Oscars 95: భారత్‌కు ఆస్కార్ అవార్డ్‌, విజేతగా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, చరిత్ర సృష్టించింది RRR

హైదరాబాద్ : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ప్రఖ్యాత 95th Academy అవార్డ్‌లు కార్యక్రమం ప్రారంభమైంది. అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా వివిధ కేటగిరీలో ఈ అవార్డ్‌ల ప్రధానం చేస్తున్నారు. 95వ అకాడ‌మీ వేడుక‌ల్లో ఇండియా తొలి ఆస్కార్ అవార్డ్ ద‌క్కింది. బెస్ట్ డాక్యుమెంట‌ర్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ విజేత‌గా నిలిచిన‌ట్లు జ్యూరీ ప్ర‌క‌టించింది. ఈ చిత్రాన్ని గురునీత్ మోంగ నిర్మించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ని కార్తీక్ గోన్‌స్లేవ్స్ డైరెక్ట్ చేశారు. హాల్ ఔట్‌, మార్తా మిచెల్ ఎఫెక్ట్‌, స్ట్రేంజ‌ర్ ఎట్ ది గేట్‌ల‌తో ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ పోటీ ప‌డి విజేత‌గా నిలిచింది. ఈ ఏడాది మ‌న దేశం త‌ర‌పున‌ తొలి అవార్డు ఈ షార్ట్ ఫిల్మ్ ద‌క్కించుకోవ‌టం విశేషం.

మ‌దుమ‌లై నేష‌న‌ల్ పార్క్‌బ్యాక్‌డ్రాప్‌లో ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ తెర‌కెక్కింది. బొమ్మ‌న్‌, బెల్లీ అనే దంపతులు ఓ ఏనుగు పిల్ల‌ను పెంచుకుంటారు. దానికి ర‌ఘు అనే పేరు పెట్టుకుంటారు. ఈ సినిమాలో వారి మ‌ధ్య అనుబంధాన్ని, ప్రేమ‌ను తెలియ‌జేయ‌ట‌మే, అడ‌వి అందాల‌ను అద్భుతంగా చూపించారు. 2022లో ది ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్ నెట్ ఫ్లిక్స్‌లో విడుద‌లైంది.

అట్టహాసంగా జరుగుతున్న ఈ ఏడాది ఆస్కార్ వేడుకల్లో RRR మూవీ నుంచి ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమొంటే ఆస్కార్ వేడుక‌ను ప్రారంభించ‌టానికి ముందే నాటు నాటు పాట‌ను వేదిక‌పై ప్ర‌ద‌ర్శించారు. ఈ లైవ్ పెర్ఫామెన్స్‌కి స్టేజ్ అదిరిపోయింది. ఆడియెన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

చరిత్ర సృష్టించింది RRR

ఆర్.ఆర్.ఆర్. (RRR) చరిత్ర సృష్టించింది. ఆస్కార్ (Oscars-95) అవార్డు గెలుచుకుంది. ‘నాటు నాటు’ (Naatu Naatu) సాంగ్ కి ఆస్కార్ అకాడమీ అవార్డ్ వచ్చింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయం లో ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో ఈ అవార్డు ఈ పాటకి ఇస్తున్నట్టుగా ఆస్కార్ వేదిక మీద ప్రకటించారు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా దర్శకుడు రాజమౌళి కాగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. చంద్రబోస్ ఈ ‘నాటు నాటు’ పాటని రాశారు. ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకి కోరియోగ్రఫీ చేశారు. ఇలా తెలుగు పాట ఆస్కార్ నామినేషన్స్ లో ఉండటం, ఆస్కార్ గెలుచుకోవటం ఇదే మొదటి సారి. ఇప్పుడు ఈ పాట చరిత్ర సృష్టించింది. ఇది తెలుగువాడి విజయం, తెలుగువాడికి గర్వకారణం.

‘ఆర్.ఆర్.ఆర్’ మార్చి 24, 2022 ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయి సంచలమం సృష్టించింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించారు, ఈ పాటకి ఈ ఇద్దరు నటులు అద్భుతమయిన డాన్స్ చేశారు. ఈ ఇద్దరు నటులు ప్రస్తుతం అమెరికాలో వుండి ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి విపరీతమయిన ప్రచారం చేశారు. అక్కడ టాక్ షో, రేడియో లో ఇద్దరు నటులు ఇంటర్వూస్ ఇచ్చారు. తమ సినిమాకి ప్రచారం చేశారు. దర్శకుడు రాజమౌళి అయితే అమెరికా లో చాలా కాలం వుంది, ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) సినిమాని ప్రమోట్ చేశారు. స్టీవెన్ స్పెల్ బెర్గ్, క్రిస్టోఫర్ నోలన్, జేమ్స్ కామెరాన్ లాంటి పెద్ద పెద్ద దర్శకులని కలిసి వాళ్ళకి సినిమా చూపించి, వాళ్ళచేత ఎంతగానో ప్రశంసలు పొందారు.

ప్రపంచం లో పేరెన్నికగన్న అంతటి పెద్ద దర్శకులు మన తెలుగు సినిమా గురించి మాట్లాడటమే ఒక అద్భుతం. అటువంటి దర్శకులు రాజమౌళి గురించి, ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అలాంటి సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఈరోజు ఆస్కార్ లో ఉండటమే చరిత్ర, మరి అలాంటిది ఆస్కార్ గెలుచుకుంది అంటే, అది చరిత్ర కన్నా గొప్పది. అందులోకి తెలుగు సినిమా ఈరోజు ఇంతటి స్థాయికి చేరింది అంటే, ప్రతి తెలుగు వాడు, భారతీయుడు గర్వించదగ్గ రోజు ఈరోజు. హేట్సాఫ్ టు రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మిగతా టీం సభ్యులు అందరికీ. కీరవాణి, చంద్రబోస్‌కు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X