ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు

హైదరాబాద్ : కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల కమిటీ చైర్మన్ మరియు (తెలంగాణ పద్మశాలి కో- ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్) గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ నేతృత్వంలో రవీంద్రభారతి వేదికగా ఈ సమావేశం నిర్వహించారు

ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వివేక్ వెంకటస్వామి, మరియు ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ దూడెం వెంకటరమణ, హ్యాండ్లూమ్ వైస్ చైర్మన్ జక్కని అనిత, కార్పొరేషన్ ఈరవర్తి, అనిల్ కుమార్,మెట్టు సాయి కుమార్, బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజి ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంజ రేణుక నారాయణ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.

ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ.
పదవులు, రాజకీయ భవిష్యత్తు కంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యత ఇచ్చిన త్యాగశీలి బాపూజీ. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయన పోరాటం, త్యాగం, ప్రజాసేవకు ప్రత్యేక స్థానం ఉంది. సామాజిక అసమానతలు, వెట్టిచాకిరీ వంటి దోపిడీకి వ్యతిరేకంగా కూడా ఆయన పోరాటం సాగించారు. తెలంగాణ రాష్ట్రం కోసం తన పదవిని సైతం త్యాగం చేసిన నాయకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో నిలిచిపోయారు.

ఇది కూడ చదవండి-

ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తి తెలంగాణ ఉద్యమ సమయంలో మేము ఎంపీగా ఉన్నప్పుడు మాకు ఆదర్శంగా నిలిచాయి
చేనేత కార్మికులు, నేతన్నల అభివృద్ధి, సంక్షేమం కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.బలహీన వర్గాలు ఐక్యంగా ఉండాలి వచ్చే ఎన్నికల్లో 5 పద్మశాలి ఎమ్మెల్యేలు గెలవాలి. నిన్న యాదవ , ముదిరాజ్ సమావేశాలు జరిగాయి.

ఈరోజు పద్మశాలి సమావేశం .. మారుతున్న కాలానికి అనుగుణంగా మన కుల వృత్తులు మారాలి. తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేసింది బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయ డానికి చట్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం దానిని ఆపింది 50 శాతం రిజర్వేషన్లు పరిమితి దాటాలంటే దేశ వ్యాప్తంగా ప్రామాణిక డేటా ఉండాలని కోర్టు చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం జన గణన లో కుల గణన చేస్తామని ఏప్రిల్ 1 2025 లో తెలిపింది. కానీ జన గణన లో కాలం 10 లో ఎస్సీ ఎస్టీ ల గురించి అడిగారు కానీ బీసీ ప గురించి అడగలేదు. దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar