ఎన్నటికైనా కేసిఆర్ నాయకత్వమే రాష్ట్రానికి, దేశానికి శ్రీరామ రక్ష: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

టీఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ది

కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలు సంబురంగా ఉన్నరు

యువ మంత్రి కెటిఆర్ నూతన సంస్కరణలు యావత్ దేశానికి ఆదర్శం

అన్ని రంగాల్లో నేడు తెలంగాణ దేశానికే రోల్ మోడల్

హైదరాబాద్: కేసీఆర్ గారి జనరంజక పాలన, రాష్ట్రం లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి నిజామాబాదు జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన బిజెపి పార్టీ మండల సెక్రటరీ గడ్డం మోహన్ రెడ్డి తదితరులు శనివారం హైదరాబాద్ లో రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… కేసిఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ది సాకారమవుతోందన్నారు. కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలు సంబురంగా ఉన్నరని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్ కుల వృత్తులకు ప్రోత్సాహం, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలతో ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు దేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన మంత్రి, పార్టీ వర్కిగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నాయకత్వంలో ఐటి, పరిశ్రమలు,మున్సిపాలిటీలు సరికొత్త సంస్కరణలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.

నేడు అన్ని రంగాల్లో తెలంగాణ యావత్ దేశానికే రోల్ మోడల్ అని తెలిపారు. కేసిఆర్ నాయకత్వం కావాలని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎన్నటికైనా కేసిఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి, దేశానికి శ్రీరామ రక్ష అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పూర్ణానందం, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజిరెడ్డి, బోనగిరి రమేష్, ఏనుగు నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X