“కేంద్రం సకాలంలో కమీషన్ చెల్లిస్తున్నా సొంతానికి వాడుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం”

పేదల నోటికాడ ముద్దను అందకుండా చేస్తారా?

-కేంద్రం బియ్యం పంపినా పేదలకు పంచరా?

-రేషన్ డీలర్ల డిమాండ్లను పరిష్కరించడంలో కేసీఆర్ ఫెయిల్

-కేంద్రం సకాలంలో కమీషన్ చెల్లిస్తున్నా సొంతానికి వాడుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం

-ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంవల్లే డీలర్లు సమ్మె చేసే దుస్థితి

-తక్షణమే డీలర్ల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందే

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

హైదరాబాద్: రేషన్ డీలర్ల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఏళ్ల తరబడి వాళ్ల సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గు చేటు. రేషన్ డీలర్లను పిలిచి మాట్లాడే తీరిక ముఖ్యమంత్రికి లేకపోవడం బాధాకరం.

• మే 22న సమ్మె నోటీస్ ఇచ్చిన తరువాత వాళ్ల సమస్యలన్నీ పరిష్కారిస్తామని, ఈ మేరకు జూన్ ఫస్ట్ న జీవోలను విడుదల చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ ఒక్క జీవో కూడా విడుదల చేయకపోవడం సిగ్గు చేటు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడంవల్లే రేషన్ డీలర్లు సమ్మె చేయాల్సి వచ్చంది.

• రేషన్ డీలర్ల సమ్మె వల్ల పేద ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. పేదలకు బియ్యం అందించలేని దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలకు రేషన్ నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నా వాటిని పేదలకు అందించకుండా కేసీఆర్ ప్రభుత్వం పేదల పొట్టకొడుతోంది.

• రేషన్ డీలర్లు కోవిడ్ టైంలో కూడా ప్రాణాలకు తెగించి పనిచేశారు. ఏ ఒక్కరూ పస్తులుండకూడదనే ఉద్దేశంతో నరేంద్రమోద ప్రభుత్వం దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం కేటాయిస్తే…. తెలంగాణలో పేదలందరికీ రేషన్ డీలర్లు బియ్యం అందిస్తూ సేవలందించారు.

• రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్లో సగం మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్తోంది. ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్రం ఠంచన్ గా కమీషన్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తోంది. అయినా ఆ సొమ్మును డీలర్లకు ఇవ్వకుండా సొంత అవసరాలకు వాడుకుంటూ డీలర్లకు సకాలంలో చెల్లించకపోవడం దుర్మార్గం.

• వడ్ల కొనుగోలు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అలసత్వం వహిస్తూ రైతులతో చెలగాటమాడుతోంది. వడ్ల కొనుగోలుకయ్యే సొమ్మునంతా కేంద్రమే చెల్లిస్తోంది. వడ్లను సేకరించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కమీషన్ కూడా ఇస్తోంది. అయినా నేటికీ రైతుల నుండి వడ్లను కొనుగోలు చేయకుండా కళ్లెల వద్ద పడిగాపులు కాసేలా చేస్తూ వాళ్ల ఉసురు తీస్తోంది.

• ఇప్పటికైనా రేషన్ డీలర్ల సమస్యను పరిష్కరించాలి. పంతాలు పట్టింపులకు పోయి సమ్మెను పరిష్కరించకుండా పేదల నోటికాడ మద్దను లాక్కోవాలని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X