రైలు కార్యకలాపాల నిర్వహణలో భద్రత మరియు వేసవి సన్నద్ధతపై సమీక్ష నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల భద్రత మరియు వేసవి సన్నద్ధతపై ఈ రోజు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, వివిధ శాఖల ప్రధాన అధిపతులతో కలిసి పాల్గొన్నారు. విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్ అనే ఆరు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

Also Read-

ఈ సమీక్షా సమావేశంలో, సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రస్తుతం నెలకొన్న వడగాలుల పరిస్థితుల దృష్ట్యా సురక్షితమైన మరియు నిరంతరాయమైన రైలు కార్యకలాపాలను కొనసాగించడానికి వేసవి సన్నద్ధత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. జనరల్ మేనేజర్ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా ట్రాక్‌లను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, అవసరమైన చోటల్లా ట్రాక్‌లపై కంకర నింపడాన్ని నిర్ధారించాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా, వేడి వాతావరణ పరిస్థితులలో పనిచేస్తున్నప్పుడు వేసవి జాగ్రత్తల ప్రాముఖ్యతపై ట్రాక్ పెట్రోల్ సిబ్బందికి అవగాహన కల్పించాలని జనరల్ మేనేజర్ అధికారులకు మరియు సూపర్‌వైజర్‌లకు సూచించారు. గ్యాంగ్‌మెన్‌లకు రక్షణ పరికరాలను అందించాలని, అలాగే పని ప్రదేశాలలో తగినంత త్రాగునీరు మరియు ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణాలు అందుబాటులో ఉండేలా చూడాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.

Also Read-

ఇంకా,వేసవిలో రైళ్లలో ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా నివారించడానికి జోన్ నిర్వహిస్తున్న అగ్నిమాపక భద్రతా డ్రైవ్‌ను జనరల్ మేనేజర్ సమీక్షించారు. ప్రైవేట్ సైడింగ్‌లు, గూడ్స్ షెడ్‌ల వద్ద సీసీటీవీ కెమెరాల ఏర్పాటును కూడా ఆయన సమీక్షించి, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అక్రమ ప్రవేశాలకు ఆస్కారం ఉన్న కొన్ని ప్రదేశాలలో ట్రాక్ ఫెన్సింగ్‌ను జనరల్ మేనేజర్ సమీక్షించి, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X