“తెలంగాణలో రోడ్డుకు ట్రంప్ పేరా? తెలంగాణ ప్రజలను అవమానించేలా రేవంత్ చర్యలు”

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఓ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ అని పేరు పెట్టటం…తెలంగాణ ప్రజలను అవమానించటమేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఒక్క మహనీయుని పేరు రేవంత్ రెడ్డికి గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణకు ట్రంప్ ఏం చేశాడని ఆయన పేరు పెడుతున్నారో చెప్పాలంటూ కవిత “ఎక్స్” లో ట్వీట్ చేశారు.

ట్రంప్ విధానాల కారణంగా అమెరికాలో మన తెలంగాణ పిల్లలు ఇబ్బందులు పడుతుంటే ఆయన పేరు ఇక్కడి రోడ్లకు పెడతారా అంటూ విమర్శించారు. రేవంత్ చర్య సొంత ప్రజలను అవమానించేలా ఉందన్నారు. కేవలం రేవంత్ రెడ్డికి ఆయన కుటుంబానికి అమెరికా వీసాలు సులభంగా క్లియర్ అవటానికి తప్ప ఈ నిర్ణయం దేనికి పనికిరాదని విమర్శించారు.

Also Read-

రేవంత్ రెడ్డి కేవలం ఇంటర్నేషనల్ మీడియాలో తన పేరు రావాలన్న ఉద్దేశంతో చేసిన చిల్లర పని ఇదంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చీప్ టాక్టిక్స్ తో పెట్టుబడులు రావన్నారు. ఇక్కడ ఉండే మౌలిక వసతులు, మ్యాన్ పవర్, టాలెంట్ ను చూసి మాత్రమే అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెడతాయని కవిత చెప్పారు. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X