हैदराबाद: तेलंगाना में जब भी केबल ब्रिज का जिक्र आता है तो अब तक हैदराबाद के दुर्गम तालाब पर बने ब्रिज की याद आती है। अब करीमनगर भी उस लिस्ट में शामिल हो जाएगा। करीमनगर के मानेरू नदी पर 224 करोड़ रुपये की लागत से निर्मित केबल ब्रिज शुरू होने को तैयार है। इस पुल से करीमनगर होते हुए वरंगल जाने वाले ट्रैफिक को जाम से मुक्ति मिलेगी और दूरी भी कम होगी।
अधिकारियों ने बताया कि बुधवार शाम को तेलंगाना के आईटी और नगरपालिका मामलों के मंत्री केटी रामाराव इस केबल ब्रिज का उद्घाटन करेंगे। इसको लेकर अधिकारियों ने सभी इंतजाम पूरे कर लिए हैं। पुल के उद्घाटन के दौरान तेलंगाना दशक समारोह के तहत पुल पर सांस्कृतिक कार्यक्रम आयोजित किए जाएंगे।
इस केबल ब्रिज का निर्माण कार्य 19 फरवरी 2018 को शुरू किया गया था। शुरुआत में इस पर 183 करोड़ रुपये खर्च होने का अनुमान था। लेकिन निर्माण, भूमि अधिग्रहण आदि में बदलाव के कारण यह पूरा होने पर 224 करोड़ रुपये तक पहुंच गया। 500 मीटर केबल ब्रिज, करीमनगर कमान से पुल तक 300 मीटर और सदाशिवपल्ली की ओर 500 मीटर का काम पूरा हो चुका है। शेष 3.4 किमी भूमि का अधिग्रहण कर लिया गया है और पहुंच मार्ग (Approach Roads) का निर्माण कर दिया गया है। यदि यह पुल उपलब्ध हो जाता है, तो करीमनगर मनेरू ब्रिज रोड के जरिए जगित्याल, पेद्दापल्ली, आदिलाबाद, सिरिसिल्ला अन्य प्रांतो से वरंगल और विजयवाड़ा जाने वालों की दूरी सात किलोमीटर कम हो जाएगी।
केबल ब्रिज खुलने के बाद वाहनों को ब्रिज पार करने की अनुमति दी जाएगी। लेकिन हर रविवार को वाहनों की नो एंट्री है। यह फैसला इसलिए लिया गया है ताकि लोग ब्रिज पर लगाई गई डायनामिक लाइटिंग का लुत्फ उठा सकें। पुल के रखरखाव के प्रभारी आरएंडबी अधिकारियों की उपस्थिति में पुल पर भोजन और मनोरंजन के स्टॉल लगाए जा रहे हैं। शाम को संगीत, कोरियाई तकनीक के साथ डायनेमिक लाइटिंग सिस्टम और चार एलएनएसईडी स्क्रीन भी लगाए गए हैं ताकि दोस्त और परिवार रोशनी में मौज-मस्ती कर सकें।
यह ब्रिज फोर लेन मार्ग 500 मीटर लंबा है। 26 लंबे स्टील के केबल इटली से लाए गए है। पुल के दो पाइल्स के बीच की दूरी 220 मीटर और बीच की दूरी 110 मीटर है। 224 करोड़ रुपये के बजट से बने इस ब्रिज को पूरी तरह से अत्याधुनिक इंजीनियरिंग से डिजाइन किया गया है। 8 करोड़ रुपये की कोरिया डायनामिक लाइटिंग 21.5 मीटर चौड़ी और सात मीटर चौड़ी है। लुटो कंपनी के नेतृत्व में सड़क के दोनों ओर ढाई मीटर का पुटपाथ बनाया गया है।
తెలంగాణలో మరో కేబుల్ బ్రిడ్జ్
హైదరాబాద్: తెలంగాణలో కేబుల్ బ్రిడ్జి ప్రస్తావన వస్తే ఇప్పటివరకు హైదరాబాద్‌లోని దుర్గం చెరువు మీద నిర్మించిన వంతెనే గుర్తుకొస్తుంది. ఇక మీదట ఆ జాబితాలో కరీంనగర్ కూడా చేరనుంది. కరీంనగర్‌లోని మానేరు నదిపైన రూ224 కోట్ల వ్యయంతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. ఈ బ్రిడ్జ్‌తో కరీంనగర్ మీదుగా వరంగల్‌కు వెళ్లే వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ రద్దీ లేకుండా ఉండటంతో పాటు దూరాభారం కూడా తగ్గనుంది.
బుధవారం సాయంత్రం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి ఈ కేబుల్ బ్రిడ్జ్‌ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు సంబంధిత అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వంతెన ప్రారంభంతో పాటు బ్రిడ్జ్ మీద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు 2018 ఫిబ్రవరి 19న శ్రీకారం చుట్టారు. తొలుత రూ183 కోట్ల వ్యయం అవుతుందని భావించగా నిర్మాణంలో మార్పులు, భూసేకరణ తదితరాల మూలంగా పూర్తయ్యేసరికి రూ.224 కోట్లకు చేరింది. కేబుల్ బ్రిడ్జ్ 500 మీటర్లు, కరీంనగర్ కమాన్ నుంచి వంతెన వరకు 300 మీటర్లు, సదాశివపల్లి వైపు 500 మీటర్ల దూరంలో పనులు పూర్తయ్యాయి. మిగిలిన 3.4 కిలోమీటర్ల వరకు భూసేకరణ చేసి అప్రోచ్ రోడ్లు నిర్మించారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, సిరిసిల్ల తదితర ప్రాంతాల నుంచి కరీంనగర్ మానేరు వంతెన రహదారి మీదుగా వరంగల్, విజయవాడకు వెళ్లే వారికి ఏడు కిలోమీటర్ల దూరం తగ్గనుంది.
తీగల వంతెన ప్రారంభించిన తర్వాత వాహనాలను బ్రిడ్జ్ మీదికి అనుమతిస్తారు. అయితే ప్రతి ఆదివారం మాత్రం వాహనాలకు నో ఎంట్రీ. బ్రిడ్జ్‌పై ఏర్పాటు చేసిన డైనమిక్ లైటింగ్ ఆస్వాదించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వంతెన నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఆర్ అండ్ బీ అధికారుల సమక్షంలోనే బ్రిడ్జిపై ఫుడ్, వినోదాత్మక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం సమయంలో లైటింగ్ వెలుగులో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపేందుకు వీలుగా మ్యూజిక్, కొరియా సాంకేతికతతో డైనమిక్ లైటింగ్ సిస్టమ్, నాలుగు ఎల్ఎన్ఎస్ఈడీ తెరలను కూడా ఏర్పాటు చేశారు.
నాలుగు లైన్ల రహదారితో 500 మీటర్ల పొడవులో ఈ వంతెన ఉంటుంది. 26 పొడవైన స్టీల్ కేబుల్స్ ఇటలీ నుంచి తెప్పించారు. వంతెనకు రెండు పైళ్ల మధ్య దూరం 220 మీటర్లు నుంచి ఇంటర్మీడియట్ కు దూరం 110 మీటర్ ఉంటుంది. రూ224 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ బ్రిడ్జ్ పూర్తిగా అత్యాధునిక ఇంజినీరింగ్‌తో రూపొందించారు. రూ8 కోట్ల కొరియా డైనమిక్ లైటింగ్ వెడల్పు 21.5 మీటర్లు, ఏడు మీటర్ల వెడల్పు ఉంటుంది. రోడ్డుకి ఇరువైపులా 2.5 మీటర్ల పుట్‌పాత్‌ను లూటో కంపెనీ సారథ్యంలో నిర్మించారు. (ఏజెన్సీలు)
