హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యలయంలో వినాయక చవితీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యలయంలో నిర్వహించిన వినాయక చవితీ ఉత్సవాల్లో రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ మాట్లాడుతూ…
దేశ ప్రజలందరికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీ సంకల్పించిన 2047-వికసిత్ భారత్ కల సాకారం అవ్వాలని కోరుకుంటున్నాను. 2047వ సంవత్సరం వరకు భారతదేశం ప్రపంచంలోని శక్తివంతమైన, అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకోవాలని వేడుకున్నాను.
దేశ ప్రజలందరూ నరేంద్రమోదీ గారికి చేయూత అందించి వారి కలలను సాకారం చేయాలని, భారతదేశాన్ని మూడవ ఆర్థిక వ్యవస్థగా మారడానికి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇటీవల సంభవించిన కుంభవృష్టితో వరదల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ విపత్కర పరిస్థితుల నుంచి బాధిత ప్రజలు గట్టెక్కాలని వేడుకున్నాను.
Also Read-
వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రప్రభుత్వ బృందం పర్యటించి నష్టాన్ని అంచనా వేసి బాధిత ప్రజలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. భారతదేశ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో విరజిల్లాలని, ప్రజలు తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.