మహబూబ్‌నగర్‌ పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ్ ప్రారంభం, సాయంత్రం బహిరంగ సభ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ నుంచి రోడ్డు మార్గాన మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో కొత్తగా నిర్మించిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ శ్రేణులతో భేటి అవుతానారు.

తర్వాత పాలకొండ వద్ద 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.55 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. కలెక్టర్‌ వెంకట్రావుకు పరిపాలన పగ్గాలు అప్పజెప్పనున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులను అరెస్టులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X