“కేసిఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష”

కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షం అయ్యింది

రైతులు,పేదలు రెండు కండ్లుగా సంక్షేమ పాలన అందిస్తున్నారు

నేడు…అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు

  • మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కమ్మర్పల్లి మండలానికి చెందిన BJP,BSP, కాంగ్రెస్ నాయకులు మరియు రైతు నాయకులు స్వచ్చందంగా భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన,అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా రైతుల కొరకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి వెంట నడవడానికి నిర్ణయించుకొని కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన BJP, BSP, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రైతు నాయకులు బుధవారం నాడు హైదరాబాద్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో స్వచ్చందంగా బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…

కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షం అయ్యిందన్నారు. రైతులు,పేదలు రెండు కండ్లుగా సీఎం కేసిఆర్ సంక్షేమ పాలన అందిస్తున్నారని,నేడు…అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఆయన దార్శనిక పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా ఉన్నదన్నారు. యావత్ భారత దేశం తెలంగాణ అభివృద్ది మోడల్ వైపు ఆసక్తిగా చూస్తోందని తెలిపారు. అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ మోడల్ అభివృద్ది పాలన కావాలని కోరుకుంటున్నారని,కేసిఆర్ నాయకత్వమే దేశానికి,రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

బీజేపీ,బిఎస్పీ,కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో…

పన్నాల గంగారెడ్డి, ముత్యాల లక్ష్మణ్ గౌడ్ BJP, సింగిరెడ్డి ముత్యం రెడ్డి, సింగిరెడ్డి గంగారెడ్డి, కూలిపాటి గంగారెడ్డి, గోవింద్ గంగాధర్ BSP నుండి, కొమ్ములు కిషన్ కాంగ్రెస్ నుండి, రైతు నాయకులు కొమ్ములు రాజేందర్, కొమ్ములు శ్రీధర్, కొమ్ములు మహిపాల్, సింగిరెడ్డి బాలకృష్ణ, సింగిరెడ్డి బాల్ రెడ్డి, వేముల మొహన్ రెడ్డి, వేముల శివారెడ్డి, రేంజర్ల రోహిత్ రెడ్డి, సింగిరెడ్డి జలపతి రెడ్డి, గోపిడి రాజేందర్, సంత రాజేందర్, కొమ్ముల రాజేందర్ తదితరులు పార్టీలో చేరినారు.

కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు పార్టీ ప్రెసిడెంట్ రేగుంట దేవేందర్, కమ్మర్పల్లి సర్పంచ్ గడ్డం స్వామి, అహ్మద్, లుక్కా గంగాధర్, బద్దం చిన్నారెడ్డి, బద్రి రాజేశ్వర్, హల్దే శ్రీనివాస్, సుమన్, సంత రాజేశ్వర్, పాషా కో అప్షన్, సుధాకర్, హరీష్ రెడ్డి, మహేందర్, బొడ దేవేందర్, సదాశివ్ తదితరులు పాల్గొన్నారు

ఒక ఊర్లో రెడ్డి బాగుంటే అందరు బాగుంటారని సీఎం కేసిఆర్ ప్రగాఢంగా విశ్వసిస్తారు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజా బహద్దూర్ వెంకట్ రామిరెడ్డి విద్యా పరిషత్ ట్రస్టు ఆధ్వర్యంలో పేద రెడ్డి మరియు ఇతర విద్యార్థుల కొరకు రెడ్డి హాస్టల్, విద్యాలయం మరియు సంక్షేమ భవనం నిర్మాణ భూమిపూజ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి,మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్,ఎంపీ బీబీ పాటిల్ మరియు జిల్లా నాయకులు,రెడ్డి నాయకులు, బంధువులు..తదితరులు

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్:

రెడ్డి ముఖ్యమంత్రులు కూడా చేయని విధంగా రెడ్డి సమాజం బాగు కోసం కేసిఆర్ కృషి చేశారు. రాజా బహద్దూర్ వెంకట్రామిరెడ్డి ట్రస్టుకు హైదరాబాద్ లో 150 కోట్ల విలువైన 15 ఎకరాల భూమి ఇచ్చారు. నిర్మాణం కోసం 10 కోట్లు నిధులు మంజూరు చేశారు. మర్రి చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి,రాజశేఖర్ రెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ఉమ్మడి రాష్ట్ర రెడ్డి ముఖ్యమంత్రులు కూడా రెడ్డి సమాజం కోసం ఏమీ చేయలేదు.

చాలా మంది చాలా రకాలుగా ప్రచారం చేస్తారు. కానీ…రెడ్డి సమాజం బాగు కోసం అన్ని విధాల సహకరిస్తున్న కేసిఆర్ కు అండగా నిలబడాలి. కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందుతున్న వారిలో రెడ్లమే అగ్ర స్థానంలో ఉంటాం. సీఎం కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న రెడ్డి బంధువులు గుండె మీద చెయ్యి వేసుకుని ఆ విషయాన్ని ఆలోచన చేయాలి.

కామారెడ్డి పట్టణంలో RBVR సొసైటీ సభ్యులు అడగ్గానే పేద రెడ్డి ,ఇతర విద్యార్థుల కోసం 2 ఎకరాల భూమి కేటాయించిన స్థానిక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారికి రెడ్డి సమాజం పక్షాన దన్యవాదాలు. పేద విద్యార్థుల చదువు కోసం RBVR సొసైటీ చేపడుతున్న ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్ లో ప్రభుత్వం నుండి మరింత సహకారం అందుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X