हैदराबाद: केंद्रीय गृह मंत्री अमित शाह ने CISF के 54वें राइजिंग डे परेड में बतौर मुख्य अतिथि के रूप में शिरकत की। उनके साथ केंद्रीय मंत्री जी किशन रेड्डी, राज्यपाल तमिलिसाई सौंदरराजन, सांसद डॉ के लक्ष्मण समेत कई वरिष्ठ अधिकारी मौजूद थे। इस दौरान अमित शाह ने शहीदों को श्रद्धांजलि दी और CISF पुलिस की सलामी ली।
अमित शाह शनिवार की रात को हैदराबाद पहुंचे। हकीमपेट एयरपोर्ट पर केंद्रीय मंत्री किशन रेड्डी, डॉ लक्ष्मण, बंडी संजय और अन्य नेताओं ने उनका स्वागत किया। वहां से अमित शाह राष्ट्रीय औद्योगिक सुरक्षा अकादमी (NISA) पहुंचे। वहां अमित शाह ने बीजेपी के प्रदेश प्रभारी तरुण चुघ से मुलाकात की। पता चला है कि इस मुलाकात के दौरान तेलंगाना की राजनीति और एमएलसी कविता ईडी की जांच पर चर्चा की गई।
హైదరాబాద్ పర్యటనలో అమిత్ షా, సీఐఎస్ఎఫ్ పరేడ్‌లో పాల్గొన్నారు, దీనికంటే ముందు…
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా 54 వ సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళి సై, ఎంపీ లక్ష్మణ్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరులకు నివాళులర్పించిన అమిత్ షా సీఐఎస్ఎఫ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అమిత్ షా మార్చి 11 రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సంజయ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి అమిత్ షా నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ- (NISA)కి వెళ్లారు. అక్కడ బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ తో అమిత్ షా భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలు, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లోని హకీంపేట్ కి విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను మర్యాద పూర్వకంగా కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. హైదరాబాద్ విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను హకీంపేట్ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ్, తమిళనాడు సహా ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు గరికిపాటి మోహన్ రావు, విజయశాంతి, జితేందర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు.
(ఏజెన్సీలు)