हैदराबाद: मेट्रो रेल ने खुशखबरी दी है। गणेश विसर्जन के मौके पर मेट्रो रेल अधिकारियों ने कहा कि मेट्रो ट्रेनें गुरुवार आधी रात तक चलेंगी। अधिकारियों ने बताया कि श्रद्धालुओं की सुविधा के लिए ट्रेनें आधी रात तक चलेंगी और रात दो बजे तक ट्रेनें अपने अंतिम गंतव्य तक पहुंच जाएंगी।
बताया गया है कि खैरताबाद और लकडीकापूल मेट्रो स्टेशनों पर अतिरिक्त पुलिस और निजी सुरक्षाकर्मी तैनात किए गए हैं। मांग के मुताबिक कुछ मेट्रो स्टेशनों पर अतिरिक्त टिकट काउंटर और अतिरिक्त ट्रेनें चलाई जाएंगी। बताया गया कि 29 तारीख को सुबह 6 बजे मेट्रो का संचालन सामान्य रूप से जारी रहेगा। अधिकारियों ने लोगों से मेट्रो सेवाओं का लाभ उठाने की अपील की है।
గురువారం అర్ధరాత్రి వరకు మెట్రో రైలు సేవలు, సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి
హైదరాబాద: మెట్రో శుభవార్త చెప్పింది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా గురువారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపించనున్నట్లు మెట్రో రైల్ అధికారులు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అర్ధరాత్రి ఒంటి గంట వరకు రైళ్లను నడుపనున్నట్లు పేర్కొన్న అధికారులు రాత్రి 2 గంటల వరకు ఆయా రైళ్లు చివరి గమ్యస్థానానికి చేరుకుంటాయని అధికారులు తెలిపారు.
ఖైరతాబాద్, లక్డీకపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని మోహరించినట్లు పేర్కొన్నారు. డిమాండ్‌ను బట్టి కొన్ని మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, అదనంగా రైళ్లు నడపనున్నట్లు వివరించారు. మళ్లీ 29న ఉదయం 6 గంటలకు యథాతథంగా మెట్రో కార్యకలాపాలు కొనసాగుతాయని వివరించారు. మెట్రో సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. (ఏజెన్సీలు)