Andhra Pradesh: किसान को खेत में मिला कीमती हीरा, बन गया करोड़ पति!

हैदराबाद: श्री कृष्णदेव राय के शासित प्रदेश को हीरों का प्रांत कहा जाता है। कहा जाता है श्री कृष्णदेव राय के समय में लोग बेहिसाब हीरे बेचते थे। अब वही बात सच हो रही है। कर्नूल, रायलसीमा और अनंतपुर जिले (आंध्र प्रदेश) में लोगों को हीरे मिल रहे हैं। हाल ही में कर्नूल जिले में बारिश के चलते खेतों में हीरों का निकलना शुरू हो गया है। स्थानीय गांवों के लोग हीरों को ढूंढने में लगे हैं। एक हीरा मिल जाए तो करोड़पति बन सकते है। ऐसा हुआ तो लाइफ सेट जाता है। इसी उम्मीद से लोग हीरों की खोज शुरू कर दी है। कुछ लोगों को इसी क्रम में हीरे भी मिल रहे हैं।

हाल ही में कर्नूल जिले के तुग्गली बसनेपल्ली गांव में एक किसान को एक कीमती हीरा मिला। किसान को खेत का काम करते हुए यह हीरा मिल गया। इसकी जानकारी मिलने पर व्यापारी किसान के पास उसे खरीदने के लिए कतार में लग गए। हीरा खरीदने की होड़ मच गई। इस हीरे की कीमत 2 करोड़ रुपए बताई जा रही है। खबर मिली है कि गुत्ती के एक व्यापारी ने उस हीरे को खरीद लिया है।

రైతుకు పొలంలో దొరికింది విలువైన వజ్రం

హైదరాబాద్: రాయలు ఏలిన రతనాల సీమ. అవును శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు రాసులుగా పోసి అమ్మవారి చెబుతుండేవారు. ఇప్పుడు అదే నిజం అవుతోంది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లా (ఆంధ్రప్రదేశ్)ల్లో వజ్రాలు బయటపడుతున్నాయి. ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో వజ్రాల వేట ప్రారంభమైంది. స్థానిక గ్రామాల ప్రజలు వజ్రాల వేటలో బిజీగా అయ్యారు. ఒక్క వజ్రం దొరికితే చాలు లక్షాదికారి అవ్వొచ్చు జీవితం సెటిలైనట్లే. ఆ ఆశతోనే వజ్రాల గాలింపు మొదలైంది. ఈ క్రమంలోనే కొందరికి వజ్రాలు దొరికాయి.

తాజాగా కర్నూలు జిల్లా తుగ్గలి బసనేపల్లిలో ఓ రైతుకు విలువైన వజ్రం దొరికింది. పొలం పనులు చేస్తుండగా రైతుకు వజ్రం దొరికింది. ఈ విషయం తెలియడంతో ఆ రైతు దగ్గరకు వ్యాపారులు క్యూ కట్టారు. వజ్రాన్ని కొనుగోలు చేయడానికి పోటీపడ్డారు. ఈ వజ్రం విలువ రూ 2 కోట్ల విలువ ఉంటుందని చెబుతున్నారు. గుత్తికి చెందిన వ్యాపారి వజ్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సమయంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. గ్రామాల్లో అందరూ పొలాలవైపు వెళ్లి వజ్రాల వేటల బిజీ అవుతారు. స్థానికులే కాదు చుట్టు పక్కల జిల్లాల నుంచి వజ్రాల వేట కోసం చాలామంది వస్తుంటారు. ఒక్క వజ్రమైనా దొరక్కపొదా అనే ఆశతో వెతుకుతుంటారు. ఒకవేళ మెరుస్తూ రాయి కనిపిస్తే చాలు వజ్రాల వ్యాపారి దగ్గరకు పరుగులు పెడుతున్నారు.

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రతి ఏటా తొలకరి తర్వాత స్థానికులు వజ్రాల వేట మొదలవుతుంది. స్థానికులు ఊరిలో ఉన్న పొలాలకు క్యూ కడతారు. వజ్రాల వేటలో బిజీ అవుతారు. కొద్దిరోజులుగా వర్షాలు పడటంతో వజ్రాలు పైకి లేస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లోని తుగ్గలి, మద్దికెర, బసినేపల్లి, జొన్నగిరి, ఎర్రగుడి, పెరవలి, అగ్రహారం, పగిడిరాయి, గిరిగెట్ల, రాతన కొత్తూరు, గిరిగెట్ల, అమినాబాద్, రాతన ప్రాంతాల్లో వజ్రాల కారణంగా ప్రాముఖ్యత ఉంది. ఆ గ్రామాల భూముల్లో ఏటా వర్షాకాలంలో వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి. అందుకే ఈ సీజన్‌లో జనాలు ఆశతో వజ్రాల కోసం గాలిస్తుంటారు.

గతంలో కూడా కర్నూలు జిల్లాలో విలువైన వజ్రాలు బయటపడ్డాయి. వ్యాపారులు వీటిని కొనుగోలు చేసేందుకు పోటీపడుతుంటారు. రూ. కోట్లలో ధర పలికిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. చాలామంది రైతులు, సాధారణ మహిళలు, కూలీలు కోటీశ్వరులు, లక్షాదికారులైన సందర్భాలు ఉన్నాయి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X