मेट्रो हड़ताल: జీతాలు పెంచడం లేదని హైదరాబాద్ మెట్రో రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగుల సమ్మె, స్తంభించిన టికెట్ వ్యవస్థ

हैदराबाद: हैदराबाद मेट्रो हड़ताल से प्रभावित हुई है। रेड लाइन टिकटिंग कर्मचारियों ने अपने काम का बहिष्कार किया है। पांच साल से वेतन वृद्धि नहीं किये जाने के विरोध में कर्मचारी आंदोलन पर उतरे है। इसके चलते मियापुर से एलबी नगर तक के मेट्रो स्टेशनों में टिकट व्यवस्था चरमरा गई है। अमीरपेट और मियापुर मेट्रो स्टेशनों पर टिकट के लिए बड़ी संख्या में यात्रियों की कतार लगी रही।

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఐదేళ్లు ఏళ్ల నుండి జీతాలు పెంచడం లేదని వారు సమ్మెకు పూనుకున్నారు. ఈ సమ్మెలో భాగంగా నేడు కొంతమంది ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన తెలుపుతున్నారు. దీనితో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదని రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. దీంతో మియాపూర్ నుండి ఎల్బీనగర్ వరకు మెట్రోస్టేషన్లలో టికెట్ వ్యవస్థ స్తంభించిపోయింది. అమీర్ పేట, మియాపూర్ మెట్రోస్టేషన్లలో ప్రయాణికులు టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

గత ఐదేళ్లుగా ప్రతి నెల 11 వేల రూపాయల జీతం మాత్రమే ఇస్తున్నారని.. వేతనాలు పెంచమంటే పట్టించుకోవడం లేదని సమ్మె చేపట్టిన టికెటింగ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావంతో ఐదేళ్లలో అన్ని ధరలు పెరిగినా తమకు జీతాలు మాత్రం పెరగకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కనీస వేతనం రూ.15 వేల నుండి రూ.18 వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X