Delhi Liquor Scam : आज होगा बड़ा खुलासा, केजरीवाल कोर्ट में बताएंगे वह पैसा कहां है

हैदराबाद: दिल्ली के सीएम अरविंद केजरीवाल की पत्नी सुनीता केजरीवाल ने कहा है कि दिल्ली शराब घोटाला मामले में ईडी के अधिकारियों ने दो साल में 250 से ज्यादा बार तलाशी ली, लेकिन कहीं पर भी पैसा नहीं मिला है। यह बात खुद अरविंद केजरीवाल ने उन्हें बताई है। अरविंद केजरीवाल गुरुवार को कोर्ट को बताएंगे कि शराब घोटाले से जुड़ा पैसा कहां है। इस दौरान महत्वपूर्ण सबूत भी पेश किए जाएंगे। उन्होंने बुधवार को अरविंद केजरीवाल से मुलाकात की। इसके बाद मीडिया से यह बात कहीं।

सुनीता ने कहा, “सीएम केजरीवाल गुरुवार को कोर्ट को बताएंगे कि शराब घोटाले से जुड़ा पैसा कहां है। इस घोटाले से जुड़े कुछ अहम सबूत भी कोर्ट में पेश किए जाएंगे। उनकी हिरासत गुरुवार को खत्म हो रही है। वह खुद शराब घोटाला मामले की पूरी जानकारी कोर्ट को बताएंगे। उन्होंने मुझे दो साल की अवधि में ईडी द्वारा की गई तलाशी के बारे में बताया। ईडी के अधिकारियों ने मनीष सिसौदिया, संजय सिंह और सत्येन्द्र जैन के घरों और दफ्तरों की तलाशी ली. लेकिन एक रुपया भी नहीं मिला। हमारे घर में 73 हजार रुपये मिले हैं। हमने उसका भी हिसाब-किताब दे दिया है।”

दिल्ली के सीएम अरविंद केजरीवाल की सेहत पर आम आदमी पार्टी के नेता चिंता जता रहे हैं। ईडी की हिरासत में उनकी तबीयत बिगड़ती जा रही है। केजरीवाल मधुमेह के मरीज हैं। ईडी अधिकारी उनके स्वास्थ्य पर ध्यान नहीं दे रही है। डॉक्टरों ने बताया कि एक समय में उनके रक्त शर्करा का स्तर गिरकर 46 मिलीग्राम तक पहुंच गया था। इस स्तर तक गिरना सेहत के लिए बेहद खतरनाक है।

संबंधित खबर :

बुधवार सुबह उनकी पत्नी सुनीता ने अरविंद केजरीवाल से मुलाकात की। इस मौके पर उन्होंने स्वास्थ्य के बारे में जानकारी ली. अरविंद की तबीयत बिगड़ रही है। रक्त शर्करा का स्तर गिर रहा है। सुनीता केजरीवाल ने आप नेताओं, कार्यकर्ताओं और प्रशंसकों से कहा कि वे भगवान से प्रार्थना करें कि वह बीमार न हों और स्वस्थ रहें।

दिल्ली हाई कोर्ट में अरविंद केजरीवाल की ओर से दायर याचिका पर बुधवार को सुनवाई हुई। हालांकि, हाई कोर्ट में उन्हें कोई राहत नहीं मिली। हाई कोर्ट के जज जस्टिस स्वर्णकांत शर्मा ने हिरासत खत्म होने तक ईडी अधिकारियों की जांच में सहयोग करने का सुझाव दिया है। ईडी अधिकारियों को केजरीवाल की याचिका पर 2 अप्रैल से पहले स्पष्टीकरण देने का निर्देश दिया। केजरीवाल की ओर से कपिल सिब्बल और ईडी की ओर से एडिशनल सॉलिसिटर जनरल एसवी राजू ने दिल्ली हाई कोर्ट में अपना-अपना पक्ष रखा है।

सुनीता ने कहा, ”केजरीवाल गुरुवार को कोर्ट में सच क्या है सभी को बताएंगे। अरविंद केजरीवाल बहुत बहादुर इंसान हैं। वह देश को प्रेम करने वाला एक सच्चा इंसान है। भले ही वह मधुमेह से पीड़ित हैं, लेकिन उनका दृढ़ संकल्प महान है।” उन्होंने आगे कहा कि भले ही केजरीवाल ईडी की हिरासत में हैं, लेकिन दिल्ली के लोगों के कल्याण के बारे में सोच रहे हैं। सभी प्रार्थना करें कि केजरीवाल क्लीन चिट के साथ बाहर आये।

ఢిల్లీ లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాలే ఇయ్యాల కోర్టుకు చెప్తరు

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రెండేండ్లలో ఈడీ అధికారులు 250 సార్లకు పైగా సోదాలు చేశారని, అయినా ఎక్కడా డబ్బులు దొరకలేదని ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ తెలిపారు. ఈ విషయాన్ని అర్వింద్ కేజ్రీవాలే తనకు చెప్పినట్టు వివరించారు. లిక్కర్ స్కామ్​కు సంబంధించిన డబ్బు ఎక్కడ ఉందో అర్వింద్ కేజ్రీవాల్ గురువారం కోర్టులో చెప్తారన్నారు. కీలకమైన ఆధారాలు కూడా సమర్పిస్తారని వివరించారు. బుధవారం అర్వింద్ కేజ్రీవాల్​తో ఆమె భేటీ అయ్యారు. తర్వాత సునీత కేజ్రీవాల్ మాట్లాడారు.

‘‘లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డబ్బు ఎక్కడ ఉందో సీఎం కేజ్రీవాల్ గురువారం కోర్టుకు చెప్తారు. ఈ స్కామ్​కు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు కూడా కోర్టుకు అందజేస్తారు. గురువారంతో ఆయన కస్టడీ ముగుస్తుంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయనే స్వయంగా కోర్టుకు వెల్లడిస్తారు. రెండేండ్ల కాలంలో ఈడీ చేసిన సోదాల గురించి ఆయన నాకు చెప్పారు. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. కానీ రూపాయి కూడా దొరకలేదు. మా ఇంట్లో 73 వేలు దొరికాయి. వాటికి కూడా లెక్క చెప్పాం’’అని సునీత తెలిపారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈడీ కస్టడీలో ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నదని తెలిపారు. కేజ్రీవాల్ డయాబెటిక్ పేషెంట్ అని, ఈడీ అధికారులు ఆయన హెల్త్ గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఒకానొక టైమ్​లో బ్లడ్​లో షుగర్ లెవల్స్ 46 మిల్లీ గ్రామ్​కు పడిపోయినట్టు డాక్టర్లు చెప్పారని వివరించారు. ఈ స్థాయికి పడిపోవడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని చెప్పారు.

బుధవారం ఉదయం అర్వింద్ కేజ్రీవాల్​తో ఆయన భార్య సునీత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హెల్త్ గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. ‘‘ అర్వింద్ ఆరోగ్యం క్షీణిస్తున్నది. బ్లడ్​లో షుగర్ లెవల్స్ పడిపోతున్నాయి. ఆయనకేం కావొద్దని, ఆరోగ్యంగా ఉండాలని దేవున్ని ప్రార్థిద్దాం’’ అంటూ ఆప్ నేతలు, కార్యకర్తలు, అభిమానులను సునీత కేజ్రీవాల్ కోరారు.

ఢిల్లీ హైకోర్టులో అర్వింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్​పై బుధవారం విచారణ జరిగింది. అయితే, ఆయనకు హైకోర్టులో ఎలాంటి ఊరట లభించలేదు. కస్టడీ ముగిసే దాకా ఈడీ అధికారుల విచారణకు సహకరించాలని హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత శర్మ సూచించారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్​పై ఏప్రిల్ 2లోపు వివరణ ఇవ్వాల్సిందిగా ఈడీ అధికారులను ఆదేశించారు. కేజ్రీవాల్ తరఫున కపిల్ సిబల్, ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్​వీ రాజు ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు.

‘‘గురువారం కోర్టులో నిజమేంటో అందరికీ చెప్తా అన్నారు. అర్వింద్ కేజ్రీవాల్ చాలా ధైర్యవంతుడు. దేశాన్ని ప్రేమించే వ్యక్తి. నిజాయితీపరుడు. డయాబెటిక్​తో బాధపడుతున్నా ఆయన సంకల్పం ఎంతో గొప్పది’’ అని సునీత కేజ్రీవాల్ అన్నారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ.. ఢిల్లీ ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారని తెలిపారు. కేజ్రీవాల్ క్లీన్​చిట్​తో బయటపడాలని ప్రార్థించాలని కోరారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X