AI దుర్వినియోగంపై చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి

హైద‌రాబాద్ : కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం జరుగుతున్న తీరు, సినీనటులు, ప్రజల వ్యక్తిగత జీవితాల్లో సాంకేతికత ఆధారంగా.. ఉద్దేశపూర్వకంగా సమస్యలు సృష్టిచే ప్రయత్నాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవలి హైదరాబాద్ పర్యటన సందర్భంగా.. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వివరించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పత్రికా ప్రకటనలో తెలపారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పత్రికా ప్రకటనలో… ఈ నేపథ్యంలో తాజాగా కృత్రిమ మేధ దుర్వినియోగం, మార్ఫింగ్, డీప్ ఫేక్, వాయిస్ క్లోనింగ్ వంటి చర్యలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేస్తూ.. అమిత్ షాకి.. చిరంజీవి రాసిన లేఖను నా ద్వారా అందించాలని కోరారు.

నేను ఈ లేఖను అమిత్ షాకి వ్యక్తి గతంగా అందించాను. కృత్రిమ మేధ దుర్వినియోగం, డీప్‌ఫేక్ వంటి సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని అరికట్టే విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా పనిచేస్తోంది. సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా వ్యక్తుల హక్కులు, వ్యక్తిగత గోప్యత, గౌరవానికి భంగం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విషయంలో కఠిన చర్యలకోసం ప్రత్యేక చట్టం తీసుకురానుంది.

Also Read-

అమిత్ షాకి చిరంజీవి రాసిన లేఖలో.. కృత్రిమ మేధ దుర్వినియోగం కారణంగా సినీ కళాకారులు, ఫిల్మ్, టెలివిజన్ పరిశ్రమల్లోని వ్యక్తులకు జరుగుతున్న నష్టం గురించి వివరించి వీటిని అరికట్టాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి సానుకూలంగా స్పందించారు.

కళాకారులు దశాబ్దాల పాటు తీవ్రంగా శ్రమించి గుర్తింపు, పేరుప్రతిష్టలు సంపాదిస్తుంటారని, అలాంటి వారి ముఖం, గొంతు, సృజనాత్మక పనులను వారి అనుమతి లేకుండా, వారికి కనీసం సమాచారం ఇవ్వకుండా డిజిటల్‌గా పున:సృష్టిస్తున్నారని చిరంజీవి తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కళాకారులు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని, మానసికంగా కుంగిపోవడంతో పాటు చేయని తప్పునకు సమాజంలో నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.

కృత్రిమ మేధను వినియోగించి వ్యక్తుల ముఖాలు, గొంతు, చిత్రాలు, రూపం గుర్తించగలిగేలా ఉన్న లక్షాలను వారి అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం, తప్పుడు ఉద్దేశాలతో దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు చట్టపరమైన రక్షణ కల్పించాలని చిరంజీవి కోరారు.
వ్యక్తులు, కళాకారుల గుర్తింపు, గొంతు, వారి ప్రదర్శనలను డిజిటల్ రూపంలో సృష్టించడం లేదా మార్పులు చేయడానికి ముందు ఆయా వ్యక్తులకు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదా ముందస్తు సమ్మతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

దురుద్దేశాలతో డీప్‌ఫేక్‌ సృష్టించడం, ప్రచారం చేయడం, ఇతరుల్లా నటించడం, కంటెంట్ దుర్వినియోగం చేయడం, కళాకారులు, వ్యక్తల పరువునష్టం కలిగించేలా కంటెంట్ వినియోగాన్ని నిరోధించేందుకు సమర్థవంతమైన సివిల్, క్రిమినల్ చట్టాల పరిధిలో పరిష్కారాలు, నేరాల తీవ్రతకు అనుగుణంగా శిక్షలు, తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

చట్ట విరుద్ధంగా AI ద్వారా సృష్టించిన కంటెంట్‌పై ఫిర్యాదు చేసేందుకు వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు, ఆ కంటెంట్ వెంటనే తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇతరుల్లాగా నటించడం, లైంగిక వేధింపులు, వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న కంటెంట్ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకునేలా చూడాలన్నారు.

మేధోసంపత్తి హక్కుల పరిరక్షణ, సినీ, టీవీ కళాకారులు, సాంకేతిక నిపుణులు, క్రియేటివ్ ప్రొఫెషనల్స్ ప్రదర్శనలు, ఆర్థికపరమైన హక్కులను పరిరక్షించేలా, AI ద్వారా దుర్వినియోగం కాకుండా తగిన రక్షణ కల్పించాలి. డీప్‌ఫేక్‌ దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసేలా చూడాలని చిరంజీవి కోరారు.

అనుమతి లేని, హానికరమైన కంటెంట్‌ సృష్టించేందుకు AI సాంకేతికతను దుర్వినియోగం చేసే వారిపైనే కాకుండా, అలాంటి కార్యకలాపాలకు పరోక్షంగా సహకరించే వారిపైనా చర్యలు తీసుకునేలా నిబంధనలు తీసుకురావాలన్నారు. తగిన నియంత్రణలు లేకుండా దుర్వినియోగ కార్యకలాపాలకు అవకాశం కల్పించే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, సర్వీస్ ప్రొవైడర్లు, AI టూల్స్ నిర్వాహకులపైనా జరిమానాలు, శిక్షలు విధించే అవకాశాలు పరిశీలించాలని కోరారు.

సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థను రూపొందించే సమయంలో ఫిల్మ్ ఛాంబర్లు, టీవీ సంస్థలు, నటీనటుల సంఘాలు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరపాలి. సంబంధిత అన్ని వర్గాల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర నియంత్రణ విధానాన్ని రూపొందించాలన్నారు.

ప్రపంచ దేశాల్లో ఇప్పటికే AI సాంకేతికత దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పటిష్టమైన విధానాలు, నియంత్రణలు రూపొందించారు. ఆయా దేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, మన దేశ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. (ఉదాహరణకు: యూకే క్రైమ్& పోలీసింగ్ యాక్ట్ 2026 ప్రకారం, డీప్‌ఫేక్ చిత్రాలను రూపొందించడాన్ని నేరంగా పరిగణిస్తూ.. చట్టపరమైన చర్యలు తీసుకునే నిబంధనలు రూపొందించారు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar