हैदराबाद: मुख्यमंत्री रेवंत रेड्डी ने खैरताबाद के महागणपति के दर्शन किये। शनिवार को सीएम ने महागणपति की पहली पूजा की। इसके बाद उन्होंने कहा कि खैरताबाद के गणपति की देश में विशेष मान्यता है। यह तेलंगाना के लिए गर्व की बात है। साथ ही कहा कि भगवान गणेश के आशीर्वाद से तेलंगाना को विकास की ओर लेकर जाएंगे। सरकार ने इस महोत्सव को एक प्रतिष्ठा के रूप में लिया है।
मुख्यमंत्री ने आगे कहा कि इसके एक हिस्से के रूप में सचिवालय में खैरताबाद गणेश के संचालकों से मुलाकात की है और उचित व्यवस्था की है। उन्होंने याद दिलाया कि समारोह को और भव्यता से आयोजित करने के लिए सरकार की ओर से मुफ्त बिजली दी गयी है। इस वर्ष असामयिक वर्षा के कारण राज्य में अप्रत्याशित आपदा आयी। यह भगवान की कृपा थी कि कोई भारी नुकसान नहीं हुआ। इस पूजा में रेवंत रेड्डी के साथ तेलंगाना कांग्रेस प्रभारी दीपादास मुंशी, मंत्री पोन्नम प्रभाकर, अनिल कुमार यादव, दानम नागेंदर, विजया रेड्डी, रोहिन रेड्डी और अन्य शामिल हुए।
Also Read-
ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ఖైరతాబాద్ మహా గణపతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం మహా గణపతికి సీఎం తొలి పూజ చేశారు. అనంతరం ఆయన ప్రసంగించారు. దేశంలోనే ఖైరతాబాద్ గణపతికి ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. ఇది తెలంగాణకు గర్వకారణమని తెలిపారు. ఆ గణపతి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిస్తామని హామీ ఇచ్చారు. ఈ పండుగను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు.
అందులో భాగంగానే నిర్వహకులతో సచివాలయం వేదికగా సమావేశమై తగిన ఏర్పాట్లుచేశామని అన్నారు. ఉత్సవాలను మరింత గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్రభుత్వం తరపున ఉచిత కరెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. అకాల వర్షాలతో ఈ ఏడాది రాష్ట్రంలో అనుకోని విపత్తు వచ్చి పడింది. ఆ దేవుడి దయవల్లే ఎక్కువ నష్టం జరుగలేదని అన్నారు. ఈ పూజలో రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, అనిల్ కుమార్ యాదవ్, దానం నాగేందర్, విజయారెడ్డి, రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (ఏజెన్సీలు)
గాంధీ భవన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
వినాయక చవితి పర్వదినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ ఘనంగా వేడుకలు జరిపుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్ రావ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, అధికార ప్రతినిధులు మహేష్, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు అల్లం భాస్కర్, గజ్జి భాస్కర్, కత్తి వెంకట స్వామి, తదితరులు పాల్గొన్నారు. వేద పండితులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో సంప్రదాయ బద్దంగా వినాయక చవితి ప్రత్యేక పూజలు నిర్వహించారు.