కొరమండల్ రైల్ ప్రమాదం, 280 దాటిన మృతుల సంఖ్య (Video)

हैदराबाद: ओडिशा के बालासोर के पास हुए ट्रेन हादसे में मरने वालों की संख्या बढ़ती जा रही है। शुक्रवार की शाम सात बजे बहनागा रेलवे स्टेशन के पास तीन ट्रेनों की आपस में टक्कर हो जाने से बड़ा हादसा हो गया। इस हादसे में मरने वालों का आंकड़ा 280 को पार कर गया है। देश और विदेश के अनेक नेताओं ने ट्रेन हादसे पर गहरा शोक व्यक्त किया है।

https://twitter.com/ANI/status/1664856449976074242?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1664856449976074242%7Ctwgr%5E7242a2477c13b2010c0c932668f33f7e4070a58d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fnational%2Fodisha-train-accident-live-updates-coromandel-express-hits-another-train-and-derailed-1110757

హైదరాబాద్: ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. బహనాగా రైల్వే స్టేషన్‌ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మూడు రైళ్లు ఢీకొనడంతో పెను ప్రమాదం సంభవించింది. 280 దాటిన మృతుల సంఖ్య.

కొరమండల్ రైల్ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి

కొరమండల్ రైల్ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి. ఒడిసా లో నిన్న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇది తీవ్రంగా కలిచివేసింది.

సంబంధిత వార్త

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం.. వారి కుటుంబాలకు నా సానుభూతి మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ప్రమాదంలో గాయపడ్డ వారికి యుద్ధ ప్రాతిపదికన మంచి చికిత్సలు అందించాలి. ప్రమాదానికి కారణాలు అన్వేషించి తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి.

ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల‌కు మంత్రి కేటీఆర్ సంతాపం

ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ దుర్ఘ‌ట‌న‌లో 233 మంది ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోవ‌డం ప‌ట్ల ఆయ‌న షాక్ వ్య‌క్తం చేశారు. రైలు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల‌కు ఆయ‌న సంతాపం తెలిపారు.

ప్ర‌మాద బాధితులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రైలు ప్ర‌మాదాన్ని నివారించే యాంటీ కొలిజ‌న్ డివైస్‌లు ఏమైన‌ట్లు మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించారు. ప్ర‌మాద తీవ్ర‌త చాలా ఊహించ‌ని రీతిలో ఉంద‌ని, ఈ విషాదం జ‌ర‌గాల్సింది కాదు అని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

విరాట్‌ కోహ్లీ దిగ్భ్రాంతి

ఒడిశా రైలు ప్రమాదంపై టీమిండియా క్రికెట్‌ విరాట్‌ కోహ్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తైవాన్‌ ప్రెసిడెంట్‌ సంతాపం

ఒడిశా రైలు ప్రమాదంపై తైవాన్‌ ప్రెసిడెంట్‌ ట్సాయి ఇంగ్‌ వెన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

కెనడా ప్రధాని విచారం

ఒడిశా దుర్ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో విచారం వ్యక్తం చేశారు. ఒడిశా రైలు ప్రమాద ఘటన తన హృదయాన్ని కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం తెలిపారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారత ప్రజలకు కెనడా దేశం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X