 కోట్ల రూపాయల అంచనాలతో పనులు చేపట్టబడినవి, వాటర్ షెడ్ పథకం క్రింద వర్ని మరియు సిరికొండ మండలాలు ఎంపిక చేయబడి రూ.19.60 కోట్ల అంచనా వ్యయంతో పనుల ప్రణాళికలు తయారు చేయబడినవి.
  12. పట్టణ ప్రగతి
    i. నిజామాబాద్ నగర పాలక సంస్థ
    నిజామాబాద్ నగరపాలక సంస్థ 2014 వ సంవత్సరం నుండి ఇప్పటివరకు 962 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా కేటాయించడం జరిగింది. అట్టి నిధుల ద్వారా అమృత్ వాటర్ సప్లై పథకం నందు 110 కోట్ల రూపాయలతో పనులు చేయడం జరిగింది. 246 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు రెండు STPs నిర్మించడం జరిగింది. సీఎం అష్యూరెన్స్ కింద 300 కోట్ల రూపాయలలో నగరంలో వివిధ రోడ్లు వేయుట, Storm water Drainage నిర్మించుట, సెంట్రల్ మీడియం మరియు జంక్షన్ లను అభివృద్ధి పరుచుట, రఘునాథ్ ట్యాంక్ బండ్ అభివృద్ధి పరచుట, కమ్యూనిటీ హాల్స్ నిర్మించుట, క్రిమిటోరియంలను నిర్మించుట, పార్కులను అభివృద్ధి పరచుట, ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ వెజ్ మార్కెట్, అహ్మదీ బజార్ మార్కెట్ నిర్మించుట, మున్సిపల్ భవనం నిర్మాణం పనులను చేపట్టడం జరిగింది. మరియు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ అర్బన్ ప్రాంతానికి 100 కోట్ల రూపాయలను స్పెషల్ డెవలప్మెంట్ ద్వారా కేటాయించడం జరిగింది. అందున కళాభారతి, రోడ్లు డ్రైన్లు మరియు ఇతర అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుంది. నిజామాబాద్ నగరం నందు తెలంగాణకు హరితహారం కింద 60 ట్రీ పార్కులను అభివృద్ధి పరచుట 20 కిలోమీటర్ల మీడియన్ ప్లాంటేషన్, 9 కిలోమీటర్ల మేర MLAP అభివృద్ధి పరచడం జరిగింది. నిజామాబాద్ నగరానికి పట్టణ ప్రగతి ద్వారా 98 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. నగరంలో వివిధ పథకాల ద్వారా విడుదలైన నిధుల ద్వారా 51 కోట్లతో 412 రోడ్లు వేయడం మరియు 55 కోట్లతో 477 డ్రైనేజీ నిర్మించడం జరిగింది.
    ii. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ
    నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా 12.25 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది అందున 294 లక్షలతో చిన్నాపూర్ లోని అరణ్య అర్బన్ పార్క్ అభివృద్ధి చేయుట, 1.50 కోట్లతో ఐడిఓసి నందు సెంట్రల్ మీడియా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
    iii. ఆర్మూర్ పురపాలక సంఘం
    ఆర్మూర్ పురపాలక సంఘంనకు 2014 వ సంవత్సరం నుండి ఇప్పటివరకు 277 కోట్ల రూపాయలను వివిధ పథకాల ద్వారా కేటాయించడం జరిగింది అందులో టీఎండిపి పథకం కింద 114 కోట్లు, మిషన్ భగీరథ పథకం కింద 41 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా 1.79 కోట్లు, ఎస్సీ ఎస్టీ పథకం ద్వారా 1.39 కోట్లు, TUFIDC ద్వారా 90.75 కోట్లు, GO 65 ప్లాన్ నిధుల ద్వారా 5.5 కోట్లు, పట్టణ ప్రగతి నిధుల ద్వారా 17.86 కోట్లను కేటాయించడం జరిగింది. అందున 11.5 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించుట, ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చుట, పారిశుద్ధ విభాగం కొరకు 16 వాహనాలను కొనుగోలు చేయడం జగిరింది.
    iv. బోధన్ పురపాలక సంఘం
    బోధన్ పురపాలక సంఘంనకు 2014 వ సంవత్సరం నుండి ఇప్పటివరకు 120.00 కోట్ల రూపాయలను వివిధ పథకాల ద్వారా కేటాయించడం జరిగింది. అందున మిషన్ భగీరథ పథకం కింద 12 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా 16.19 కోట్లు, ఎస్సీ ఎస్టీ పథకం ద్వారా 2.97 కోట్లు, TUFIDC ద్వారా 50.00 కోట్లు, GO 65 ప్లాన్ నిధుల ద్వారా 9.20 కోట్లు, పట్టణ ప్రగతి నిధుల ద్వారా 18.59 కోట్లను కేటాయించడం జరిగింది. అందున మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్ల కనెక్షన్ ఇచ్చుట, ELSRs నిర్మించుట, పైప్ లైన్ వేయుట మరియు పారిశుద్ధ విభాగం కొరకు 24 వాహనాలను కొనుగోలు చేయడం జరిగింది.
    v. భీంగల్ పురపాలక సంఘం
    భీంగల్ పురపాలక సంఘంనకు ఇప్పటివరకు 35 కోట్ల రూపాయలను వివిధ పథకాల ద్వారా కేటాయించడం జరిగింది అందున 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా 3.27 కోట్లు, TUFIDC ద్వారా 25 కోట్లు, GO 65 ప్లాన్ నిధుల ద్వారా 3 కోట్లు, పట్టణ ప్రగతి నిధుల ద్వారా 2.75 కోట్లను కేటాయించడం జరిగింది. అందున పారిశుద్ధ విభాగం కొరకు వాహనాలను కొనుగోలు చేయుట, రోడ్లు మరియు మురికి కాలువల నిర్మాణం చేపట్టుట, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం చేపట్టడం జరిగింది.
  13. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)
    2014-2015 నుండి 2022-2023 వరకు మహిళా సంఘాలకు 719.07 కోట్ల రూపాయల ఋణాలు ఇవ్వడం జరిగింది. స్వయం ఉపాధి కొరకు చిన్న వ్యాపారం ప్రారంభించదల్చుకున్న పట్టణ పేదలకు ఈ విభాగము ద్వారా బ్యాంకు నుండి మన జిల్లాలో 7% వడ్డీ రాయితీ తో కూడిన రుణాలు 6 కోట్ల 36 లక్షల రూపాయలు ఇప్పించండం జరిగింది.
    పట్టణ స్వయం సహాయక మహిళా కుటుంబాలకు ఆర్ధికంగా బలోపేతం చేయుటకు గాను, వారి కుటుంబ అవసరాలకు మన జిల్లాలో వడ్డీలేని ఋణాలు 2014-2015 నుండి 2022-23 వరకు మహిళా సంఘాలకు 18.32 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ అందచేయడం జరిగినది.
    పి.యం. స్వానిది పథకం ద్వారా మన జిల్లాలో 01 నగరపాలక సంస్థ 03 స్థానిక సంస్థలలో మొత్తము 32,690 మంది వీధి విక్రయదారులను గుర్తించి, వివిధ బ్యాంకుల ద్వారా ఒక్కొక్కరికి మొదటి విడత 10,000/- రూపాయల చొప్పున 24,083 మందికి ఋణాలు ఇప్పించడం జరిగింది. రెండవ విడత 15,000/- రూపాయల నుండి 20,000/- రూపాయల వరకు 9,591 మందికి వివిధ బ్యాంకుల ద్వారా ఋణాలు మరియు మూడవ విడత 50,000/- రూపాయల చొప్పున 331 మందికి ఋణాలు ఇప్పించడం జరిగింది.
    పట్టణ ప్రాంతాలలోని నిరాశ్రయులకు నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో (03) నిరాశ్రయ కేంద్రాలు స్థాపించడమైనది. స్త్రీనిధి ద్వారా మన జిల్లాలో పట్టణ మహిళా సంఘాలకు 2014 -15 నుండి 2022 – 23 వరకు 127 కోట్ల 34 లక్షల రూపాయలు మంజూరీ చేయడమైనది.
  14. తెలంగాణకు హరిత హరం
    2022-23 సంవత్సరం వరకు 14 లక్షల 11 వేల 055 మొక్కలు నాటడం జరిగింది. 2023-24 సంవత్సరంనకు 47.97 లక్షల మొక్కలు నాటుటకు లక్ష్యం నిశ్చయించబడింది. జిల్లాలో NH-44 మరియు 63 రోడ్ల వెంట అవెన్యు ప్లాంటేషన్ 104.15 కి.మీ. లక్ష్యం కాగా అందులో 104.50 కి.మీ.లందు మొక్కలను నాటడం జరిగినది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం 36 నర్సరీలను పెంచగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణకు హరిత హారంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయితీలో ఒక నర్సరీని పెంచుతూ జిల్లాలో మొత్తం 530 నర్సరీలు మరియు మునిసిపల్ కార్పొరేషన్, మూడు మునిసిపాలిటీల యందు మొత్తము 34 పట్టణ నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగినది. వివిధ దశలలో 8 విడుతల వారీగా మొత్తం 2.96 కోట్ల మొక్కలు నాటడం జరిగింది.
    అడవుల పునరుజ్జీవ కార్యాచరణ ప్రణాళిక క్రింద జిల్లాలో 105 రిజర్వు ఫారెస్ట్ బ్లాకులలో 2 లక్షల 14 వేల 56 ఎకరాలకు గాను పునరుజ్జీవ కార్యక్రమములు జరుగుచున్నవి. అటవీ ప్రాంతంలో నీటి హార్వెస్టింగ్ లకు 58,646 కాంటూరు స్ట్రెంచ్ లను పూర్తి చేయడం జరిగినది. 2,629 క్యూబిక్ మీటర్లు రాక్ ఫీల్డ్ డ్యాములు పూర్తి చేయడం జరిగినది. 766 మినీ పర్క్లేషన్ ట్యాంకులు, 155 చెక్ డ్యాములు పూర్తి చేయడం జరిగింది.
  15. మిషన్ భగీరథ
    మిషన్ భగీరథ పథకం క్రింద అన్ని గ్రామీణ ఆవాసాలకు పూర్తి స్థాయిలో గృహ కుళాయిలను ఏర్పాటు చేసి 100% శుద్ధమైన నీటి పంపిణి సాధించి రోజుకు వంద లీటర్ల తలసరి నీటిని రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కుళాయిల ద్వారా సరఫరా చేయబడుతుంది.
    మన జిల్లాలో గల 805 ఆవాసాలకు, 2 నీటి శుద్ధి కేంద్రాలు ఒకటి అర్గుల్ వద్ద 60 MLD, మరొకటి ఇందల్వాయి వద్ద 40 MLD నిర్మాణం చేపట్టి మరియు 3 పాత నీటి శుద్ధి కేంద్రాలు అర్గుల్ వద్ద 30 MLD, జలాల్ పూర్ వద్ద 30 MLD, యంచ వద్ద 10 MLD లను ఆధునీకరించి అనుసంధానం చేయటం జరిగింది. తద్వారా మంచి నీటి సరఫరాను తలసరి 40 లీటర్ల నుండి తలసరి 100 లీటర్లకు మెరుగుపరుస్తూ 582 అదనపు కొత్త నీటి ట్యాంకులను నిర్మించి 5,488 కి.మీ. పైపులైను వేసి 2,85,529 కుళాయిలకు ఇంటింటికీ నీరు సరఫరా చేయడం జరుగుతున్నది. ఇందుకు గాను 1,880.60 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది.
    ఇందులో భాగంగా పట్టణ స్థానిక సంస్థలకు పెద్ద మొత్తంలో నీటి సరఫరా జరుగుతుంది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాలలో రోజుకు తలసరి 100 లీటర్లు (LPCD), మున్సిపాలిటీలలో తలసరి 135 లీటర్లు (LPCD) మరియు మున్సిపల్ కార్పొషన్లలో తలసరి 150 లీటర్లు (LPCD) చొప్పున శుద్ధి చేయబడిన తాగునీటిని అందిస్తుంది. మొత్తం నీటిలో 10% పారిశ్రమిక అవసరాలను తీర్చడానికి కేటాయించడం జరిగింది.
  16. జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ
    i. పి .ఎం జి .ఎస్ వై., సి.ఆర్.ఆర్., రుర్బాన్ గ్రాంట్ & యం.ఆర్.ఆర్ క్రింద 593 పనులు పూర్తి అయినవి. రూ. 287.12 కోట్ల వ్యయం చేయబడినది.
    ii. సి.డి.పి., యంపిలాడ్స్ & ఎస్ .డి .ఎఫ్ క్రింద 4859 పనులు పూర్తి అయినవి. రూ. 225.33 కోట్ల వ్యయం చేయబడినది.
    iii. 2 బి హెచ్ కె. గ్రాంట్ క్రింద 3275 పనులు పుర్తి కాబడినవి. రూ.203.47 కోట్ల వ్యయం చేయబడినది.
  17. విద్యా శాఖ
    జిల్లాలో మొత్తం 1734 పాఠశాలలు కలవు. అందులో 1234 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, రాష్ట్రం 2022-23 విద్యా సంవత్సరం నుండి 1 నుండి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ & స్థానిక సంస్థల పాఠశాలల్లో బోధనా మాధ్యమంగా ఆంగ్లాన్ని ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి 9 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం బోధనా మాధ్యమం ప్రారంభం కానుంది. ఆంగ్ల మాధ్యమం లో భోదించడానికి అనుగుణంగా జిల్లాలో ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇవ్వటం జరిగింది. రాష్ట్రం 2022-23 విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ & స్థానిక సంస్థల పాఠశాలల్లోని అన్ని ప్రాథమిక గ్రేడ్‌లలో ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా నైపుణ్యాలను బలోపేతం చేయడానికి కొత్త ప్రోగ్రామ్ “తొలి మెట్టు” ప్రారంభించ బడింది.
    మన ఊరు మన బడి మన బస్తీ మన బడి
    జిల్లాలో 407 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం 2022 జనవరిలో “మనఊరు – మన బడి / మన బస్తీ – మన బడి” అనే ప్రధాన కార్యక్రమాన్ని 150.10 కోట్లతో ప్రారంభించింది. జిల్లాలోని 407 పాఠశాలలను ఎంపిక చేశారు. అందులో 341 పాఠశాలలు గ్రామీణ ప్రాంతాలకు చెందినవి కాగా 66 పాఠశాలలు పట్టణ ప్రాంతాలకు చెందినవి. ఇప్పటి వరకు 304 పాఠశాలలకు 21.44 కోట్ల నిధులు అందించారు.
  18. వైద్య మరియు ఆరోగ్య శాఖ
    ఆశ కార్యకర్తల పారితోషికము:
    జిల్లాలో ప్రస్తుతం 1,198 మంది “ఆశా కార్యకర్తలు” పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో 1,000 మందికి ఒక ఆశ కార్యకర్త చొప్పున, పట్టణ ప్రాంతంలో 1500-2,000 మందికి ఒక ఆశ కార్యకర్త చొప్పున నియమించడం జరిగింది. వీరందరు కూడా ఇంటింటికి ఆరోగ్య కార్యక్రమాలు చేరవేయడంలో వైద్య ఆరోగ్య శాఖ అనుబందంగా పని చేస్తున్నారు.
    వీరికి పనికి తగిన పారితోషిక రూపంలో 2014 సంవత్సరంలో 3,500 రూపాయలు కలదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7,500 రూపాయలు మరియు 01.06.2021 నుంచి 9,750 రూపాయలు ప్రతి నెల ఆశ కార్యకర్తకు ఇవ్వడం జరుగుతుంది.
    కంటి వెలుగు: అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా ప్రారంబించిన కంటి వెలుగు కార్యక్రమము రెండోవ విడత క్రింద 7,14,442 కంటి పరీక్షలు చేసి 86,243 రీడింగ్ అద్దాలు పంపిణి చేసి, 65,754 దూరపు చూపు అద్దాలు పంపిణి చేసి 927 మొత్తం శస్త్ర చికిత్సలు నిర్వహించబడినవి.
    కె.సి.ఆర్.కిట్: ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవమైన గర్భిణీ స్త్రీలందరికీ రూ. 2,000/- విలువ చేసే కే సిఆర్ కిట్ లను ఇప్పటివరకు 62,856 పంపిణి చేయడం జరిగింది. ఆడ శిశువు జన్మిస్తే రూ.13,000/- మగ శిశువు జన్మిస్తే రూ. 12,000/- నాలుగు విడతల్లో గర్భిణీ సమయంలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు రూ. 68 కోట్ల 20 లక్షల రూపాయలు గర్భిణీల బ్యాంకు ఖాతాలో జమచేయడం జరిగింది.
    ఆరోగ్య మహిళ : ప్రతి మంగళవారం మహిళల కోసం 8 రకాల ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు చేయబడును. జిల్లాలో ఆరోగ్య మహిళ కార్యక్రమం లో భాగంగా 5 ఆస్పత్రులను గుర్తించడం జరిగింది. ఇంత వరకు 4,246 మంది మహిళలకు పరీక్షలు చేయబడినవి.
    తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ : ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రంలో ఇప్పటి వరకు 2,12,864 రోగుల వద్ద నుండి 4,83,142 శాంపిల్స్ / నమూనాలను సేకరించి 8,87,442 రోగ నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది.
    కెసిఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం గర్భిణీ స్త్రీ లలో రక్త హీనతను తగ్గించి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడం ప్రతి కిట్ లో 1కే.జి పోషకాహార మిశ్రమం తో కూడిన పొడి, 1కే. జి ఖర్జురమ్, 3 బాటిల్స్ ఐరన్ సిరప్, 1/2 నెయ్యి, 1కప్పు ఇవ్వబడును.
    నూతన ప్రాతమిక ఆరోగ్య కేంద్రాలు: జిల్లాలో నూతనముగా 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించబడినవి అవి పీహెచ్ సి. బినోల, పీహెచ్ సి. పెగడపల్లి, పీహెచ్ సి. ముచ్కూర్, పీహెచ్ సి ఏర్గట్ల , పీహెచ్ సి గోవిందపేట్ లలో ప్రస్తుతం వైద్య ఆరోగ్య సేవలు అందించబడుచున్నవి.
    బస్తి దవాఖాన: జిల్లాకు 8 బస్తి దవాఖానలు మంజూరు కాగా 3 ప్రారంభించబడి వైద్య సేవలు అందిస్తుండగా, 1 నిర్మాణము పూర్తీ అయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. మిగితా 3 నిర్మాణం చేపట్టవలసి ఉన్నది.
    పల్లె దవాఖాన: గ్రామాల్లో 141 పల్లె దవాఖాన లు జిల్లాలో నిర్మించడం జరిగింది. ప్రతి పల్లె దవాఖానాలో MLHP’s నియామకం చేయడం జరిగింది.
    ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు: గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవాలు 35% ఉన్న వాటిని ప్రస్తుతం ప్రసవాలు 72% గా పెంచడం తో పాటు 75% పైగా పెంచడానికి కృషి చేయడం జరుగుచున్నది. వ్యాధి నిరోధక టీకాలు పూర్తి స్థాయిలో 3092 మందికి అందించి 92% శాతం గా ఉంది.
    ఆసరా పెన్షన్ : ఆసరా పెన్షన్ లో భాగంగా 2530 మంది ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకూ పెన్షన్ తో పాటు బ్యాంకు రుణాలు తీసుకోవడం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, 384 మంది ఫైలేరియా వ్యాధి గ్రస్తులకూ నెలకు రూ. 2016/- చొప్పున పెన్షన్లు ఇవ్వడం జరుగుచున్నది.
  19. మహిళా, శిశు, వికలాంగుల మరియు వయో వృద్ధుల శాఖ
    జిల్లా నందు 5 సమగ్ర శిశు అభివృద్ధి సేవ పథకముల ద్వారా 1365 మెయిన్ అంగన్ వాడి కేంద్రాలు మరియు 135 మినీ అంగన్ వాడి కేంద్రముల ద్వారా వివిధ సేవలు అందించ బడుచున్నవి. ఆరొగ్యలక్ష్మి పథకము క్రింద 14,493 మంది గర్భిణీలు మరియు 14,235 మంది బాలింతలకు ఒక నెలకు 1.81 కోట్ల రూపాయలను ప్రభుత్వము ఖర్చు చేయుచున్నది. అదేవిధముగా జిల్లాలో 58,552 మంది 7 నెలల నుండి 3 సంవత్సరముల పిల్లలకు, మరియు 40,706 మంది 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించడం జరిగుతుంది. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి గారు అంగన్ వాడి టీచర్ల గౌరవ వేతనము 4,200/- నుండి 13,650/- మినీ- అంగన్ వాడి టీచర్ల మరియు ఆయాల గౌరవ వేతనము 2,200/- నుండి 7,800/- లకు పెంచడం జరిగినది.
    జిల్లాలో దివ్యాంగుల మరియు వయో వృద్దుల అభ్యున్నతి
    ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ప్రభుత్వ/ ప్రైవేట్ సంస్థలో లేదా పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుచున్న విద్యార్థులకు రూ. 700/- చొప్పున, 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు వరకు చదువుచున్న విద్యార్థులకు రూ. 1,000/- చొప్పున, 9వ తరగతి మరియు 10వ తరగతి చదువుచున్న విద్యార్థులకు రూ. 1,820/- చొప్పున ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనములు మరియు ఫీజు రీయంబర్స్ మెంట్ మంజూరు చేయబడును.
    ఆర్ధిక పునరావాసం – స్వయం ఉపాధి నిమిత్తం సబ్సిడీ :- దివ్యాంగుల యొక్క సంవత్సర ఆదాయం ఒక లక్ష రూపాయల కంటె తక్కువ ఉన్న వారికి, వారి జీవనోపాదికై స్వయం ఉపాధి నిమిత్తం జిల్లాలో ఇంతవరకు 195 మంది దివ్యాంగులకు 1.55 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగినది.
    వివాహ ప్రోత్సాహక బహుమతి :- జిల్లాలో ఇంతవరకు 290 మంది దివ్యాంగులకు 1.75 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగినది. జిల్లాలోని దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర సహకార ఆర్థిక సంస్థ ద్వారా (1,817) మంది లబ్దిదారులకు 1.64 కోట్ల రూపాయల విలువైన వివిధ రకములైన ఉపకరణాలను పంపిణీ చేయడం జరిగినది.
  20. వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ
    జిల్లాలో 19 ప్రీమెట్రిక్ మరియు 15 పోస్ట్ మెట్రిక్ వసతి గృహములు అనగా మొత్తము 34 వసతి గృహములు నడుపబడుచున్నవి. ఇందులో మొత్తము 2,929 విద్యార్థిని విద్యార్థులకు సన్నబియ్యంతో భోజన వసతి సౌకర్యము కల్పించబడుచున్నది. ఇందుకు గాను ప్రీమెట్రిక్ వసతి గృహ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1100/-ల చొప్పున మరియు పోస్ట్ మెట్రిక్ వసతి గృహ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1500/-ల చొప్పున సంవత్సరానికి మొత్తము రూ.8 కోట్ల 19 లక్షలు ఖర్చు చేయబడుచున్నది. జిల్లాలో 2014-15 నుండి 2022-23 వరకు 2,46,782 మంది విద్యార్థులకు మొత్తము రూ.120 కోట్ల 40 లక్షలు స్కాలర్ షిప్ లతో పాటు ఫీజు రియింబర్స్ మెంట్ క్రింద రూ.183 కోట్ల 33 లక్షలు మంజూరు చేయుట జరిగినది.
    మహాత్మా జ్యోతిభాపూలే విదేశి విధ్యానిధి పథకముః- విదేశాలలో ఉన్నత విద్యభ్యాసము చేయు నిమిత్తము ఎంపికైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20.00 లక్షల చొప్పున ఆర్థిక సహాయము అందజేయబడుచున్నది. ఇంత వరకు 88 మంది విద్యార్థులకు రూ.15 కోట్ల 48 లక్షలు మంజూరు చేయుట జరిగినది.
    వెనుకబడిన తరగతుల వారికి స్వయం ఉపాధి కొరకు సబ్సిడి ఋణాలుః-
    మార్జీన్ మని పథకము ద్వారా 1488 మంది లబ్దిదారులకు రూ.8.49 కోట్ల సబ్సిడి మంజూరు చేయడం జరిగినది. 2014 నుండి ఇప్పటి వరకు సావిత్రిబాయి పూలే పథకము ద్వారా 414 మంది లబ్దిదారులకు రూ.2.76 కోట్ల సబ్సిడి మంజూరు చేయడం జరిగినది. 2016 సంవత్సరము నుండి ప్రారంభించబడిన అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ది పథకము (MBC) క్రింద 114 మంది లబ్దిదారులకు రూ.57.00 లక్షలు సబ్సిడి మంజూరు చేయడం జరిగినది.
    వెనుకబడిన తరగతుల (11) కులవృత్తుల వారికి స్వయం ఉపాధి కొరకు సబ్సిడి ఋణాలుః- ప్రస్తుతము 2014 నుండి ఇప్పటి వరకు 11 ఫెడరేషన్ల పథకములో వృత్తి పనివారికి 926 మంది లబ్దిదారులకు రూ.4.47 కోట్ల సబ్సిడి మంజూరు చేయడం జరిగినది.
  21. షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ
    షెడ్యూల్డు కులాలకు చెందిన పేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల స్థలాల పంపిణీ కోసం చర్యలు చేపట్టుతున్నది. జిల్లాలో 12 మండలాల పరిధిలో 27 గ్రామాల యందు 53.06 ఎకరాలలో 1604 లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయబడును.
    వసతి గృహాలు : 2022-2023 సంవత్సరములో జిల్లాలోని (32) సాంఘీక సంక్షేమ శాఖ వసతి గృహములలో (2249) మంది విద్యార్థిని విద్యార్థులకు వసతి గృహములలో ప్రవేశము కల్పించనైనది. 2016 నుండి హాస్టల్స్ లోని విద్యార్థులకు సన్న బియ్యము సరఫరా చేయడము జరుగుతున్నది.
    2019-2020 సంవత్సరము నుండి ప్రభుత్వ యస్సీ కళాశాలలో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు ప్యాకెట్ మనీ రూ. 500/- చొప్పున నెలకు మంజూరు చేయడము జరిగినది. 2019-20 సం. నుండి 1,500 విద్యార్థులకు 2022-23 వరకు రూ. 73.37 లక్షలు ఖర్చు చేయడము జరిగినది.
    మెట్రిక్ పూర్వపు ఉపకారవేతనములు : ( న్యూ స్కీము) : 5 వ తరగతి నుండి 8 వ తరగతి వరకు ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో చదువుచున్న యస్.సి. విద్యార్థులకు ఉపకార వేతనము కొరకు 2014-15 నుండి 2022-23 వరకు రూ.1.64 కోట్లు 13,122 విద్యార్థులకు ఖర్చు చేయనైనది. ఈ స్కీము క్రింద అబ్బాయిలకు 1,000/- రూపాయలు మరియు అమ్మాయిలకు 1,500/- రూపాయలు మంజూరు చేయడమైనది.
    మెట్రిక్ పూర్వపు ఉపకార వేతనములు : ( రాజీవ్ విద్యా దీవెన) :- 9 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో చదువుచున్న విద్యార్థులకు 2022లో ఈ పథకం క్రింద రూ.3000/- లకు పెంచడం జరిగింది. 2014-15 నుండి 2022-23. వరకు రూ. 1.71 కోట్లు 6,660 విద్యార్థులకు ఖర్చు చేయనైనది.
    అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి :- 2017-2023 సంవత్సరము లో అంబేడ్కర్ ఒవెర్సీస్ విద్యానిధి పథకము క్రింద రూ.20 లక్షలు విదేశాలలో పి.జి. కోర్సు చదువుచున్న 50 మంది యస్.సి. విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనములు మరియు ఫీజులకు గాను రూ. 2.45 కోట్లు ఖర్చు చేయడము జరిగింది.
    బెస్టు అవైలేబుల్ స్కూల్స్ : 2014-15 లో 5 పాఠశాలలకు గాను 546 మంది యస్.సి. విద్యార్థిని విద్యార్థులకు రూ. 1.54 కోట్లు ఖర్చు చేయనైనది. 2022-23 సంవత్సరములో 10 పాఠశాలలో చదువుచున్న 925 మంది యస్.సి. విద్యార్థిని విద్యార్థులకు రూ.2.94 కోట్లు ఖర్చు చేయనైనది. 2022-23 సం. లో డేస్కాలర్ కి 15,000/- నుండి 27,000/- లకు పెంచడము జరిగినది. 2022-23 సం.లో రెసిడెన్సీయల్ కి 30,000/- నుండి 40,000/- రూపాయలకు పెంచడము జరిగినది.
    కులాంతర వివాహములు :- 2021-2022 నుండి 2022-2023 వరకు 71 జంటలకు 2.50 లక్షల చొప్పున మొత్తం 1.78 కోట్లు కులాంతర వివాహ ఆర్థిక ప్రోత్సాహకము మంజూరు చేయడము జరిగినది.
    0.50 మరియు 0-101 యూనిట్లు వాడుచున్న యస్.సి. కుటుంబాలకు ఉచిత విద్యుత్ సరఫరా : 2019-2020 నుండి 2022-2023 సం. లో 26,819 కుటుంబాలకు 0.101 యూనిట్ల కు పెంచడము జరిగినది. అందుకు గాను 2022-2023 సం. లో ఉచిత విద్యుత్ సరఫరా క్రింద రూ.4.12 కోట్లు ఖర్చు చేయడము జరిగినది.
    స్టడీ సర్కిల్ :- 2016-17 సం.లో జిల్లాలో స్టడీ సర్కిల్ ప్రారంభించబడిన నుండి ఇప్పటి వరకు 8 బ్యాచులకు గాను శిక్షణ పొందినారు. అందులో నుండి 102 మంది విద్యార్థులకు వివిధ కేటగిరీలలో ఉద్యోగములు పొందినారు. 2022-2023 సం.నకు గాను 2 బ్యాచులకు శిక్షణ ఇవ్వడము జరిగినది.
  22. జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ది సంస్థ
    భూమి కొనుగోలు పథకము : తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూమి లేని షెడ్యూల్డ్ కులాల వ్యవసాయ నిరుపేద మహిళలకు భూమి కొనుగోలు పథకము క్రింద 2014-15 నుండి 2017-18 వరకు 168 మంది లబ్దిదారులకు 399.26 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేయడము జరిగింది. ఇందుకు గాను 18.78 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమైనది.
    స్వయం ఉపాధి పథకము : స్వయం ఉపాధి పథకము క్రింద యూనిట్ విలువ 1.00 లక్ష రూపాయల నుండి 12.00 లక్షల రూపాయల వరకు మంజూరు చేయబడును. ఈ పథకము క్రింద 2014-15 నుండి ఇప్పటి వరకు 3,201 మంది లబ్దిదారులకు 36.55 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమైనది.
    దళిత బంధు పథకము : రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కుటుంబాల ఆర్థిక సాధికారత మరియు సామాజిక అభ్యున్నతి కోసం వినూత్నమైన దళిత బంధు పథకం ప్రారంబించబడినది. ఇట్టి దళిత బంధు పథకంలో కుటుంబానికి 10.00 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఇట్టి 10.00 లక్షల రూపాయలు ధన రూపేణా కాకుండా లబ్దిదారులు అనుభవం మరియు నైపుణ్యం ఉన్న యూనిట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
    దళిత బంధు పథకం క్రింద 2021-22 సంవత్సరమునకు గాను 550 మంది లబ్దిదారులకు గాను 55.00 కోట్ల రూపాయల ఖర్చు చేయడమైనది.
    నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు : షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ కార్యక్రమములో భాగముగా వివిధ శిక్షణ సంస్థల ద్వారా 2014-15 నుండి ఇప్పటి వరకు 666 మంది మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను 1.14 కోట్ల రూపాయలు ఖర్చు చేయనైనది. వీరికి శిక్షణ అనంతరము ఒక్కో కుట్టు మిషన్ ఉచితముగా సరఫరా చేయడము జరిగినది.
  23. జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ
    గిరిజన గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహణ : 2014 సంవత్సరము వరకు జిల్లాలో గిరిజన గురుకుల విద్యాలయము 1 కలదు, 2022 సంవత్సరములో జిల్లాలో 4 గిరిజన గురుకులాలు ఏర్పాటు చేయడమైనది. గిరిజన వసతి గృహాల విద్యార్థిని విద్యార్థులకు మేస్ చార్జీలు నెలకు రూ.700/-నుండి రూ.1,100/- లకు పెంచడం జరిగింది. గిరిజన కళాశాల వసతి గృహాల విద్యార్థిని విద్యార్థులకు మెస్ చార్జీలు నెలకు రూ. 1,200/- ను రూ.1,500/- కు పెంచడం జరిగింది.
    గిరిజన రిజర్వేషన్ల పెంపుదల : – రాష్ట్ర పునర్వవస్థీకరణ తర్వాత షెడ్యూల్ తేగల రిజర్వేషన్ 6% నుండి 10% పెంచడము జరిగినది.
    మొదటి దశ మరియు మూడవ దశ విద్యుత్ (Single & 3 phase) పథకము :, ఈ పథకము క్రింద (785) గిరిజన తండాలకు మొదటి దశ మరియు మూడవ దశ విద్యుత్ (Single & 3 phase) కనెక్షన్లు మంజూరు చేయడమైనది.
  24. అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మైనారిటీ విధ్యార్థిని విధ్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనములు విడుదల చేయుచున్నది. ఈ పథకము క్రింద 2014-15 నుండి 2022-23 వరకు 63,491 మంది విధ్యార్థులకు గాను రూ.82.70 కోట్లు ఖర్చు చేయనైనది.
    చర్చీలు మరియు వాటి ప్రహరీ గోడల నిర్మాణము: జిల్లాలో మైనారిటీ సంక్షేమశాఖ ద్వారా 55 చర్చిల మరియు వాటి ప్రహరి గోడల నిర్మాణము పనులకు గాను రూ.3.51 కోట్లు ఖర్చు చేయనైనవి.
    ఉర్దూ ఘర్ – కం – షాదీఖానాల నిర్మాణములు : జిల్లాలో మైనారిటీ సంక్షేమశాఖ ద్వారా 53 ఉర్దూ ఘర్ – కం – షాదీఖానాలు నిర్మాణ పనులకు గాను రూ. 2.87 కోట్లు ఖర్చు చేయడమైనది.
    తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు : జిల్లాలో 2 మైనారిటీ పాఠశాలలు, 2 కళాశాలలు, 15 పాఠశాలలు మరియు కళాశాలలు నడుచుచున్నవి. వీటిలో 12 పాఠశాలలను కళాశాల స్థాయి కి (Upgrade) పెంచినారు మరియు ప్రతి విద్యార్థికి రూ. 1.20 లక్షల వరకు ప్రభుత్వము ఖర్చు పెడుతున్నది.
    డ్రైవర్ ఎంపవర్మెంట్ కార్యక్రమం:- క్రిస్టియన్ మరియు మైనారిటీ యువతకు డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకము క్రింద 2018-19 సం. నుండి 2021-22 సం. వరకు 28 మంది లబ్దిదారులకు రూ. 1.27 కోట్లు ఖర్చు చేయడమైనది.
    క్రిస్మస్ ప౦డుగ వేడుకలు :ప్రతి సం. క్రిస్మస్ ప౦డుగ వేడుకలకు గాను నిజామాబాద్ జిల్లాలోని ప్రతి శాసనసభా నియోజకవర్గమునకు 1000 మందికీ దుస్తులు చొప్పున 5 నియోజకవర్గములకు ఇప్పటివరకు మొత్తము 40,000 మందికి దుస్తులు పంపిణీ చేయడం జరిగినది మరియు ప్రతి శాసనసభా నియోజకవర్గములో రూ.2.00 లక్షల చొప్పున 05 శాసనసభా నియోజకవర్గములకు గాను ఇప్పటివరకు మొత్తము రూ. 78.00 లక్షలు క్రిస్మస్ విందు జరుపుటకు గాను మంజూరు చేయడము జరిగినది.
    ర౦జాను ప౦డుగ వేడుకలు :ప్రతి సం. రంజాన్ ప౦డుగ వేడుకలు జరుపుకోవడానికి నిజామాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గము లలో 1,30,500 మందికి దుస్తులు పంపిణీ చేయడం జరిగినది మరియు ఇఫ్తార్ / విందు నిర్వహించుటకు గాను ఇప్పటివరకు రూ: 2.32 కోట్లు జిల్లాలోని 05 అసెంబ్లీ నియోజకవర్గాలలో గల మసీదులకు విడుదల చేయడం జరిగిoది.
  25. కళ్యాణ లక్ష్మి / షాదిముబారక్
    పేదవారికి ఆడపిల్ల పెళ్ళి భారం కాకూడదని ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి – షాదిముబారక్. ఈ పథకం క్రింద 1,00,116 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది.
    మన జిల్లాలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరములో 1,694 మంది లబ్ధిదారులకు సుమారు 16 కోట్ల 95 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ పథకం ప్రారంభం అయినప్పటినుండి ఇప్పటి వరకు జిల్లాలో 48,509 మంది లబ్దిదారులకు 485 కోట్ల 65 లక్షల రూపాయలు పంపిణి చేయడం జరిగింది.
    షాదీ ముబారక్ పథకం ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరములో 1827 మంది లబ్ధిదారులకు సుమారు 18 కోట్ల 29 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ పథకం ప్రారంభం అయినప్పటినుండి ఇప్పటి వరకు జిల్లాలో 21,103 మంది లబ్దిదారులకు 211 కోట్ల 27 లక్షల రూపాయలు పంపిణి చేయడం జరిగింది.
  26. జిల్లా పరిశ్రమల శాఖ
    TS-iPASS (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ ఆమోదం మరియు స్వీయ-ధృవీకరణ వ్యవస్థ):నిజామాబాద్ జిల్లాలో ప్రతిపాదిత పెట్టుబడితో 775 యూనిట్లకు 801.27 కోట్లు రూపాయలతో అనుమతులు జారీ చేయబడ్డాయి మరియు 12,854 వ్యక్తుల ఉపాధి కల్పించడం జరిగింది.,
    T-IDEA(తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ అడ్వాన్స్‌మెంట్: నిజామాబాద్ జిల్లాలో 310 ప్రతిపాదనలకు 22.03 కోట్ల రూపాయలతో ప్రోత్సాహకాలు మంజూరు చేయబడ్డాయి.
    T-PRIDE (తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంట్రప్రెన్యూర్స్) పథకం క్రింద దళిత పారిశ్రామికవేత్తల సమ్మిళిత అభివృద్ధి కోసం ఒక పథకం, SC/ST పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఉన్నాయి. 02-06-2014 నుండి 31-03-2023 వరకు నిజామాబాద్ జిల్లాలో, ఎస్సీ పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించిన 1041 యూనిట్లకు రు.50.22 కోట్ల రూపాయలతో ప్రోత్సాహకాలు మంజూరు చేయబడ్డాయి; ST పారిశ్రామికవేత్తల ద్వారా ప్రోత్సహించబడిన 1190 యూనిట్లకు రు. 7.61 కోట్ల రూపాయలతో ప్రోత్సాహకాలు మంజూరు చేయబడ్డాయి, PHC పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించిన 19 యూనిట్లకు 1.06 కోట్ల రూపాయలతో ప్రోత్సాహకాలు మంజూరు చేయబడ్డాయి.
  27. కార్మిక శాఖ:
    తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డ్ క్రింద నమోదు చేసుకున్న ఇప్పటివరకు జిల్లాలో వివిధ పథకాల నుండి 3,876 మంది కార్మికులకు 14.87 కోట్ల రూపాయలు పరిహారం అందించడం జరిగింది. వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో నమోదు చేసుకున్న 4,838 కార్మికులకు జాతీయ నిర్మాణ సంస్థ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు 1.74 కోట్ల స్టైఫండ్ రూపంలో ఈ పథకం క్రింద ఇవ్వడమైనది.
  28. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ:
    చీఫ్ మినిస్టర్ కప్ – 2023 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో చీఫ్ మినిస్టర్ కప్ – 2023 ను తేది: 15 నుండి 31 మే,2023 వరకు మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి లలో వివిధ క్రీడాంశాలలో పోటీలు నిర్వహించడం జరిగినది. మండల స్థాయిలో పోటిలలో మొత్తం 7851 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి పోటీలు తేది22 నుండి 24 మే, 2023 వరకు గాను 11 క్రీడాంశాములలో పోటీలు నిర్వహించడం జరిగినది. ఇట్టి పోటిలలో పురుషులు 1,262, మహిళలు 506 మొత్తం 1768 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
  29. పోలీస్ శాఖ
    2014 సంవత్సరం తర్వాత 127 వాహనాలు నూతనంగా ఇవ్వబడినవి. కొత్తగా 278 ద్విచక్ర వాహనాలు ఇవ్వబడినవి. పోలీస్ స్టేషన్ లలో కనీస అవసరాలు తీర్చడం కోరకు ప్రతి గ్రామీణ పోలీస్ స్టేషన్ కు 25,000/- పట్టణ పోలీస్ స్టేషన్ కు 50,000/- మెట్రో పోలీస్ స్టేషన్ కు 75,000/- ప్రతినెల ఇవ్వడం జరుగుతుంది. ట్రాఫిక్ లో విధులు నిర్వయిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి 30% అదనపు అలవెన్స్ ను కూడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది. జిల్లాలలో వివిధ అదనపు విభాగాలుగా SHE Team, Tech Team, Command Control Center, వంటి ఇతర విభాగాలను కూడా నూతనంగా ఏర్పచినారు. ప్రజల సౌకర్యార్ధం నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్లు ముగుపాల్, టౌన్ 6, ఇందల్వాయి, ముప్కాల్, మెండోరా, ఏర్లట్ల, బోధన్ రూరల్, రుద్రూర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్ కమీషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలలో షీ టీమ్స్ ప్రారంభించడం జరిగింది. వీటితో పాటు ట్రాఫిక్ సిబ్బందికి డిజిటల్ కెమెరాలు, ట్యాబ్స్, బాడీవార్మ్ కెమెరాలు, వంటి అదునాతన ఎలక్టానిక్ సదుపాయలను సమకూర్చడం జరిగింది. ప్రజలకు ట్రాఫిక్ సౌకర్యార్థం ట్రాఫిక్ కోన్స్, రోప్స్, రిఫ్లెక్షన్ జాకేట్లు, రెయిన్ కోర్టు, ఎల్.ఈ.డి బటన్స్, షోల్డర్ బటాన్స్ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది.
    జిల్లా యందు “నేను సైతం” అని సరికొత్త ప్రోగ్రాం ప్రారంభించి ప్రతి గ్రామంలో, ప్రతి వ్యాపార సముదాయల నందు 4,434 సి.సి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో 160 సి.సి కెమెరాలతో పటిష్టపరిచి, హెచ్.డి క్లారిటీ కలిగిన కెమెరాలు శాంతి భద్రతల కాపాడటంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు గ్రామల్లో ఉన్న సి.సి కెమెరాలతో కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయడం జరుగుతుంది.
    రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తున్న శ్రీయుత గౌరవ నీయులైన ముఖ్యమంత్రి శ్రీ కల్వ కుంట్ల చంద్ర శేఖర్ రావు గారికి, జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం, సూచనలు అందిస్తున్న గౌరవ ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్ సిబ్బందికి, న్యాయాధికారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, స్వచ్చంద సంస్థలకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున… హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

జై తెలంగాణ… జైహింద్…!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X