MLC Kavitha’s Birthday: “వీ స్టాండ్ విత్ కవిత అక్క” అంటూ మద్దుతు తెలిపిన ప్రవాసులు మరియు…

లండన్/హైదరాబాద్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఆడబిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టాక్ మహిళా విభాగం సభ్యులు కవిత కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డ కవిత గారు మన తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఆదర్శమైన నాయకురాలని, మాలాంటి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని, మహిళల హక్కులైన పోరాటాం చేస్తున్న ధీర వనితని , అలాంటి నాయకురాలి పైన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలని ఎన్నారైలంతా వ్యతిరేకిస్తున్నారని, ఎన్నో సంవత్సరాలుగా మా వెంటే ఉంటూ మమల్ని ప్రోత్సహిస్తున్న కవితక్క వెంట మేమంతా ఉన్నామని, “వీ స్టాండ్ విత్ కవిత అక్క” (#WeStandWithKavithaAkka) అని మహిళలంతా నినదించారు.

కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఎలాంటి సమస్యలొచ్చినా దైర్యంగా ఎదుర్కొని నిలబడే శక్తి గల ధీర వనిత కవిత గారని, ఇటీవల ఢిల్లీ వేదిక ద్వారా మహిళా బిల్లు కై చేప్పట్టిన దీక్షకు ప్రవాసులంతా మద్దత్తు తెలుపుతున్నామని, మా పక్షాన కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మహిళా బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసి, మహిళా లోకానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తునట్టు సుప్రజ తెలిపారు.

అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు చట్ట సభల్లో కూడా న్యాయపరమైన వాటా రావాలని సుప్రజ తెలిపారు. కవితక్క మేమంతా మీ వెంట ఉన్నామని మద్దత్తు తెలిపారు. ఈ వేడుకల్లో టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి తో పాటు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, పావని కడుదుల, క్రాంతి, స్నేహ,శ్వేతా, మౌనిక, నంతిని, మమతా, హారిక రెడ్డి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన హోం మంత్రి

రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ దర్గాలో ఎమ్మెల్సీ కె. కవిత పుట్టిన రోజు పురస్కరించుకొని సోమవారం నాడు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవిత్ర క్షేత్రమైన అజ్మీర్ దర్గాకు సోమవారం ఉదయం చేరుకున్న హోం మంత్రి దర్గా పెద్దలతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోమ్ మంత్రి మాట్లాడుతూ….. ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పవిత్ర అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసామని తెలిపారు. గతంలో పార్లమెంట్ సభ్యురాలుగా, ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలిగా ఉన్న ఆమెను బిజెపి ప్రభుత్వం రాజకీయంగా ఎదుర్కోలేక, కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని… కేంద్ర ఏజెన్సీల ను వినియోగించి ఇబ్బందులు పెడుతోందని హోం మంత్రి అన్నారు. ఈ పరిస్థితులను కవిత దైర్యంగా ఎదుర్కొంటున్నారని….. ఈ సందర్భంగా అజ్మీర్ దర్గాలో ప్రార్థనలు చేసినట్టు ఆయన తెలియజేశారు. బిఅర్ఎస్ నాయకులు షరీఫ్ఉద్దీన్, ఫూర్ఖాన్ అలీ తదతరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

అజ్మీర్ దర్గాలో తెలంగాణ వాసులకు వసతి సదుపాయం:

అజ్మీర్ దర్గాను సందర్శించే తెలంగాణ వాసుల కోసం వసతి సదుపాయం కల్పించే విషయమై, స్థానిక అధికారులతో రాష్ట్ర హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సోమవారం నాడు సమీక్షించారు. రాజస్థాన్ మైనార్టీ శాఖ మంత్రి సలెహ్ మహమ్మద్, కలెక్టర్ అన్షిదీప్, అభివృద్ధి విభాగపు అధికారి అక్షయ్ గోదార తదితర అధికారులతో కలిసి వసతి సదుపాయానికి అవసరమైన నిధుల గురించి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు దాదాపు 2.40 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిందని హోమ్ మంత్రి సందర్భంగా అధికారులకు తెలియజేశారు. వసతి సదుపాయానికి అవసరమైన భూమి కొనుగోలు , రిజిస్ట్రేషన్ ల నిమిత్తం ఈ నిధులను వెచ్చించి త్వరితగతిన పనులు చేపట్టాల్సి ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అజ్మీర్ దర్గా తో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాశీ , కేరళ రాష్ట్రంలోని శబరిమలై వంటి పుణ్యక్షేత్రాల్లోనూ తెలంగాణ భక్తుల కోసం వసతి సదుపాయాలను నిర్మిస్తుందని హోం మంత్రి ఈ సందర్భంగా వారికి తెలియజేశారు.

MLC కవిత జన్మదిన సందర్భంగా SERP ఉద్యోగుల సంఘం & మహిళలచే పలు జిల్లాల్లో ప్రత్యేక పూజలు

కవిత కు SERP ఉద్యోగులు, మహిళల సంపూర్ణ సంఘీభావం.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా SERP ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా, కమ్మర్ పల్లి మం. చౌటుపల్లి లోని ప్రఖ్యాత కోటిలింగేశ్వర స్వామి మరియు ప్రత్యంగిరా మాత ఆలయంలో SERP ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక ఐకెపి ఏపీఏం కుంట గంగాధర్ రెడ్డి, మహిళా సమాఖ్య ప్రతినిధులు, సిబ్బంది వేద పండితులు గంగా ప్రసాద్ దీక్షిత్ చేతుల మీదుగా అర్చన, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయం లో జిల్లా అధ్యక్షుడు చద్రయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ ఆధ్వర్యంలో మహిళలు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కవిత పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా కేంద్రంలో సర్ఫ్ సిసి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపూరి నరసయ్య రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజప్పల ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సర్ఫ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సుదర్శన్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.

దేవుడు MLC కవిత కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రస్తుతం ఎదురైనా అవాంతరాల నుంచి కడిగిన ముత్యంలా బయటకు రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల డ్వాక్రా మహిళలు, మొత్తం సెర్ప్ సిబ్బంది కవిత గారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా సెర్ఫ్ ఉద్యోగుల స్టేట్ యూనియన్ తరపున రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీసీలు వర్ణం శ్రీనివాస్ , నవీన్ భాగ్యలక్ష్మి పీరియ లు, VOA లు మధురిమ, బాగ్య, వాణీ, మహిళా సమాఖ్య ప్రతినిధులు కవిత, పుష్ప, కౌసర్ సుల్తానా, గంగమ్మ, జమున, మహిళలు పాల్గొన్నారు.

భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాజస్థాన్ లోని జైపూర్ గడ్డమీద ఘనంగా కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

భారత జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సి శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు జైపూర్ గడ్డమీద ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతిగా తెలంగాణలో నలుగురితో మొదలై నేడు లక్ష మంది కార్యకర్తలతో ఈరోజు పని చేస్తోంది. తెలంగాణ లో జాగృతి చేసినటువంటి కార్యక్రమాల పట్ల ఆకర్షితులైన యువతి యువకులు రాజస్థాన్ రాష్ట్రంలో భారత్ జాగృతిగా ఏర్పడి ముందుకు వస్తున్నారు. నేడు రాజస్థాన్ జైపూర్ లోని జైపూర్ పత్రి హవేలీ వద్ద ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు వీరు ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ రాజస్థానీ వస్త్రాలంకరణలో యువతీ యువకులు వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి కారణమైన తేజ్ సింగ్ బాటి , శైలేందర్ సింగ్ , గౌరవ్ రాహుల్ ,శాంతి శర్మ, ప్రియాంక శర్మ తదితరులందరికీ జాగృతి రాష్ట్ర కార్యదర్శి సంగ్రామ్ సింగ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కవితక్క జన్మదిన వేడుకలు జరిపిన జాగృతి నాయకులు

గౌరవ ఎమ్మెల్సీ కవిత గారి జన్మదిన సందర్బంగా జడ్పీ కార్యాలయంలో కేక్ కోసి వారి జన్మదిన వేడుకలు

నిర్వహించిన గౌ. జెడ్పి చైర్మన్ శ్రీ దాదన్నగారి విఠల్ రావు గారు, వీరితో పాటు పాల్గొన్న నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జెడ్పి కో ఆప్షన్ మోయిజ్, కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు రమణారావు, బారాస నాయకులు తెలంగాణ శంకర్, మాణికేశ్వర్ రావు, నుడా డైరెక్టర్స్ రాజేంద్ర ప్రసాద్, అక్తర్ ఖాన్, అంజయ్య, రాకేశ్ చంద్ర, శేఖర్ రాజు, మనోహర్ రావు, జీవన్ రావు.

భారత్ జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ తిరుపతి వర్మ గారి ఆధ్వర్యంలో సుప్రీం కోర్ట్ లో …

భారత్ జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ తిరుపతి వర్మ గారి ఆధ్వర్యంలో సుప్రీం కోర్ట్ లో భారత్ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు భారత రాష్ట్ర సమితి న్యాయవాదులు, భారత్ జాగృతి నాయకులు పాల్గొన్నారు

ఈరోజు భారత జాగృతి వ్యవస్థాపకులు, MLC శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ అశోక్ నగర్ జాగృతి కార్యాలయం లో ….

భారత జాగృతి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు అనంతుల ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ రాజీవ్ సాగర్ గారు,ముఠా జయసింహా మరియు జాగృతి నాయకులు మనోజ్ గౌడ్, సుచిత్ర, సరిత, నాంపల్లి సంతోష్, ఆనంద్,పుట్టి శ్రీను, లతా రావు, శైలజ, వంశీ, తేజ చౌదరి , దస్తగిరి, శేఖర్, కృష్ణ, పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు..

బంగళా ఖాతం సముద్రపు అంచుల్లో… ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా నిజామాబాద్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేసి అభిమానాన్ని చాటుకున్నాడు. అండమాన్ నికోబార్ దీవుల్లో బంగళా ఖాతం సముద్రపు అంచుల లోకి వెళ్లిన చిన్నుగౌడ్, ఇతరులు ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. నీటి అడుగున డైవింగ్ చేస్తూ బ్యానర్లను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను టీస్ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ గారి చేతుల మీదుగా ఆదివారం రాత్రి 12 గంటలకు విడుదల చేసారు. నిజామాబాద్‌కు చెందిన బిఆర్ఎస్ నేత కవితకు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

జాగృతి వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి జన్మదినం

జాగృతి వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి జన్మదినం సందర్భంగా నాగోల్ లోని లాలన ఫౌండేషన్ అనాథ ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి వారికి పండ్లు పంపిణీ చేసి, ఉదయం టిఫిన్ స్పాన్సర్ చేసిన రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి గారు.

ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను జాగృతి వేదిక ద్వారా విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన చరిత్ర ఎమ్మెల్సీ కవితక్క గారిదని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం లో మహిళా లోకాన్ని ఏకం చేస్తూ జరిపిన పోరాటాలు మరువలేనివని,పార్లమెంట్ లో 2016వికలాంగుల హక్కుల చట్టం రావడానికి కృషి చేసిన యోధురాలని, మహిళలకు 33% రెసర్వేషన్ కోసం ఢిల్లీ లో దీక్ష చేసిన తెలంగాణ ఉద్యమ బిడ్డ అని వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడుని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు, ఎమ్మెల్సీ క‌విత‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వ‌హించారు. నిర్మ‌ల్ మున్సిప‌ల్ కార్యాల‌యంలో జ‌రిగిన వేడుక‌ల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ముఖ్యతిధిగా పాల్గొని కేక్ క‌ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ కవితకు జ‌న్మ‌దిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ఈడీ విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న కవితకు సంఘీభావం తెలిపారు.
బీజేపీ వైపల్యాలను బలంగా ఎండగడుతున్నందుకే మహిళా అని కూడా చూడకుండా కక్ష కట్టారని, ప్రణాళికా బద్దంగా క‌విత‌ను టార్గెట్ చేసి, అప్ర‌తిష్ట‌పాలు చేసేందుకు కుట్ర‌లు పన్నుతున్నార‌ని తెలిపారు. ద‌ర్యాప్తు సంస్థ‌ల‌పై గౌర‌వంతోనే క‌విత ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యార‌ని, విచార‌ణ‌కు పూర్తిగా సహకరిస్తున్నార‌ని చెప్పారు. ధైర్యంగా పోరాటం చేస్తున్న క‌విత‌ను ఈ సంద‌ర్భంగా మంత్రి అభినందించారు. తెలంగాణ స‌మాజం మీ వెంటే ఉంద‌ని అధైర్యప‌డ‌వ‌ద్ద‌ని సూచించారు. ఈ కార్యక్ర‌మంలో నిర్మ‌ల్ మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, నిర్మల్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ చిలుక ర‌మ‌ణ‌, నిర్మ‌ల్ ప‌ట్ట‌ణ బీఆర్ఎస్ అధ్య‌క్షుడు మారుగొండ రాము, మున్సిప‌ల్ కౌన్సిల‌ర్లు, ఇత‌ర స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X