हैदराबाद: लोकसभा चुनाव करीब आते देख रेवंत रेड्डी की सरकार ने अपनी आक्रामकता बढ़ा दी है। छह गारंटियों के हिस्से के रूप में सरकार ने चार योजनाएं लागू कर दी। इसी क्रम में अब एक और महत्वाकांक्षी योजना शुरू करने के लिए तैयार हो गई है। सरकार ने लंबे समय से प्रतीक्षित इंदिराम्मा आवास योजना के शुभारंभ पर महत्वपूर्ण घोषणा की है।
शनिवार को सीएम रेवंत रेड्डी ने सचिवालय में इंदिराम्मा आवास योजना पर मंत्रियों और अधिकारियों के साथ समीक्षा बैठक की। इस पृष्ठभूमि में सीएम ने 11 मार्च को औपचारिक रूप से इंदिराम्मा आवास योजना शुरू करने का निर्णय लिया है। इस संबंध में अधिकारियों को सभी व्यवस्थाएं करने के आदेश जारी किया है।
सीएम रेवंत रेड्डी ने अधिकारियों को इंदिराम्मा आवास योजना पर तुरंत दिशानिर्देश तैयार करने का आदेश दिया। हालांकि, इस योजना के तहत उन लोगों को 5 लाख रुपये की वित्तीय सहायता प्रदान की जाएगी जिनके पास घर का प्लॉट है। जिन गरीबों के पास घर या जगह नहीं है, उन्हें सरकार घर के प्लॉट के साथ-साथ 5 लाख रुपये भी देगी। सीएम रेवंत रेड्डी ने अधिकारियों को इसके लिए नियम तैयार करने का आदेश दिया।
यह भी पढ़ें:
इससे स्पष्ट होता है कि रेवंत रेड्डी सरकार चुनाव के दौरान दिए गए आश्वासनों को एक-एक करके लागू कर रही है। कांग्रेस पार्टी ने आश्वासन दिया है कि सत्ता संभालने के 100 दिनों के भीतर सभी वादे पूरे किए जाएंगे। सरकार सत्ता संभाले 80 दिन पूरे हो चुके हैं। रेवंत सरकार ने छह गारंटी के हिस्से के रूप में चार योजनाएं लागू की हैं। अब यदि इंदिराम्मा आवास योजना भी लागू हो गई तो पांच योजनाएं लागू हो जाएंगी।
विश्लेषकों का मानना है कि रेवंत रेड्डी सरकार के पास 20 दिन बचे हैं। अब एक और एक योजना लागू करना बाकी है। लोकसभा चुनाव की घोषणा होती है तो कांग्रेस सरकार के लिए यह एक योजना लागू करना मुश्किल हो जाएगा। तब विपक्षी पार्टियां रेवंत रेड्डी सरकार की आलोचना करने में कोई कसर छोड़ेंगे। अब देखना है कि तेलंगाना सरकार कैसे आगे बढ़ती है।
రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభంపై కీలక ప్రకటన
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ దూకుడు పెంచింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో భాగంగా.. నాలుగు పథకాలను పట్టాలెక్కించిన ప్రభుత్వం ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
శనివారం రోజున సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మార్చి 11వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాలని ముహూర్తం ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై వెంటనే గైడ్‌లైన్స్ రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే.. ఈ పథకంలో భాగంగా ఇంటి స్థలం ఉన్న వారికి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. ఇక ఇళ్లతో పాటు స్థలం కూడా లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందించనుంది ప్రభుత్వం. అందుకు సంబంధించిన నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కాగా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన అభయహస్తం హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. అధికారం చేపట్టిన 100 రోజుల్లో అన్ని హామీలు నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది. కాగా.. ఇప్పటికే 80 రోజులు పూర్తి కావటంతో.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికి 4 పథకాలను అమలు చేసింది రేవంత్ సర్కార్. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా అమలు చేస్తే.. ఐదు పథకాలు అమలైనట్టవనుంది. (ఏజెన్సీలు)