हैदराबाद: सोने की कीमतों में एक बार फिर उछाल आया है। कुछ सप्ताह से स्थिर चल रहा सोना पिछले सप्ताह में 2,500 रुपये से अधिक बढ़ गया। अखिल भारतीय सर्राफा संघ ने कहा कि अंतरराष्ट्रीय घटनाक्रमों के बीच आभूषण विक्रेताओं और खुदरा विक्रेताओं की लिवाली बढ़ने से बुधवार को राष्ट्रीय राजधानी में शुद्ध दस ग्राम सोने का भाव 860 रुपये बढ़कर 82,730 रुपये हो गया। लगातार छठे दिन भी बढ़ोत्तरी के चलते आभूषणों में इस्तेमाल होने वाले 22 कैरेट सोने की 10 ग्राम की कीमत 750 रुपये बढ़कर 75,250 रुपये के सर्वकालिक उच्च स्तर पर पहुंच गई।
अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रम्प की व्यापार नीति को लेकर अनिश्चितता के कारण निवेशक सोने जैसे सुरक्षित निवेशों की ओर आकर्षित हो रहे हैं। अंतर्राष्ट्रीय बाज़ार में डॉलर के कमज़ोर होने से सोने की कीमतें बढ़ रही हैं। एचडीएफसी सिक्योरिटीज कमोडिटीज के वरिष्ठ विश्लेषक सौमिल गांधी ने कहा कि ट्रम्प के रुख के कारण लंबे समय से चली आ रही व्यापार चिंताओं के कारण निवेश सोने की ओर बढ़ रहा है। सोने के साथ-साथ चांदी की कीमतें भी बढ़ रही हैं। बुधवार एक हजार रुपये से अधिक बढ़कर एक किलोग्राम चांदी की कीमत 1,04,000 रुपये हो गयी है।
Also Read-
కొత్త గరిష్ఠాలకు చేరిన బంగారం ధర
హైదరాబాద్ : బంగారం ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. కొన్ని వారాల నుంచి స్థిరంగా ఉన్న పసిడి గత వారం రోజుల్లో రూ. 2,500 కి పైగా పెరిగింది. అంతర్జాతీయ పరిణామాల మధ్య ఆభరణాల వ్యాపారులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో బుధవారం దేశ రాజధానిలో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ. 860 పెరిగి రూ. 82,730కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. వరుసగా ఆరో రోజు పెరగడంతో ఆభరణాల్లో వాడే 22 క్యారెట్ల పది గ్రాములు బంగారం రూ. 750 పెరిగి జీవితకాల గరిష్ఠం రూ. 75,250 వద్ద ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానం చుట్టూ ఉన్న అనిశ్చితి నెలకొన్న కారణంగా బంగారం వంటి సురక్షితమైన సాధానాలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలోనూ డాలర్ బలహీనపడటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ట్రంప్ ధోరణితో దీర్ఘకాలిక వాణిజ్య ఆందోళనల వల్ల పెట్టుబడులు బంగారంవైపునకు మళ్లుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ విశ్లేషకులు సౌమిల్ గాంధీ తెలిపారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. బుధవారం రూ. వెయ్యికి పైగా పెరిగి రూ. 1,04,000కి చేరుకుంది. (ఏజెన్సీలు)