“రేవంత్ రెడ్డి పాలన ‘బాత్ కరోడో మే.. కామ్ పకోడో మే’ అన్నట్లుగా తయారైంది”

హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ, స్థానిక కాంగ్రెస్ నాయకత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భవిష్యత్తు బీఆర్ఎస్ దే అని స్పష్టం చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళలకు రూ. 2500 ఇస్తామని చెప్పి నిరుద్యోగులు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది.
ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. పైగా కేసీఆర్ గారు మైనారిటీలకు ఇచ్చిన ప్రయోజనాలను సైతం రేవంత్ రెడ్డి ఆపేశాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు.. బాత్ కరోడో మే.. కామ్ పకోడో మే అన్నట్లుగా ఉంది. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం శూన్యం.

ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ నిధులు రావడం లేదు. ఎస్సీ-ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ రెండున్నరేళ్ల పాలనలో ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి లబ్ధి కూడా జరగలేదు. కేసీఆర్ గారి పాలనలో ఎంతో అభివృద్ధి జరిగింది. కాళేశ్వరం జలాలతో ఈ ప్రాంతంలోని పొలాలు పారాయి. గతంలో మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏనాడైనా కోదాడకు గోదావరి జలాలను తీసుకురాగలిగారా? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే ఎస్సారెస్పీ ఫేజ్-2 పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందించాం. ఎన్నికల్లో ఓడిపోయినా మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు. కానీ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రం కేవలం ఆన్లైన్ కే పరిమితమైంది.

Also Read-

అసలైన నాయకుడు ఎవరో ప్రజలు అర్థం చేసుకోవాలి. పసలేని ఈ కాంగ్రెస్ పాలన ఎప్పుడెప్పుడు పోతుందా అని జనం ఎదురుచూస్తున్నారు. ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ పాలన రావాలని బలంగా కోరుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు రైతుబంధు ఆపలేదు. హమాలీలు దొరక్క వడ్ల కొనుగోళ్లు ఆగుతున్నాయంటే.. ఏకంగా బీహార్ నుంచి ప్రత్యేక రైళ్లలో కూలీలను తీసుకొచ్చి వడ్ల లోడ్లు దించిన గొప్ప నాయకుడు కేసీఆర్. ఆనాడు కరోనా సమయంలో 93 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొన్న ఘనత కేసీఆర్ గారిది. ఈ యాసంగిలో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని గొప్పలు చెప్పి.. ఇప్పటి వరకు కేవలం 17 లక్షల టన్నుల వడ్లను మాత్రమే కాంగ్రెస్ కొన్నది. కరోనా మనుషుల ప్రాణాలు తీస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురుపోసుకుంటోంది. ప్రతిక్షణం రైతులను ఏడిపిస్తోంది.

కాంగ్రెస్ పాలనలో రైతులకు అడుగడుగునా కష్టాలే. ఎరువు బస్తాల కష్టాలు, కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు.. ఆఖరికి పండిన వడ్లు అమ్ముకోవాలన్నా కష్టాలు తప్పడం లేదు. యూరియా అమ్ముకోవడం చేతకాని ప్రభుత్వం.. మొన్నటి దాకా ఆన్లైన్ యాప్ లు పెట్టింది, ఇప్పుడు ఏకంగా యూరియా అమ్మకాల పైనే బ్యాన్ పెట్టి రైతులను గోస పెడుతోంది. అస్తమానం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న రేవంత్ రెడ్డి.. ఒక్కసారైనా ఏసీ రూములు వదిలి వడ్ల కల్లాల దగ్గరికి వచ్చి రైతుల కష్టాలు వినాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐకేపీ కేంద్రాలకు వెళ్లి రైతుల బాధలు చూడాలి. అమాయకుడైన బీఆర్ఎస్ కార్యకర్త రాజేష్ ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా పొట్టనబెట్టుకుంది.

రేపు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చాక ఆ లెక్కలన్నీ ముంగటేస్తాం, ప్రతి ఒక్కరి తాట తీస్తాం. మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వడ్డీతో సహా చెల్లిస్తాం. బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల తరహాలోనే తెలంగాణలో కూడా కచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పటికే ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది, వచ్చేసారి కేసీఆర్ ని మళ్లీ గెలిపించుకుంటారు. ఇప్పుడు రాష్ట్రం అంతటా వినిపిస్తున్నది ఒకటే నినాదం.. కాంగ్రెస్ పోవాలె.. కేసీఆర్ రావాలె.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X