హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికాస్, విశ్వాస్, జన కల్యాణ్ లక్ష్యాలతో సాగుతున్న 12 సంవత్సరాల పాలన పూర్తి సందర్భంగా నిర్వహిస్తున్న విశేష్ జన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఈ రోజు హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Also Read-
ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు, గత 12 సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం సాధించిన ముఖ్య విజయాలు, మైలురాళ్లు మరియు దేశాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్లిన పలు కీలక కార్యక్రమాలను వివరించే పుస్తకాన్ని చిరంజీవికి అందజేశారు.
ఈ సమావేశంలో సమాజం, సంస్కృతి, సినీ రంగం మరియు జాతి నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
