RRR Oscar : RRR టీమ్‌కు అభినందనలు… అభినందనలు… అభినందనలు…

హైదరాబాద్ : హైదరాబాద్‌: ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) హర్షం వ్యక్తంచేశారు. విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణం భారతీయుల చిరకాల వాంఛ ఆస్కార్ కలను నెరవేర్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’చిత్ర బృందానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇలా అభినందనలు తెలిపారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు – నాటు’ పాటకు ‘ఉత్తమ ఒరిజనల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆస్కార్ అవార్డు పొందిన ‘నాటు నాటు’ పాటలో పొందుపరిచిన పదాలు తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి, అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని కేసీఆర్ కొనియాడారు.

‘తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట రచయిత, నాటి ఉమ్మడి వరంగల్, నేటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామ బిడ్డ చంద్రబోస్‌కు ప్రత్యేకంగా అభినందనలు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి, కూర్పులో భాగస్వాములైన దర్శకుడు రాజమౌళి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సినిమా నిర్మాత డీవీవీ దానయ్య, ఇతర సాంకేతిక సిబ్బందికి శుభాకాంక్షలు’ అంటూ సీఎం కేసీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

“ఆస్కార్ అవార్డుతో తెలంగాణ కేంద్రంగా, హైదరాబాద్ గడ్డమీద దినదినాభివృద్ధి చెందుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కీర్తి దిగంతాలకు వ్యాపించింది” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ అవార్డు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌కే కాకుండా తెలుగు, ద్రావిడ భాషలకు, యావత్తు భారత దేశానికి గర్వకారణం అని కేసీఆర్ అన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులకు ఇది పండుగరోజు. తెలుగు సినిమా పరిశ్రమ ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వ కృషి ఫలించింది’ అంటూ కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.

Related News:

తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి, విస్తరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందిస్తోందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా కాలంలో కష్టాలు చుట్టిముట్టిన తెలుగు సినిమా పరిశ్రమకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆస్కార్ అవార్డు స్ఫూర్తితో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తులోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలని, వైవిద్యంతో కూడిన కథలతో, ప్రజా జీవితాలను ప్రతిబింబించే సినిమాలు మరిన్ని రావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. మరోవైపు.. భారత్‌కు ఆస్కార్ అందించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి ఘన స్వాగతం పలికి, ఘనంగా సన్మానించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధి, విస్తరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదనీ, కరోనా కాలంలో కష్టాలు చుట్టిముట్టిన తెలుగు సినిమా పరిశ్రమకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆస్కార్ అవార్డు స్ఫూర్తితో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తులోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలని, వైవిద్యంతో కూడిన కథలతో, ప్రజా జీవితాలను ప్రతిబింబించే సినిమాలు మరిన్ని రావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. (ఏజెన్సీలు)

బండి సంజయ్ అభినందనలు

• ట్రిపుల్ ఆర్ (RRR) సినిమాలోని ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ అవార్డు లభించడం మర్చిపోలేని మధుర జ్ఝాపకం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

• విశ్వవేదికపై తొలిసారి భారతీయ సినిమా పాటకు ఆస్కార్ అవార్డు రావడం, అందులోనూ తెలుగు పాట ఆ ఘనత సాధించడం భారతీయులందరికీ ప్రత్యేకించి ప్రపంచంలోని తెలుగు వారందరికీ గర్వకారణం : బండి సంజయ్

• ఇంత గొప్ప పాటను రాసిన చంద్రబోస్, సంగీతం అందించిన ఎం.ఎం.కీరవాణి, స్వరాలందించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవతోపాటు RRR సినిమా చిత్ర యూనిట్ కు, ముఖ్యంగా తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి చేర్చిన రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ లకు నా శుభాకాంక్షలు.

Related News

రేవంత్ రెడ్డి అభినందనలు

జక్కన్న బృందానికి శుభాకాంక్షలు… టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హార్దం… అభినందనలు. RRR సినిమా బృందానికి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కు గొప్ప గుర్తింపు తెచ్చి ఆస్కార్ అవార్డ్ పొందిన సందర్భంగా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడం చరిత్రాత్మకం. సినిమా బృందానికి దర్శకులు రాజమౌళి, పాట రచయిత, గాయకులు, సంగీత దర్శకులు, నటులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X