Foundation stone for 4 New Buildings will be laid by the Hon’ble Chief Minister
Hyderabad: Chief Minister Sri Revanth Reddy will Unveil the Statue of Bharat Ratna Dr B R Ambedkar at the Dr B R Ambedkar Open University Campus on Sunday along with Bhatti Vikramarka Mallu, Hon’ble Deputy Chief Minister; Duddilla Sridhar Babu, Hon’ble Minister for Information Technology, Electronics, Communications, Industries and Commerce; Ponnam Prabhakar, Hon’ble Minister for Transport & BC Welfare will lay foundation for 4 new buildings in the university premises.
The Guests of Honour Smt A Shanthi Kumari, IAS, Chief Secretary; K Ramakrishna Rao, IAS, Special Chief Secretary, Finance Department; Dr Yogita Rana, IAS, Secretary Higher Education; Prof V Balakista Reddy, Chairman, Telangana State Council of Higher Education are also participating in the Unveiling Ceremony.
Prof. Ghanta Chakrapani, Vice-Chancellor, Dr. BRAOU will preside over the function. Dr. L. Vijaya Krishna Reddy, Registrar, all the Directors, Deans, Heads of Branches Teaching and Non-Teaching Staff Members will participate.
Also Read-
డా. బి ఆర్ అంబేద్కర్ 15 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి
విశ్వవిద్యాలయంలో నాలుగు నూతన భవనాలకు, ఆదునిక బస్సు షెల్టర్ కు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాప్రాంగణంలో భారతరత్న డా. బి. ఆర్. అంబేద్కర్ 15 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు; సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్లు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు; రవాణా & బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విశ్వవిద్యాలయంలో నాలుగు నూతన భవనాలకు, ఆదునిక బస్సు షెల్టర్ కు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఎ. శాంతికుమారి, ఐఏఎస్; ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఐఏఎస్; ఉన్నత విద్యా కార్యదర్శి డా. యోగితా రాణా, ఐఏఎస్; ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. వి. బాలకిష్ట రెడ్డి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనున్నారు.
అంబేద్కర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి డైరెక్టర్లు, డీన్లు, వివిధ శాఖల అధిపతులు, బోధనా, బోధనేతర సిబ్బంది పాల్గొనున్నారని విశ్వవిద్యాలయ ప్రజా సంబంధాల అధికారి పేర్కొన్నారు.