Joining The BRS From The Maharashtra And Madhya Pradesh States In Continuing

HJyderabad: Joining the BRS from the Maharashtra State and Madhya Pradesh State is continuing. Attracted by the BRS national President and Telangana Chief Minister Sri K Chandrashekhar Rao’s vision and development agenda, noted leaders and people from different walks of life came forward and joined the Bharat Rasthra Samithi party. Former MLAs and BJP , leaders from Shiv Sena and noted personalities from different social organizations met CM KCR at Pragati Bhavan today ( Wednesday) and expressed their readiness to work hard for BRS in Maharashtra. The BRS Supremo welcomed the leaders into the party by offering them Pink scarves.

CM KCR explained the leaders BRS political and development agenda. The BRS Chief said that India will lead the world if the available natural resources in the country are utilized optimally. Drinking water, electricity and irrigation facilities are the top agenda of the BRS. The successive union governments failed to utilise the resources and address the long pending problems of drinking water crisis, irrigation and supply of electricity to all. Telangana state succeeded in utilizing the natural resources and overcame drinking water and power crisis permanently, CM KCR said.

Leaders joined BRS are – Venkat Raoji Ghopade, Aalhat Ashok(Founder / National President Janhit Lokshahi Party, Mumbai), Ramrao Maharaj Bhategaonkar (National Banjara Bhatke Vimukta Sangharsh Samiti, Nanded), Ramesh Kadam (Kinwat Vidhan Sabha campaigner and broadcaster), Gautham Jain (Pradesh Sahachiv Rashtriya Samaj Party, Basmat), Patil Rajkumar (Vice President BJP Kisan Morcha),Ghodke Vitthal (Marathwada President Bahujan Samaj Party), Shaik Mohinouddin ( Muslim Samaj Sanghtak President Marathwada Pradesh),Shinde Madhav( President Bahujan Charmkar Sangh), Kalyamkar Abasaheb (Principal Ardhapur), Wankhede Patil (Maratha Morcha Aurangabad Division President), Karlekar Maharaj (Karela Saibaba Bhakta,Deglur), Riyaz (Social Worker).

Bhagirath Bhalke( MLA Contested, Pandrapur), Dode Madam (MLA daughter, Devorali, Nashik), Haridas Badde (Ex-MLA Akola), Madhavrao Totake (ZP Member, Washim), Govindarao Bhanvar ( Hingoli), Jidendra Jain ( Buldhana), Solanke Guruji (Ex-MLA, Warora), JayMangal Dhanraj (Advocate, Mumbai). Pravin Patil Daghe (Bolsa, Nationalist Youth Tq President), Datta Patil Daghe (Eijatjnav, Nationalist District Samparatheem), Santhosh Gute Karmala ( MCL Saunstha Umri President), Hemanth Malhare (Hirdgaon, BJP Circle Head), Kishan Kadam (Mandala, Shiva Sena Yuva President Umari). Nagesh Patil Chavan (Bolsa Bu, BJP Booth Head), Vittal Tope (Bolsa Dhanora Bu, Rashtrawadi Branch Head), Devidas Shinde Waghala ( Booth Chief), Yogesh Dhage (Eijalgaon, BJP Sarchitnis), Shreedhar Hanbarade (Bejegoan, AB Chhava Youth President Umri), Rajesh More (Umri, Chava Organization Region).

మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన వందలాది మంది నేతలు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు

‘అందని చాంద్ సితారాలను ఎట్లాగూ అందివ్వలేరు… కనీసం అందుబాటులో వున్న నీరు విద్యుత్తు నైనా దేశ రైతాంగం కోసం ఎందుకు అందించలేకపోతున్నా’రని.. 75 ఏండ్లుగా దేశాన్నేలుతున్న కేంద్ర పాలకులను బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎద్దేవా చేశారు. కేంద్ర పాలకులను ఈ దిశగా నిలదీసే దిశగా ప్రతీ దేశ పౌరుడు జాగృతం కావాల్సిన అవసరమున్నదని పునరుద్ఘాటించారు. బుధవారం నాడు మధ్యప్రదేశ్ కు మహారాష్ట్రకు చెందిన వందలాది మంది నేతలు కార్యకర్తలు అధినేత సిఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వొక వైపు మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతుండగా… మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి చేరికలు ఊపందుకున్నాయి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అధినేత సిఎం కేసీఆర్ మాట్లాడుతూ….75 ఏండ్ల స్వాతంత్ర్య భారత దేశంలో రైతులు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు సాగునీరు విద్యుత్తు నేటికీ అందట్లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని పాలకుల నిర్లక్ష్యధోరణులు ఇంకా కొనసాగకుండా దేశ ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ప్రతి వొక్కరిమీద వున్నదని సిఎం పునరుద్ఘాటించారు. తెలంగాణ లో అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నపుడు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎందుకు కావని ప్రశ్నించారు. కేంద్రాన్నేలుతున్న పాలకులకు చిత్తశుద్దిలోపం వల్లనే ప్రజలకు నష్టం జరుగుతున్నదన్నారు. ‘‘మనమేమన్నా వాల్లను చంద్రున్ని సుక్కలు తెచ్చి ఇమ్మంటున్నమా…? మన జీవితానికి అత్యవసరమైన మనకు ప్రకృతి అందుబాటులో వుంచిన, తాగునీటిని సాగు నీటిని విద్యుత్ ను మాత్రమే ఇవ్వమని అడుగుతున్నం. ‘‘చాంద్ సితారో చోడో….పానీ బిజిలీ జోడో’’ (చాంద్ సితార లను వదిలేయండి మాకు నీల్లు విద్యుత్తును అందించండి) అని కేంద్ర ప్రభుత్వాలకు సిఎం కేసీఆర్ చురకలంటించారు.

బిఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర సర్పంచులు

మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే వున్నాయి. మహారాష్ట్రకు చెందిన పలు గ్రామాలకు చెందిన యాభైమంది సర్పంచులు బుధవారం నాడు బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారు పార్టీలో చేరడానికి ముందు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. వ్యవసాయం తాగునీరు సాగునీరు విద్యుత్ రోడ్లు సహా పలు రంగాల్లో రాష్ట్రంలోజరుగుతున్న అభివృద్ధిని వారి పరిశీలించారు. ఆసరా ఫించన్లు, రైతుబంధు దళితబంధు సహా రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. తమ తమ గ్రామాల్లో కూడా తెలంగాణ మోడల్ పాలన అమలు కావాలనే ధృఢమైన ఆంకాంక్షతో వారు బిఆర్ఎస్ లో చేరుతున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో మహారాష్ట్రకు చెందిన పలువురున్నారు. వారిలో…
వెంకట్ రావుజీ ఘోపడే, అల్హత్ అశోక్, రాంరావ్ మహారాజ్ భటేగావ్కర్,రమేష్ కదమ్, గౌతం జైన్, పాటిల్ రాజ్ కుమార్, ఘోడ్కే విఠల్, షేక్ మొహినోద్దీన్, షిండే మాధవ్, కల్యామ్‌కర్ అబాసాహెబ్, వాంఖడే పాటిల్, కార్లేకర్ మహారాజ్, రియాజ్, భగీరథ్ భాల్కే,దోడే మేడం, హరిదాస్ బద్దె, మాధవరావు తోటకే, గోవిందరావు భన్వర్, జిదేంద్ర జైన్, సోలంకే గురూజీ, జయమంగల్ ధనరాజ్, ప్రవీణ్ పాటిల్ దాఘే (బోల్సా), దత్తా పాటిల్ దాఘే (ఈజాతజ్ఞవ్), సంతోష్ గుటే కర్మలా, హేమంత్ మల్హారే (హిరద్‌గావ్), కిషన్ కదం (మండల), నగేష్ పాటిల్ చవాన్ (బోల్సా బు), విట్టల్ తోపే (బోల్సా ధనోర బు), దేవిదాస్ షిండే వాఘాల, యోగేష్ ధాగే (ఈజల్‌గావ్), శ్రీధర్ హన్బరాడే (బెజెగాన్),రాజేష్ మోర్ (ఉమ్రి), షేక్ మొయిన్ తమన్నావాలే, షేక్ సర్ఫరాజ్ అహ్మద్, మౌల్వీ ఉస్మాన్ రెహమాన్ షేక్, అజ్మత్ పటేల్, గులాం మొహమ్మద్ అబ్బుబకర్, మహబూబ్ ఖాన్, హఫీజ్ అహ్మద్ ఖాస్మీ, షేక్ గని షేక్ మోయిన్, షేక్ గౌస్ షేక్ రషీద్, సయ్యద్ సాజిద్ అలీ, అహ్మద్ భాయ్ షాహపుర్కర్, జాకీ మొహమ్మద్, అఫ్తాబ్ అహ్మద్, అఫ్రోజ్ మౌల్లానా, ఫిరోజ్ ఖాన్, జలీషా ఖాద్రీ, ఖలీల్ పటేల్ వాహబ్ పటేల్, ఖలీల్ పటేల్, అయూబ్ పటేల్, మొహ్సిన్ ఖాన్ గఫర్ ఖాన్, సాబర్ మహ్మద్, చాంద్ పాషా ఖాన్, అబ్దుల్ రజాక్ మోయిన్, డి.ఎం.పాటిల్, టైడల్ క్లౌడ్, దిలీప్ గైక్వాడ్, బాలాసాహెబ్ ధోత్రే, కాసిం పఠాన్, సుదర్శన్ ఘడ్గే, ప్రశాంత్ కిర్వాలే, విట్టల్ వాగ్మరే, ఐకాన్ పంచాల్, గోపాల్ మనే, రాజ్‌కుమార్ మోహితే, రఘువీర్ లోంధే, అభిషేక్ ఉకీర్డే, అమిత్ దార్వే, రిషికేష్ దేవర్సే, శేషారావు మానె, శుభమ్ ఖండ్కే, మస్తాన్ షా, MD రెహ్మత్ షా, అందర్ షా ఖాజా షా, సంజయ్ ఉర్కిడే, ముస్తఫా సయ్యద్..తదితరులున్నారు.

మధ్యప్రదేశ్ నుండి చేరికలు (MP)

బిఆర్ఎస్ పార్టీలోకి మధ్యప్రదేశ్ నుండి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ దిశగా నేడు కీలక పరిణామం చోటు చేసుకున్నది. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మధ్యప్రదేశ్ లో సంచలనం రేపిన వ్యాపమ్ స్కామ్ ను వెలుగులోకి తెచ్చిన ఆనంద్ రాయ్ బుధవారం ప్రగతిభవన్ లో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ అధినేత కేసీఆర్ వీరిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆంనద్ రాయ్ ఆర్టిఐ, ట్రైబల్ రైట్స్ యాక్టివిస్టుగా ప్రజల ఆదరాభిమానాలు పొందారు. సామాజిక కార్యకర్తగా వీరికి ప్రజల్లో మంచి పట్టు ఉన్నది.

మధ్యప్రదేశ్ లో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న “జై ఆదివాసి యువశక్తి సంఘటన్ (JAYS)” అనే ప్రముఖ గిరిజన హక్కుల వేదిక బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది మధ్యప్రదేశ్ లో ఆదివాసి, గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న ప్రముఖ సంస్థ. ఆనంద్ రాయ్ ఈ సంస్థలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు JAYS ప్రస్తుత అధ్యక్షుడు లాల్ సింగ్ బర్మన్, పంచం భీల్, అశ్విన్ దూబె, గాజీరామ్ బడోలే, కైలాశ్ రాణా తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

బిఆర్ఎస్ కు జెఎవైఎస్(JAYS) సంపూర్ణ మద్దతు

తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి పాలనలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మానవీయ కోణంతో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల అభివృద్దే ధ్యేయంగా కొనసాగుతున్నాయని జెఎవైఎస్ ఫౌండర్ విక్రమ్ అచ్చాలియా తెలిపారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్న బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కు తమ జై ఆదివాసి యువశక్తి సంఘటన్ (జెఎవైఎస్) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని తెలిపారు. 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీల ఆకాంక్షలు నెరవేరలేదని, బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నారనే విశ్వాసం దేశవ్యాప్తంగా కలుగుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా బిఆర్ఎస్ ఎదుగుతున్నదని అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా జాయ్స్ జాతీయ అధ్యక్షుడు లోకేష్ ముజాల్దా, వుమన్ ఇంచార్జ్ సీమా వాస్కాలె, మధ్యప్రదేశ్ అధ్యక్షుడు రాందేవ్ కకోడియా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X