Hyderabad : Centre for Staff Training and development (CSTD) of Dr. B. R. Ambedkar Open University (BRAOU), inaugurated one week training program on “Office Administration for Junior Assistants” at its campus on Monday.
Prof Ghanta Chakrapani, Vice-Chancellor, BRAOU attended as Chief Guest for the program and he said that the staff working in the public sector should improve their skills in accordance with the modern knowledge coming in their respective fields from time to time. He wished the newly appointed Junior Assistants by TGPSC.

Prof. G. Pushpa Chakrapani, Director Academic and Dr. L. Vijaya Krishna Reddy, Registrar attended as guests of honour for the program and spoke on the occasion. Dr. P. Venkata Ramana, Officer Incharge, Centre for Staff Training & Development (CSTD) preside over the program, He said that in the coming days, under the CSTD, training classes will be organized for all Non-teaching and technical staff members of the University to run in a smooth manner.
Also Read-
ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలి : ప్రొ. ఘంటా చక్రపాణి
అంబేద్కర్ వర్సిటీలో కొత్తగా నియామకమైన ఉద్యోగులకు శిక్షణ ప్రారంభం
హైదరాబాద్ : తాము పని చేసే సంస్థ పట్ల ఉద్యోగులు నిబద్దతగా ఉండాలని, చేసే పనిలో పారదర్శకత అవసరమని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ (సి.ఎస్.టి.డీ) ఆధ్వర్యంలో ఇటీవల టీజీఎస్పీ ద్వారా నియమితులైన జూనియర్ అసిస్టెంట్ సిబ్బందికి వారం రోజుల పాటు జరగనున్న “ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ జూనియర్ అసిస్టెంట్స్” శిక్షణా కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
అయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో పనిచేసే సిబ్బంది ఎప్పటికప్పుడు ఆయా రంగాల్లో వస్తున్న ఆధునిక పరిజ్ఞానానికి అందిపుచ్చుకోవాలని, మార్కెట్ కు అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు సేవా తత్పరత చాలా అవసరమని సూచించారు.
కార్యక్రమంలో గౌరవ అతిథిగాలుగా విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. యల్. విజయ కృష్ణా రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి సి.ఎస్.టి.డి ఆఫీసర్ ఇంచార్జ్ డా. పరాంకుశం వెంకటరమణ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో సీ.ఎస్.టి.డి ఆధ్వర్యంలో అధ్యాపకేతర సిబ్భందికి, టెక్నికల్ ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.