గవర్నర్లు గడువులోగా బిల్లులు ఆమోదించేలా రాజ్యాంగ సవరణ చేయాలి : వినోద్‌కుమార్‌ (video)

రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 లో సవరణలు చేయాలి

” ఆజ్ సూన్ ఆజ్ పాసిబుల్ ” పదాన్ని మార్చేసి ” విత్ ఇన్ 30 డేస్ ” గా చేయాలి

ఆయా రాష్ట్రాల అసెంబ్లీ, కౌన్సిల్స్ ఆమోదించిన బిల్లులను ఆయా రాష్ట్రాల గవర్నర్లు నిర్ణీత గడువులోగా క్లియర్ చేసే పరిస్థితి ఉండాలి

అందుకే ఆర్టికల్ 200 లో సవరణలు అవసరం

గవర్నర్ల నిర్వాకం వల్ల దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి

బిజెపియేతర (నాన్ బిజెపి) ప్రభుత్వాలకు ఇక్కట్ల పాలు చేస్తున్న గవర్నర్లు

హైదరాబాద్‌ : శాసనసభ, శాసనమండలి ఉభయ సభలు ఆమోదించిన బిల్లులను ఆయా రాష్ట్రాల గవర్నర్లు నిర్ణీత గడువులోగా ఆమోదించేలా రాజ్యాంగ సవరణ చేయాలని లా కమిషన్‌ చైర్మన్‌ రితురాజ్‌ అవస్థికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనకు లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200లో సవరణలు చేయాలని, ‘యాజ్‌ సూన్‌ యాజ్‌ పాసిబుల్‌’ పదాన్ని ‘విత్‌ ఇన్‌ 30 డేస్‌’గా మార్చాలని సూచించారు. గవర్నర్ల నిర్వాకంతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఆయా రాష్ట్రాల శాసనసభ, శాసనమండలిలు ఆమోదించిన బిల్లులను ఆయా రాష్ట్రాల గవర్నర్లు నిర్ణీత గడువులోగా క్లియర్‌ చేసే పరిస్థితి ఉండాలన్నారు.

బీజేపీయేతర (నాన్‌ బీజేపీ) ప్రభుత్వాలను బిల్లులను ఆమోదించకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారని వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఇందు కోసం కేంద్రానికి రాజ్యాంగ సవరణ చేయాలని, దీనికి లా కమిషన్‌ సిఫారసు చేయాలని కోరారు. ‘యాజ్‌ సూన్‌ యాజ్‌ పాసిబుల్‌’ అనే పదాన్ని గవర్నర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటూ.. నెలల తరబడి బిల్లులను క్లియర్‌ చేయకుండా పెండింగ్‌లో పెడుతున్నారని లా కమిషన చైర్మన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఆయా రాష్ట్రాల బిల్లులను నిర్ణీత గడువులోగా క్లియర్‌ చేయడమో, తిరస్కరించడమో.. రాష్ట్రపతికి పంపేలా పరిస్థితులుంటాయని లేఖలో వివరించారు. కానీ, గవర్నర్లు తిరస్కరించకుండా, ఆమోదించకుండా ఏ నిర్ణయం తీసుకోకుండా నెలల కొద్ది రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉంటున్నాయన్నారు. దీంతో ప్రభుత్వ పరిపాలనపై ప్రభావం పడుతుందన్నారు. రాజ్యాంగ నిర్మాతలు రాసిన ఆర్టికల్‌ 200లో ‘యాజ్‌ సూన్‌ యాజ్‌ పాసిబుల్‌’ అనే పదాన్ని గవర్నర్లు తమకు అనుకూలంగా మల్చుకుంటారని ఊహించలేకపోయి ఉండవచ్చునని వినోద్‌కుమార్‌ అన్నారు.

గవర్నర్ల పాత్రపై రాజ్యాంగ నిర్మాతలకు అప్పట్లోనే ఏమాత్రం అనుమానాలు వచ్చినా.. ఆర్టికల్‌ 200లో వేరే రకంగా రాసి ఉండేవారని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాతీర్పుతో ఏర్పాటైన ప్రభుత్వాలను.. రాజకీయంగా నామినేట్‌ అయన గవర్నర్లు ఇబ్బందుల పాలు చేస్తుండడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రాల్లో పరిపాలన, ప్రభుత్వ పథకాలు సరిగా అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ తక్షణ అవసరమన్నారు. గవర్నర్‌ వ్యవస్థతో తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు పరిపాలనాపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వినోద్‌కుమార్‌ గుర్తు చేశారు.

ఆర్టికల్‌ 200లో సవరణలు చేస్తే తప్ప ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ పాలన సాగే పరిస్థితులుండవని, గవర్నర్ల బాధ్యతను, బిల్లుల ఆమోదానికి నిర్ణీత గడువును నిర్ధేశించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కేవలం బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని వినోద్‌ కుమార్‌ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,062 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించి క్లియరెన్స్‌ కోసం గవర్నర్‌కు పంపగా.. నెలలు గడుస్తున్నా ఆ బిల్లు పెండింగ్‌లోనే ఉందని వినోద్‌ కుమార్‌ లా కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ పోస్టుల భర్తీకి అనేక మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, ఇలాంటివి అనేక బిల్లులు వివిధ రాష్ట్రాల్లో గవర్నర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇలాంటి జరగకుండా ఉండాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X